For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘మంచి మొగుడొస్తాడని’..!!

|

Mehendi Decor Tips
పండుగ పబ్బాలతో నిమిత్తం లేకుండా.. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా పల్లెపడుచుల నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దాకా, కాలేజి అమ్మాయిల నుంచి క్రీడాకారిణిల దాకా ఏకరీతిన ఆకట్టకోవడంలో 'గోరింటాకు' తనకంటూ ప్రత్యేక విశిష్టతను సొంతం చేసుకుంది. పాశ్చాత్యులకు సైతం గోరింటాకు తెగ నచ్చేస్తుంది. భారతీయ సంస్కృతి సంప్రాదాయాల్లో భాగమైన గోరింటాకు, ప్రతి తెలిగింట శుభకార్యాల్లో ఇంకా చెప్పాలంటే ప్రతి వేడుకలోనూ మమేకమై ఆడపడుచుల ఒంటినిండా పూస్తుంది.

ఆషాడంతో మొదలుపెట్టి రంజాన్, వినాయకచవితి, దసరా, దీపావళి, అట్లతద్ది, క్రిస్మస్, సంక్రాంతి అంటూ ప్రతి పండుగకూ అరచేతి గోరింటను ఒకప్పుడు పల్లెపడుచులు పండించేవారు. కాలానుగుణంగా కొత్త రూపును సంతరించుకన్న 'గోరింటాకు' నేడు హెన్నా, మెహందీగా మారి ఆధునిక యుగంలో కొత్త ఫ్యాషన్ గా మారింది.

'' మందారంలో పూస్తే.. మంచి మొగుడొస్తాడని, గన్నేరులా పూస్తే.. కలవాడొస్తాడని, సింధూరంలా పూస్తే .. అందాల చందమామా దిగివస్తాడని '', ఆశలను, నమ్మకాలను గోరింటాకు పండిస్తుంది. మన తెలుగింట అమ్మాయులు గోరింటాకు బాగా పండాలని వారి వారి ఇష్ట దైవాలను కోరుకుని, పెద్దవారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఉత్తర భారతీయులు పెళ్లి వేడుకల్లో మెహందీని పెట్టకుని బాగా పండాలని దైవాన్ని ప్రార్ధిస్తారు.

ముఖ్యంగా తెలుగునాట జరిగే వివాహ శుభకార్యాల్లో పెళ్లికూతూరుకు గోరింటాకు పెట్టడాన్ని పెద్ద వేడుకగా చేసే ఆచారం నేటికి కొనసాగుతుంది. కాలక్రమేణ ఈ సంస్కృతి అన్ని ప్రాంతాలకు పాకింది. డిజైన్లు వేసేందుకు బ్యూటీ పార్లర్లూ వెలిశాయి. కొత్తగా మెహందీ డిజైనర్లు పుట్టుకొచ్చారు. ఆసక్తిగా నేర్చుకున్న ఈ కళ ప్రస్తుతం కొంత మందికి ఉపాధి కల్పిస్తుంది. ముఖ్యంగా కళాశాల అమ్మాయులు మెహందీ పెట్టుకోవటం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. పట్టణాల్లోని ప్రధాన బజారుల్లో మెహందీ డిజైన్లు పెట్టే అమ్మాయులు, అబ్బాయిలు కనబడుతున్నారు. ఇండియన్, అరబిక్ ప్యాక్ లలో డిజైన్లు వేస్తున్నారు. ప్యాక్ ను బట్టి ధరను వసూలు చేస్తున్నారు.

English summary

Mehendi Decor Tips.. | ‘మంచి మొగుడొస్తాడని’..!!

Mehendi is one of the important pre-wedding rituals followed in many parts of India. It holds significance, primarily in the northern parts of the country, where henna is considered auspicious for festive occasions. While mehendi is an indispensable part of the pre-marriage celebrations of Hindu and Muslim weddings, people following other religions have also adopted it, with the changing times. Today, most of the people conduct the mehendi ceremony at their homes.
Story first published:Thursday, August 25, 2011, 15:08 [IST]
Desktop Bottom Promotion