Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒక్క లుక్కుతో మత్తెక్కాల..!!

పోటీ ప్రపంచంలో అందం కోసం ఆడవారే కాదు మగవారు తాపత్రయపడుతున్నారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా తమ 'లైప్ స్టైల్'ను మార్చుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతిని అనుకురిస్తున్న వీరు తమకు ఇష్టమైన వారిని ప్లాట్ చేయటానికి నానా తంటాలు పడుతున్నారు. ఒకరు జట్టును దిట్టంగా పెంచి సెక్సీలుక్కులు ఇస్తుంటే. మరి కొందరు జీన్స్, టీషర్ట్ లను ధరించి బైకుల పై చెక్కర్లు కొడుతుంటారు. అయితే ఈ ఫ్యాషన్ కన్నా ముందు మగవారు మరో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. మీ శరీరం నుంచి వెలువడే 'పరిమళం' ఏలాంటిదో గ్రహించండి. కొందరు మగవారు రోజంతా తాజాదనంతో సువాసనలు వెదజల్లుతుంటారు. వారే అధికంగా ఆకర్షింపబడుతుంటారు.. రోజంతా తాజాదనంగా ఉండటమన్నది కష్టతరమైన పని అనుకుంటే పొరపొటే.. మీ దినచర్యలను కాస్తంత మార్చుకుంటే చాలు రోజుంతా తాజాదనం మీ వెంటే ఉంటుంది..
రోజంతా తాజాదనం కోసం ఇవిగోండి చిట్కాలు :
పంటి శుభ్రత : దిన చర్యలో భాగంగా ప్రతి రోజు దంతాలను శుభ్రం చేసుకుంటాం. అయితే ఆహారం తీసుకుంటున్న సందర్భంలో కొంత పదార్ధం పళ్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. ఈ ప్రభావంతో కొంత సేపటికి నోటి నుంచి దుర్వాసన వ్యాపిస్తుంటుంది. ఆ సమయంలో మీరు ఇష్టమైన వారిని కలవాల్సి వస్తే ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి మీ జేబులో ఎప్పడు 'మౌత్ రీఫ్రెషర్ల'ను ఉంచుకోండి. ఇవి నవలడం వల్ల మీ నోటి నుంచి తాజాదనంతో నిండిన సువాసన వ్యాపిస్తుంది.
స్నానానికి సరైన సబ్బును ఎంచుకోండి: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి రోజు స్నానం చేస్తాం. అయితే స్నానానికి మీరు వినియోగిస్తున్న సబ్బు మన్నిక ఎటువంటిదో తెలుసుకోండి. ఒక వేళ మీరు వాడుతున్నది మన్నిక తక్కువైన సబ్బు అయితే వెంటనే దానిని మార్చేయండి. శరీరాన్ని తాజగా ఉంచటంలో సబ్బు కీలక పాత్ర పోషిస్తుంది.
షాంపూ : మార్కెట్లో లభ్యమయ్యే షాంపూలన్ని సువాసనలు వెదజల్లుతుంటాయి. మహిళలు అధికంగా షాంపూ వాసనలను ఇష్టపడుతుంటారు.
మీరు వాడుతున్న షాంపూ ఎంత మేర సువాసనలు వెదజల్లుతుందో గమనించండి. ఒక వేళ మీరు షాంపూను మార్చాల్సి వస్తే మార్కెట్లో దొరికే బేబీ జాన్సన్ షాంపూనూ ఎంచుకోండి. ఎందుకంటే ఈ షాంపూ పరిమళం మహిళలను తెగ ఆకట్టకుంటుందట.
డియోడ్రెంట్ : శరీరాన్ని తాజాదనంగా ఉంచే డియోడ్రెంట్ ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరించండి.
మీరు ధరంచే వస్త్రాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. పొగతాగినా, తాగే వారి దగ్గర నుంచున్నాఆ వాసన మీ జుట్టుతో బట్టల్లోకి వ్యాపిస్తుంది. కనుక అలాంటి సందర్భాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కాఫీ, పెరుగు, పాలు తాగిన సందర్భాల్లో మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి మింట్ ను అధికంగా వాడండి.



Click it and Unblock the Notifications