Latest Updates
-
నాన్‌వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
మీ చేతి వేళ్ళు ఇలా ఉంటే మీకు కచ్చితంగా బట్టతల వస్తుంది!
ఈ రోజుల్లో బట్టతల అనేది పురుషులకు అతిపెద్ద సమస్యగా మారింది. పెళ్లికి ముందే బట్టతల వచ్చేయడం వల్ల చాలా మంది పురుషులు పెళ్లి చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా పురుషులు కూడా ఒకరకమైన డిప్రెషన్‌కు గురవుతున్నారు. బట్టతలకి వారి జన్యువులు ఒక కారణమైతే, వారి అజాగ్రత్త కూడా ప్రధాన కారణం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తికి ఏ వయస్సులోనైనా బట్టతల రావచ్చు. జుట్టు ఎక్కువగా రాలడం వల్ల వచ్చే బట్టతలని అలోపేసియా అంటారు. ఈ అలోపేసియా కౌమారదశలో, మధ్య వయస్సులో లేదా 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సులో కూడా రావచ్చు. కానీ అలోపేసియా రాకముందే, కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ లక్షణాలు కనపడగానే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అయితే బట్టతల వస్తుందో రాదో అనేది మనిషి వేలుని బట్టి కూడా తెలుసుకోవచ్చట. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

రెండు వేళ్ళతో బట్టలత వస్తుందో రాదో చెప్పేయొచ్చు
తాజాగా, అమెరికాకు చెందిన జో విట్టింగ్టన్ అనే డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వ్యక్తికి బట్టతల వస్తుందో లేదో తెలుసుకోవడానికి ఆసక్తికరమైన, సులభమైన మార్గాన్ని వెల్లడించారు. చేతి వేళ్లు కూడా ఆ వ్యక్తికి బట్టతల వస్తుందా లేదా అనే విషయాన్ని వెల్లడిస్తుందని ఆ డాక్టర్ చెప్పారు. ఒక వ్యక్తిలో బట్టతల వచ్చే సంకేతాలు వ్యక్తి యొక్క ఉంగరం మరియు చూపుడు వేళ్ల నిష్పత్తి బట్టి తెలుసుకోవచ్చని వెల్లడించారు. దీనిని 2D:4D నిష్పత్తి అంటారు. అంటే ఒకరి చూపుడు వేలు పొడవుతో పోలిస్తే ఉంగరపు వేలు పొడవుగా ఉంటే, ఆ వ్యక్తికి బట్టతల వచ్చే అవకాశం 6 రెట్లు ఎక్కువ అని అభిప్రాయం. ఒకవేళ మీ చూపుడు వేలు మీ ఉంగరం వేలు కంటే పెద్దగా కంటే మీకు కూడా బట్టతల వస్తుంది.
జుట్టు రాలడాన్ని నిరోధించే మార్గాలు
జుట్టు రాలడం అనేది సహజం. కానీ కొన్నిసార్లు కొన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి తీసుకునే కొన్ని మందులు జుట్టు రాలడాన్ని పెంచుతాయి. అలాగే కొన్ని ఆహార పదార్థాలు కారణంగా కూడా జుట్టు రాలే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో జుట్టు రాలడాన్ని ప్రేరేపించే ఆహారాన్ని వదిలేయడంతో పాటు, మందులు మానేయడం చాలా మంచిది. జుట్టు రాలిపోవడం ఆగిపోవడంతో పాటు మళ్ళీ పెరిగితే వాటిని కంటిన్యూ చేయొచ్చు. ఇలా జుట్టు రాలడాన్ని నివారించొచ్చు.
మినాక్సిడిల్
కొన్ని కొన్ని చికిత్సల ద్వారా కూడా జుట్టు రాలడాన్ని నివారించొచ్చు. వాటిలో ఒకటి మినాక్సిడిల్. ఈ తరహా చికిత్స జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు జుట్టు మరింత పల్చబడడాన్ని నిరోధిస్తుంది. ఉత్తమ ఫలితాలను పొందడానికి దీన్ని 4-6 నెలల పాటు క్రమం తప్పకుండా వాడాలి.
ఫినాస్టరైడ్
ఈ చికిత్స శరీరంలో డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT) స్థాయిని తగ్గిస్తుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను కుదించి, బట్టతల మచ్చలను కలిగిస్తుంది. కాబట్టి బట్టతల రాకుండా ఉండాలంటే ఈ ట్రీట్ మెంట్ చేసుకోవచ్చు.
జుట్టు మార్పిడి శస్త్రచికిత్స
ఈ చికిత్స శాశ్వత పరిష్కారం కావచ్చు. మితమైన మరియు తీవ్రమైన జుట్టు రాలడానికి ఈ శస్త్రచికిత్స మంచి పరిష్కారాన్ని అందిస్తుంది.



Click it and Unblock the Notifications