Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
వసపరుచుకోండిలా...!!

పోటీ ప్రపంచంలో అందం కోసం ఆడవారే కాదు మగవారు తాపత్రయపడుతున్నారు. ఎదుటి వారిని ఆకర్షించేవిధంగా తమ 'లైప్ స్టైల్' ను మార్చుకుంటున్నారు. పాశ్చాత్య సంస్కృతిని అనుకురిస్తున్న వీరు తమకు ఇష్టమైన వారిని ప్లాట్ చేయటానికి నానా తంటాలు పడుతున్నారు.
ఒకరు జట్టును దిట్టంగా పెంచి సెక్సీలుక్కులు ఇస్తుంటే. మరి కొందరు జీన్స్, టీషర్ట్ లను ధరించి బైకుల పై చెక్కర్లు కొడుతుంటారు. అయితే ఈ ఫ్యాషన్ కన్నా ముందు మగవారు మరో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంది. మీ శరీరం నుంచి వెలువడే 'పరిమళం' ఏలాంటిదో గ్రహించండి. కొందరు మగవారు రోజంతా తాజాదనంతో సువాసనలు వెదజల్లుతుంటారు. వారే అధికంగా ఆకర్షింపబడుతుంటారు.. రోజంతా తాజాదనంగా ఉండటమన్నది కష్టతరమైన పని అనుకుంటే పొరపొటే.. మీ దినచర్యలను కాస్తంగా మార్చుకుంటే చాలు రోజుంతా తాజాదనం మీ వెంటే ఉంటుంది..
రోజంతా తాజాదనం కోసం ఇవిగోండి చిట్కాలు :
పంటి శుభ్రత : దిన చర్యలో భాగంగా ప్రతి రోజు దంతాలను శుభ్రం చేసుకుంటాం. అయితే ఆహారం తీసుకుంటున్న సందర్భంలో కొంత పదార్ధం పళ్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. ఈ ప్రభావంతో కొంత సేపటికి నోటి నుంచి దుర్వాసన వ్యాపిస్తుంటుంది. ఆ సమయంలో మీరు ఇష్టమైన వారిని కలవాల్సి వస్తే ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి మీ జేబులో ఎప్పడు 'మౌత్ రీఫ్రెషర్ల'ను ఉంచుకోండి. ఇవి నవలడం వల్ల మీ నోటి నుంచి తాజాదనంతో నిండిన సువాసన వ్యాపిస్తుంది.
స్నానానికి సరైన సబ్బును ఎంచుకోండి: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి రోజు స్నానం చేస్తాం. అయితే స్నానానికి మీరు వినియోగిస్తున్న సబ్బు మన్నిక ఎటువంటిదో తెలుసుకోండి. ఒక వేళ మీరు వాడుతున్నది మన్నిక తక్కువైన సబ్బు అయితే వెంటనే దానిని మార్చేయండి. శరీరాన్ని తాజగా ఉంచటంలో సబ్బు కీలక పాత్ర పోషిస్తుంది.
షాంపూ : మార్కెట్లో లభ్యమయ్యే షాంపూలన్ని సువాసనలు వెదజల్లుతుంటాయి. మహిళలు అధికంగా షాంపూ వాసనలను ఇష్టపడుతుంటారు.
మీరు వాడుతున్న షాంపూ ఎంత మేర సువాసనలు వెదజల్లుతుందో గమనించండి. ఒక వేళ మీరు షాంపూను మార్చాల్సి వస్తే మార్కెట్లో దొరికే బేబీ జాన్సన్ షాంపూనూ ఎంచుకోండి. ఎందుకంటే ఈ షాంపూ పరిమళం మహిళలను తెగ ఆకట్టకుంటుందట.
డియోడ్రెంట్ : శరీరాన్ని తాజాదనంగా ఉంచే డియోడ్రెంట్ ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరించండి.
మీరు ధరంచే వస్త్రాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. పొగతాగినా, తాగే వారి దగ్గర నుంచున్నాఆ వాసన మీ జుట్టుతో బట్టల్లోకి వ్యాపిస్తుంది. కనుక అలాంటి సందర్భాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కాఫీ, పెరుగు, పాలు తాగిన సందర్భాల్లో మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి మింట్ ను అధికంగా వాడండి.



Click it and Unblock the Notifications