Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
శరీరాన్ని ఉత్తేజపరిచే డిటాక్స్ స్నానం చేయడం ఎలా..?
స్నానం ద్వారా శరీరంలోని విషతుల్యమైన మలినాలను తొలగించి నీటిలో ఉన్న ఖనిజాలని, పోషకాలని మన చర్మానికి అందించే పద్దతిని డిటాక్సిఫికేషన్ అని అంటారు. ఇది ప్రాచిన కాలం నుండి ఆచరణలో ఉంది. సౌకర్యంగా ఇంటిలోనే ఈ పద్దతిని పాటించవచ్చు. డిటాక్సిఫికేషన్ పద్దతిలో చెమట ద్వారా మన చర్మం మలినాలను తొలగిస్తుంది కాబట్టి మూడవ ముత్రపిండంగా చర్మాన్ని పరిగణించవచ్చు. ఈ డిటాక్స్(డిటాక్సిఫికేషన్)స్నానం శరీరాన్ని చాలా ఉత్సాహ పరుస్తుంది. ఈ డిటాక్స్ స్నానం చేసే పద్దతులు తెలుసుకుందాం...
1. కనీసం 40 నిమిషాలు ఈ డిటాక్స్ స్నానానికి కేటాయించాలి. మొదటి 20 నిమిషాలు శరీరంలోని మలినాలను తొలగించడానికైతే తరువాతి 20 నిమిషాలు నీటిలో ఉన్న పోషకాలు మరియు ఖనిజాలను గ్రహించడానికి అవసరం.
2. మీకు సౌకర్యవంతమైన వేడి ఉండేంత నీటితో స్నానపు తొట్టిని నింపుకోవాలి. క్లోరిన్ ఫిల్టర్ ని వాడితే మంచిది.

3. ఎప్సోం లవణాలని (మెగ్నీషియం సల్ఫేట్) నీళ్ళలో కలపండి. నీటిలో నానిన ఎప్సోం లవణాలు మన శరీరానికి మెగ్నీషియం స్థాయిలని తగినంత అందించి రక్తపోటుని అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి. మెదడు కణాల మరియు కీళ్ళ కణాల నిర్మాణానికి సల్ఫేట్ మలినాలని తొలగించటం ద్వారా ఉపయోగపడుతుంది. ఎప్సం లవణం మనకి అందుబాటు ధరలోనే లభిస్తుంది. ఈ లవణం తోటల దగ్గర పెద్ద సంచులలో, లేదా మందులు తయారు చేసే ప్రదేశాలలోని మందుల దుకాణంలో తగిన ప్రమాణాలలో దొరకుతుంది. మరీ పెద్ద మొత్తాలలో కావాలంటే వ్యవసాయ కేంద్రాల నుండి కొనుక్కోవచ్చు.
4. ఒకటి లేదా రెండు కప్పుల బేకింగ్ సోడా (సోడియం బైకార్బనేట్)ని కూడా కలుపుకోవచ్చు. బేకింగ్ సోడాకి శుభ్రపరిచే గుణంతో పాటు ఫంగస్ ని నిర్మూలించే లక్షణం ఉంది. చర్మాన్ని మృదువుగా చేయడంలో తోడ్పడుతుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర రసాయన ప్రాంతంలో పెద్ద సంచులు లభిస్తాయి. కాని బేకరీలో లభించే బేకింగ్ సోడా చక్కగా పనిచేస్తుంది.
5.కొంచెం అల్లం పొడిని కూడా కలపాలి. మీ ఇష్టానుసారం అల్లం ఉపయోగించాలా లేదా అని నిర్ణయించుకోవచ్చు. అల్లానికి వేడి చేసే గుణం వుంది. ఈ వేడి వల్ల శరీరం కొన్ని నిమిషాలు ఎర్రబడుతుంది. శరీరం లో ఉన్న మలినాలను వేడి వల్ల కలిగిన స్వేదము ద్వారా బయటికి పంపించడానికి అల్లం ఉపయోగపడుతుంది. మీ శరీరతత్వాన్ని, నీళ్ళ తొట్టి పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లం పొడిని కలపాలి. సాధారణంగా 1 టేబుల్ స్పూన్ నుండి 1/3 కప్పు వరకు కలపవచ్చు . ఎక్కువ మందికి అల్లాన్ని ఉపయోగించడం వల్ల తీవ్రంగా చెమట పడుతుంది. స్నానపు తొట్టి నుంచి బయటికి వచ్చాక దుప్పటిని వెంటనే కప్పుకుని ఉంటే స్వేదము ద్వారా మలినాల నిర్మూలన మరో రెండుగంటల పాటు కొనసాగుతుంది. మీరు ఫ్లూ లేదా జలుబు వంటి వాటితో బాధ పడుతున్నపుడు ఈ డిటాక్సిఫికేషన్ ప్రక్రియ చాలా ప్రయోజనకరం.
6. మీ ఇష్టాన్ని బట్టి స్నానపు నీటిలో సుగంధ తైలాలు కూడా కలపవచ్చు . వీటి నుండి వచ్చే సుగంధాలు చాలా మందిని ఆకర్షిస్తాయి. ఒక్కో సుగంధ తైలానికి ఒక్కో ప్రత్యేకమైన గుణం ఉంది. స్నానపు నీటిలో కలపడం వల్ల వీటిని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇవి మన స్నానాన్ని ఆహ్లాదంగా మార్చి అద్బుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఉదాహరణకి లావెండర్ (lavendar) మరియు య్లాంగ్ య్లాంగ్(ylang ylang). యూకలిప్టస్ (eucalyptus) వంటివి డిటాక్సిఫికేషన్ ప్రక్రియ కి కూడా తోడ్పడతాయి. సాధారణ స్నానానికి సుమారు 20 చుక్కలు సరిపోతాయి.
7. ఈ పదార్థాలన్నిటిని బాగా కలిపి మీరు టబ్బులో కాసేపు ఉండాలి. ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత మంచిది. 40 నిమిషాలు ఉంటె మంచిది కుదరక పోతే కనీసం 20 నిమిషాలు ఉండాలి. మొదటి కొన్ని నిమిషాలలోనే మీకు చెమట పట్టడం ప్రారంభమవుతుంది. మీకు చాలా వేడిగా అనిపిస్తే కొన్ని చల్లటి నీళ్లు కలపండి.
8. స్నానపు తొట్టి లోంచి మెల్లగా జాగ్రత్తగా బయటికి రండి. మీ శరీరం శ్రమ పడినందువల్ల మీకు కొంచెం తల తిరిగినట్టు, నీరసంగా అనిపించవచ్చు . అంతకు మించి, లవణాలు మీ తొట్టి ని కొంచెం జారుగా మార్చవచ్చు . కాబట్టి జాగ్రత్తగా నిలుచోండి.
9. నీళ్ళు ఎక్కువగా తాగండి. ఇటువంటి స్నానం చేసిన తర్వాత మీ శరీరం డిటాక్సిఫై అవుతుంది. శరీరంలోని మలినాలు మీరు శరీర మర్దన(మసాజ్)లేదా కిరోప్రాక్టిక్(chiropractic) ద్వారా తొలగించుకోవాలి. లేకపోతే మీరు జబ్బుపడే అవకాశాలు ఉండవచ్చు.
10. స్నానం తర్వాత శరీరాన్ని శుభ్రపరిచే బ్రష్ లేదా స్క్రబ్ (పీచు)తో ఒళ్ళంతా రుద్దుకోవాలి. ఈ పద్దతి శోషరసాన్ని ఉత్తేజ పరిచేందుకు తోడ్పడుతుంది. దిని వల్ల రోగ నిరోధక శక్తి వృద్ది అవుతుంది. నెమ్మదిగా, గుండె వైపు కదుపుతూ సున్నితంగా రుద్దుకోవటం మంచిది.
తీసుకొనవలసిన జాగ్రత్తలు
1. ఆక్సీకరణ ద్వారా మన చర్మం మీద దుష్ప్రభావం చూపే అవకాశం ఉన్నందున హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఉపయోగించకూడదు.
2. గర్బం దాల్చిన మహిళలకు డిటాక్స్ స్నానం సిఫార్సు చేయదగినది కాదు.
3. గుండె లేదా ముత్ర పిండాల వ్యాధులు కలిగిన వారు కూడా ఈ స్నానాన్ని చేయకూడదు.
ఏవైనా తైలాలని వాడే ముందు వాటి గుణాల గురించి తెలుసుకుని వాడడంవల్ల వాటి ద్వారా వచ్చే దుష్పరిణామాల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ స్నానం లో వాడే ఏవైనా మూలికల గురించి జాగ్రత్తగా తెలుసుకుని వాడండి. కొన్ని మూలికలు విషపూరితమైనవి కుడా కావచ్చు. ఈ వ్యాసం విజ్ఞానం కొరకు మాత్రమే. రోగనిర్ధారణ మరియు చికిత్స కోసం సూచించబడలేదు. తగిన వైద్యుణ్ణి సంప్రదించి సలహా తీసుకుని మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించండి.



Click it and Unblock the Notifications