Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చెవులకు ‘కేకో..కేక’..!!

అమ్మాయి బుంగమూతిలా ముద్దొచ్చే చెవి రింగులు ప్రస్తుతం 'హోరెత్తిస్తున్న ఫ్యాషన్' కాదు కాదు 'ట్రెండ్ సెట్టర్'. చెవులకు ధరంచే పోగులు, జుంకీలు, రింగులు ఇలా ఎన్నిరకాలనైనా మార్చి, మార్చి పెట్టుకోవచ్చు. కాని రింగులున్నాయే..ఎప్పుడు చూసినా వృత్తాకారం లాంటి ఒకే ఆకారంలో ఉంటాయి. కాకపోతే వెండి.. బంగారం.. ప్లాటినం.. బ్లాక్ మెటల్.. పూసలు.. ప్లాస్టిక్ వంటి లోహాలతో రంగు రంగులగా తీర్చదిద్దబడతాయి.
సెలబ్రిటీల ప్రపంచంలో రింగులు తిరుగులేని ఫ్యాషన్‌గా రూపాంతరం చెందాయి. వారు ధరించే ఏ డ్రస్ కయినా ఇవి క్లాసిక్ లుక్‌ను తీసుకువస్తాయి. ఈ మధ్యను జీన్స్ భామలంతా చెవి రింగుల పై మోజు కనబరుస్తున్నారు.
నిజానికి చెప్పాలంటే ఒకప్పుడు చిన్న పిల్లలకు మాత్రమే రింగులు పరిమితమయ్యేవి. ఎందుకుంటే దిద్దులు పెడితే ముసలమ్మల్లా కనిపిస్తారని వాటిని పెద్దవాళ్ల ఆభరణాల కిందే జమకట్టేవారు. ప్లాస్టిక్, నియోన్ వంటి లోహలతో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఫంకీ రింగులు కాలేజీ అమ్మాయిల ఫ్యాషన్ లిస్ట్‌లో తొలి స్థానాలను సంతరించుకున్నాయి.
ఆభరణాల తయారీ, రోల్డ్ గోల్డ్ వర్గాల్లో చోటుచేసుకున్న ఆధునిక మార్పులు రింగుల్లోనూ బోలెడన్ని డిజైన్లను వెలుగులోకి తీసుకువచ్చాయ. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఈ రింగుల వైపు ఆకర్షితులవుతున్నారు. గుండ్రంగా ఉండే రింగు వృత్తాకారం ఇప్పుడు త్రికోణం, చదరం తదితర రేఖాగణిత ఆకారాల్లో దర్శనమిస్తున్నాయ.



Click it and Unblock the Notifications