Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Beauty Tips: చర్మ రకాన్ని బట్టి ఎలాంటి ఫేషియల్ ఎంచుకోవాలో తెలుసా?
ముఖంపై చర్మాన్ని ఫేషియల్స్ రిలాక్స్‌గా, రిఫ్రెష్‌గా, మెరిసేలా చేస్తాయి. ఫేషియల్ ముఖంపై ఉన్న చర్మానికి రక్త ప్రసరణను, శోషరస ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మంలోకి పోషకాలు చొప్పించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫేషియల్స్‌లో చాలా రకాలు ఉంటాయి. యాక్నే తగ్గించడం నుండి చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి రకరకాల ఫేషియల్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.
రకరకాల ఫేషియల్స్ ను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి మెడి ఫేషియల్, మరొకటి స్పా క్లినిక్ ఫేషియల్. వివిధ ఫేషియల్స్ ఉన్నప్పటికీ.. అవి ఈ రెండింటిలో ఏదో ఒక దాని కిందకు వస్తుంది. అయితే ఈ ఫేషియల్స్ లో ఎలాంటివి వాడాలి, చర్మ రకాన్ని బట్టి ఏది ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.

మెడి ఫేషియల్స్:
మెడి ఫేషియల్స్ అంటే మెడికల్-గ్రేడ్ ఫేషియల్స్. ఈ ఫేషియల్స్ ను ఏదైనా చర్మ సమస్యలు, రుగ్మతలకు చికిత్స చేయడానికి వాడతారు. ఈ మెడి ఫేషియల్స్ ఎలాంటి చర్మ రకానికైనా సురక్షితంగానే ఉంటాయి. లేజర్‌లు, మైక్రోకరెంట్ లు, డెర్మాప్లానింగ్, ఫోటో రిజువెనేషన్, ఎల్ఈడీ థెరపీ, పీల్స్, మైక్రోడెర్మాబ్రేషన్, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ లాంటి వివిధ రకాల పరికరాలు, సాంకేతిక ఉపయోగించి సర్టిఫికేట్ పొందిన అనుభవజ్ఞులైన చర్మవ్యాధి నిపుులు ఈ మెడి ఫేషియల్స్ చేస్తారు.
డల్, డ్రై, లూజ్ స్కిన్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేయడంలో ఈ మెడి ఫేషియల్స్ సహాయపడతాయి. చర్మాన్ని రిపేర్ చేస్తారు. యవ్వనంగా, మెరిసే విధంగా, హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తారు. సూర్య కిరణాల వల్ల దెబ్బతిన్న చర్మకణాలను బాగు చేయడానికి, పిగ్మెంటేషన్ సమస్యలు, చర్మ వృద్ధాప్యం, మొటిమల సమస్యలను మెడి ఫేషియల్ ద్వారా పరిష్కరిస్తారు.
రిలాక్సింగ్ ఫేషియల్స్:
ఈ ఫేషియల్స్ ను సెలూన్లలో, స్పాలలో చేస్తారు. ఈ ఫేషియల్స్ చర్మాన్ని రిలాక్స్ చేస్తాయి. ఇందులో వాడే పదార్థాలు వేర్వేరుగా ఉంటాయి. అవి చర్మ రకాన్ని బట్టి ఎంచుకుంటారు. చర్మం జిడ్డుగా ఉంటే ఎక్స్‌ఫోలియేట్చేసే పదార్థాలతో ఫేషియల్ చేస్తారు. చర్మం నుండి నూనెను, ధూళిని పీల్చుకోవడానికి సహాయపడే క్లే మాస్క్ లను ఎక్కువగా వాడతారు. పొడి మరియు సున్నితమైన చర్మం కోసం ఇతర పదార్థాలను వాడతారు. చర్మ కణాలను పునరుజ్జీవింప చేయడానికి సీవీడ్ సారం, హైలురోనికి యాసిడ్, కొల్లాజెన్ క్రీమ్ లను ఉపయోగిస్తారు.
ఫేషియల్ వల్ల కలిగే ప్రయోజనాలు:
ఫేషియల్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ సమయంలో మంచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు. తరచూ చేసే ఫేషియల్ వల్ల కాంతివంతమైన చర్మం సొంతమవుతుంది. చర్మ రకాన్ని బట్టి సరైన ఫేషియల్ ఎంచుకోవడమే కీలకం.
* బిగుతైన చర్మం
* మాయిశ్చరైజ్డ్ చర్మం
* ఎక్స్‌ఫోలియేట్, మృదువైన చర్మం
* యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రయోజనాలు
* చర్మ వృద్ధాప్యాన్ని తగ్గించడం
* మెరిసే, కాంతివంతమైన చర్మం
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications