Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ ఒక్క పదార్థాన్ని ముఖానికి రాసుకుంటే,రెండురోజుల్లో తళతళా మెరిసిపోతారు.. మొటిమలు కూడా మాయం
ప్రతి ఒక్కరికీ అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. బయటికివెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ తమవైపే చూడాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ ఫలితాలు మాత్రం చాలా నామమాత్రంగా వస్తుంటాయి. అయితే సహజసిద్ధంగా అందంగా కనిపించేందుకు ఉపయోగపడే ముఖ్యమైన పదార్థం ఏదైనా ఉందంటే అది ముల్తానీ మట్టి.
దీనిని సరిగ్గా వినియోగించుకుంటే చర్మ సంబంధిత సమస్యలు దూరమవడంతో పాటు, తళతళా మెరిసిపోతారు. అసలు ముల్తానీ మట్టిని ఏ విధంగా వాడాలి? ముల్తానీ మట్టి వాడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

ముల్తానీ మట్టి వల్ల కలిగే ప్రయోజనాలు
ముల్తానీ మట్టిని సరిగ్గా ఉపయోగిస్తే, చర్మం సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా పొడి చర్మం, జిడ్డు చర్మం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ మట్టి ముఖానికి సహజమైన కాంతిని తెస్తుంది. దాంతో మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ముల్తానీ మట్టి ముఖంపై రాసినప్పుడు, ఇది లోతుగా ఉండే నూనెను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.
ఏ విధంగా వాడాలి
ముల్తానీ మట్టిని ఉపయోగించే ముందు దానిని బాగా సిద్ధం చేయడం అవసరం. దీనికి.. ముల్తానీ మట్టిని రోజ్ వాటర్‌తో కలిపి ఒక పేస్ట్ తయారుచేయాలి. ఈ ముద్దను ముఖంపై అప్లై చేసిన తరువాత, ముఖం నెమ్మదిగా ప్రకాశించడం మొదలవుతుంది.
మీకు పొడిగా ఉన్న చర్మం ఉంటే, ముల్తానీ మట్టిని పాలు లేదా పెరుగులో కలిపి ఉపయోగించండి. దీని వలన, చర్మం క్రమంగా మృదువుగా మారిపోతుంది. అలాగే తెల్లబడడం ప్రారంభిస్తుంది. జిడ్డు చర్మాన్ని తొలగించడానికి ముల్తానీ మట్టి, నిమ్మరసం కలిపి ముఖంపై రాయడం మంచిది. ఇది జిడ్డు చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలి
ముల్తానీ మట్టి పేస్ట్ తయారు చేయడానికి.. ఒక గిన్నెలో మట్టిని బాగా బాగా కలపాలి. ఆ తరువాత అందులో కావాల్సిన పదార్థాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే చాలా సులభంగా ముల్తానీ ముట్టి ఫేస్ ప్యాక్ సిద్ధమైపోతుంది. అయితే ఈ ముల్తానీ మట్టిని ముఖానికి రాసుకోవడానికి 15 నిమిషాల ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ముల్తానీ మట్టిని సున్నితంగా ముఖానికి రాసుకోవాలి. ఆ తరువాత ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరబెట్టాలి. అనంతరం దానిని నీరు పూసుకుంటూ సున్నితంగా తొలగించుకుంటే ముఖం తళతళా మెరిసిపోతుంది.



Click it and Unblock the Notifications