Latest Updates
-
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా?
ఇదొక్క ఐటమ్ చాలు.. నల్లగా మాడిపోయిన చర్మం కూడా క్షణంలోనే మిలమిలా మెరిసిపోతుంది
అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికీ బయటికి వెళ్ళినప్పుడు చాలా అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ ఎదో ఒక విధమైన ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. కొందరు పేస్ క్రీమ్స్, మరికొందరు ఫేస్ వాష్‌లు వినియోగించడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ అసలైన వాస్తవం ఏంటంటే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి వారు అనుకున్న ఫలితం అయితే రాదు. అంతేకాదు అందులో వినియోగించే రసాయన పదార్థాలు కారణంగా చర్మం ఇంకా చెండాలంగా మారే అవకాశం ఉంటుంది.
అయితే అలా కాకుండా ఉండాలన్నా, చర్మం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలన్నా ఒక చిట్కా ఉంది. అదే పసుపు ఐస్ క్యూబ్స్. ఇది చర్మానికి చల్లదనం చేకూర్చడంతో పాటు ఒక అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పసుపు ఐస్ క్యూబ్ వాడకం వల్ల కలిగే లాభాలు
పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని రక్షించడంలో ఎంతో సహాయపడతాయి. ఇవి ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు, కాలిన మరకల్ని తగ్గిస్తాయి. వేసవి కాలంలో చర్మానికి తక్షణమే చల్లదనాన్ని అందిస్తూ చర్మ కాంతిని, చర్మం మెరిసే విధానాన్ని రెండు రెట్లు పెంచుతాయి. దీంతో పాటు ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను చాలా వరకు తగ్గించగలుగుతాయి. ముఖ రంధ్రాలను బిగుతుగా మార్చి, చర్మంపై వచ్చే ముడతలను తొలగించుతాయి. దీంతో పాటు రంగు మారిన చర్మాన్ని.. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. అలాగే చర్మాన్ని చల్లగా మార్చడంతో పాటు చర్మ అలసటను తగ్గించి చర్మ కాంతిని పెంచుతాయి.
పసుపు ఐస్ క్యూబ్స్ తయారీకి కావలసిన పదార్థాలు
పసుపు పొడి - 1 టీస్పూన్
రోజ్ వాటర్ - 1 కప్పు
కలబంద (అలోవెరా) జెల్ - 1 టీస్పూన్
ఐస్ ట్రే - 1
పసుపు ఐస్ క్యూబ్స్ తయారీ విధానం
ఒక గిన్నెలో రోజ్ వాటర్ తీసుకుని అందులో పసుపు పొడిని వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమంలో కలబంద జెల్ చేర్చి మళ్ళీ బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి, ఫ్రిజ్‌లో ఉంచాలి.
రాత్రంతా గడ్డకట్టిన తర్వాత, ఉదయాన్నే ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ముఖంపై నెమ్మదిగా రుద్దాలి.
మొటిమలు లేదా మచ్చలు ఉన్న ప్రాంతాల్లో క్యూబ్‌ను 1-2 నిమిషాల పాటు ఉపయోగించాలి.
ఐస్ అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.
వాడే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి
వారానికి 2 లేదా 3 సార్లకంటే ఎక్కువ ఉపయోగించరాదు.
చర్మాన్ని ఎక్కువసేపు రుద్దకుండా జాగ్రత్తగా అప్లై చేయాలి.
సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
చివరగా
తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ పసుపు ఐస్ క్యూబ్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. సహజ పదార్థాలతో తయారైన ఈ చిట్కా ద్వారా మీ ముఖం మెరిసిపోయేలా మారుతుంది. వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఇది తప్పనిసరిగా ఉపయోగించాల్సిన హోమ్ రెమెడీ.



Click it and Unblock the Notifications
