Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
శరీరానికి ఉపశమనం కలిగించే లెమన్ షవర్ బాత్
శరీరానికి ఉపశమనం కలిగి తిరిగి ఉత్తేజం పొందేందుకు మార్గం సబ్బుని వాడకుండా కేవలం నిమ్మకాయతో స్నానం చెయ్యడం. ముఖ్యంగా క్లోరినేటెడ్ అయిన ఈత కొలనులోని ఈత కొట్టిన తర్వాత నిమ్మకాయతో స్నానం ఏంతో ప్రయోజనకరం. నిమ్మకాయలో ఉండే ఆమ్ల గుణం చర్మాన్ని శుభ్రపరిచే తేలికపాటి రసాయనంలా పనిచేసి మృదువైన చర్మాన్ని పెంపొందిస్తుంది.
పద్దతులు
1. ఒక నిమ్మకాయని తీసుకోండి. స్నానానికి ఉపయోగించే నిమ్మకాయ లేత రంగులో ఉండాలి. ఆకుపచ్చని చుక్కలు ఉన్నా పరువాలేదు. ముదురు రంగు నిమ్మకాయల కంటే లేత రంగు నిమ్మకాయలని వాడడం మంచిది.
2. నిమ్మకాయని వలవండి. పెద్ద పరిమాణంలో ఉండేలా తొక్కలు వలిస్తే మంచిది.నిమ్మకాయమీద సన్నని తెల్లని పొరని మిగిల్చేలా వలిచి, నిమ్మకాయని రెండు సమాన భాగాలుగా తరగండి. స్నానం ప్రారంభించండి.

3. మీ జుట్టుని నీళ్ళతో కడగండి. అర చెక్క నిమ్మ బద్దని తొక్క ఉన్న వైపు పట్టుకుని సుతారంగా నిమ్మ రసాన్ని మీ తలపై పిండండి. ఇప్పుడు తొక్క ఉన్న వైపుతో మీ జుట్టుపైన రుద్దండి. ఒక వేల మీరు రసం పిండే వైపు తల పైన రుద్దితే జుట్టులో నిమ్మ కాయకి సంబందించిన గుజ్జు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. జుట్టు మొత్తాన్ని ఇలా నిమ్మ చెక్కతో శుభ్రం చెయ్యండి.
4. మీ జుట్టుకి కండిషనింగ్ చెయ్యండి: రెండు చేతులలోని పెద్ద పరిమాణంలో ఉన్న నిమ్మ తొక్కలని తీసుకుని, తొక్క వెనుక భాగంతో మీ జుట్టుపైన రుద్దండి. పొడవైన జుట్టుని శుభ్రం చెయ్యడానికి రెండు చేతులని ఉపయోగించండి. మీ జుట్టుని పూర్తిగా నిమ్మ తొక్కతో రుద్దిన తరువాత శుభ్రంగా కడగండి.
5. మీ ముఖాన్ని, శరీరాన్ని నీళ్ళతో శుభ్రం చేసుకోండి. మీ జుట్టుని ఏ విధంగా నిమ్మ చెక్కతో శుభ్రం చేసుకున్నారో అదే విధంగా మీ ముఖాన్ని నిమ్మ చెక్కతో శుభ్రం చేసుకోండి. మీ ముఖాన్ని కడిగిన తరువాత మిగిలిన నిమ్మ చెక్కలతో మీ శరీరాన్ని శుభ్రం చేసుకోండి.
6.చర్మంపైన ఉన్న నిమ్మ శేషాలు తొలగిపోయే దాకా బాగా కడగాలి. నిమ్మకాయ తో చేసిన స్నానం తర్వాత మృదువైన చర్మపు అనుభూతిని మీ సొంతం చేసుకోండి.
చిట్కాలు:
నిమ్మ తొక్కని వలిచేటప్పుడు మొత్తం తొక్క ఒకే సారి వచ్చేలా జాగ్రత్తగా వలిచి, నిమ్మ తొక్కని రెండు భాగాలుగా చేయండి.
హెచ్చరిక:
1. నిమ్మరసాన్ని కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడండి.
2. మీ శరీర తత్వాన్ని బట్టి మీ చర్మానికి నిమ్మకాయలోని ఆమ్ల గుణాలని తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. ఒక వేళ మీ శరీరం పైన సున్నితమైన ప్రదేశాలలో మీకు చర్మం మండుతున్నట్లుగా కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు అనిపిస్తే, నిమ్మకాయతో స్నానాన్ని ఇకముందు పాటించకండి.



Click it and Unblock the Notifications
