Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వేసవికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారిందా? ఇలా చేస్తే మెరిసే చర్మం సొంతమవుతుంది
వేసవిలో చర్మ సమస్యలు బాధిస్తాయి. పొడి వాతావరణం వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. దీంతో పాటు ఎండలో బయటకు వెళ్తే సూర్య కిరణాల వల్ల చర్మం కందిపోతుంది. పొడిబారిన చర్మం మరింత చికాకు పెడుతుంది. ఈ వేసవి ఎండ నేరుగా చర్మంపై పడకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తుంటారు.
ముఖ చర్మం సహజ తేమను కోల్పోయి పొడిగా మారడం వల్ల చికాకు, పిగ్మెంటేషన్, ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఈ వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఎలాంటి చిట్కాలతో చర్మ సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైడ్రేటింగ్, ప్లంపింగ్ సీరమ్‌లను ఉపయోగించాలి:
చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా హానికరమైన యూవీ కిరణాలు, కాలుష్యం నుండి హైడ్రేటింగ్, ప్లంపింగ్ సీరమ్ లు కాపాడతాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి. సీరమ్‌లు యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు అందిస్తాయి.
జెల్ మాయిశ్చరైజర్ వాడాలి:
మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం తేమను కోల్పోదు. ఆరోగ్యకరమైన చర్మానికి మంచి మాయిశ్చరైజర్ కీలకం. వేసవిలో, తేలికైన లేదా జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ వాడటం ముఖ్యం. ఇది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి:
సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ - SPF అధికంగా ఉన్న సన్‌స్క్రీన్ ఎంచుకోవాలి. దీని వల్ల వేసవికాలంలో సూర్య కిరణాల వల్ల చర్మ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఎండల వల్ల చెమట వచ్చి జిడ్డుగా మారుతుంది. మ్యాట్ ఫినిషింగ్ తో కూడిన సన్‌స్క్రీన్‌ని ఎంచుకోవాలి.
హైడ్రేటింగ్ ఫేస్ మాస్క్‌లను వాడాలి:
మాయిశ్చరైజింగ్ ఫేస్ మాస్క్‌తో చర్మానికి అదనపు తేమ అందుతుంది. కలబంద, తేనె, అవొకాడో లేదా దోసకాయ వంటి వాటితో తయారు చేసిన ఫేస్ మాస్క్ లను వాడాలి. అవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.
ఎక్కువ నీళ్లు తాగాలి:
కాలంతో సంబంధం లేకుండా రోజూ తగినన్ని నీరు తాగాలి. వేసవికాలంలో మూత్రం రూపంలో, చెమట రూపంలో శరీరం నుండి పోయిన నీటిని భర్తీ చేసేందుకు పుష్కలంగా నీరు తాగాలి. దీని వల్ల చర్మం తేమగా ఉంటుంది.
సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి:
పుచ్చకాయలు, నారింజలు, దోసకాయ, స్ట్రాబెర్రీ వంటి నీటి శాతం ఎక్కువుండే ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని తేమగా ఉంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే టీ, కాఫీ వంటి వాటిని తాగడం వల్ల డీహైడ్రేషెన్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications