Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముక్కుపుడక ‘భామ’... ముత్యమేరా ‘మామ’..!!

"వయసు పెరిగినా వన్నెతరగని గోల్డెన్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా పడిచచ్చే వారు ఎంత మందో లెక్కకట్టేలం. విశ్వ సుందరి కీరిటాన్ని దక్కించుకున్న ఈ కర్ణాటకా భామ ప్రపంచ సుందరి పోటీల్లో వజ్రపు ముక్కుపుడకను ధరించి యూవత్ ప్రపంచాన్ని మంత్ర ముగ్థులను చేసింది...''
'ముక్కుపుడక భామ... ముత్యమేరా మామ' అంటా వర్ణన వల్లించాడో సినీ కవి.., అవునండి ఆడవారిని ముగ్థమనోహరంగా తీర్చిదిద్దే ముక్కుపుడకు గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలవు. సంపంగి పువ్వు లాంటి ముక్కుకు 'ముక్కెర' కొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది. ముగువ ముఖబింభాన్ని మరింత మైమరిపింప చేసే ముక్కుపుడుక పెళ్లి అంలంకారాల్లో ఎక్కువుగా కనిపిస్తుంటుంది. అనదిగా వస్తున్న ఈ సంస్కృతి ఒకో రాష్ట్రంలో ఒక వైశిష్టతను సంతరించుకుంది. ముక్కుపుడకను తమిళంలో 'ముక్కుట్టి'గా, బిహారీలో 'లాంగ్'గా, హిందీలో 'నాథురి'గా పిలుస్తారు.
శతాబ్థాల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఈ అలంకరణ మేనమమ లేదా కాబోయే భర్త మాత్రమే స్త్రీకి బహుకరించాలన్నది ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం. పలువురు మహిళలు వివాహ సమయంలో ధరించిన తాళిబొట్టు మాదిరిగానే ముక్కుపుడకను జీవితాంతం తమతోనే ఉంచుకుంటారు. ఇవి తమంతో ఉన్నంత కాలం భర్తలు క్షేమంగా ఉంటారన్నది వారి నమ్మకం.
దక్షిణాది మహిళలు ఈ 'ముక్కెర'ను ముక్కుకు కుడివైపు ధరిస్తే ఉత్తరాది మహిళలు ముక్కుకు ఎడమ వైపు పెట్టకుంటారు. ముత్యాలతో ఒదిగిన ముత్యపు ముక్కుపుడకలను మరాఠీ మహిళలు అధికంగా ఇష్టపడతారు. ఇప్పటికి కొందు ఆదివాసి మహిళలు పెద్దవైన పుడకలను ధరిస్తుంటారు. స్థాయి భేదం లేకుండా అందరూ ఈ ముక్కుపుడకలను బంగారంతోనే తయారు చేయించుకుంటారు.
ఆడవారి ప్యాషన్ కొంత పుంతలు తొక్కుతున్న నేపధ్యంలో పెళ్లికాని అమ్మాయిలు సైతం 'ముక్కెర'ను ధరించేందుకు ఇష్టపడుతున్నారు. ఆధునిక మహిళులు కోరుకునే విధంగా బంగారపు ముక్కుపడుకల నుంచి వజ్రపు ముక్కుపుడకల వరకు రింగుల ఆకృతిలో రూపొందిస్తున్నారు. మార్కెట్లో కనువిందు చేస్తున్న ఈ ముక్కెరల పై సెలబ్రటీల నుంచి సామాన్యులు వరకు ఇష్టత కనబరుస్తున్నారు.
" హిందూ దేవతలకు ముక్కుపుడక తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణమ్మ పొంగి కొండిపైనున్న కనకదుర్గమ్మ ముక్కెరును తాకితే విశ్వ వినాసనం తప్పదని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో రాసినట్లు చరిత్ర చెబుతుంది''.



Click it and Unblock the Notifications