Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
'చందమామ' మీ 'చిరునవ్వు' ఒక్కటే..!!

సహజసిద్ధమైన సౌందర్యాన్ని మించిన విలువైన వస్తువు ఈ విశ్వంలో మరెక్కడా లేదు.. కోటేశ్వరులే కావచ్చు.. విలువైన నగలుతో పాటు, ఖరీదైన డ్రెస్సులు ధరించవచ్చు. వీటిన్నింటి వల్ల హోదా లభిస్తుంది అంతే.. ప్రకృతి ప్రసాదించిన ఓ విలువైన సంపద ప్రతి ఒక్కరిలో దాగి ఉంటుంది. ఆ 'సంపద' ముందు వెయ్యి కోట్లైనా బలాదూర్. మరి ఆ విలువ కట్టలేని సంపదను సమగ్రంగా వినియోగించుకుంటున్నారా..!!
ప్రతి ఒక్కరి దైనందిన జీవితాల్లో ఎన్నో కష్టసుఖాలు ఎదురవుతుంటాయి. ఇవి పలు రకాలుగా జీవన శైలిని మార్చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికి మనిషి కుంగిపోకూడాదు.. అదే విధంగా పొంగిపోకూడదు. ఎదుటివారితే మాట్లాడేటప్పుడు కల్మషం లేని మనస్తత్వంతో సహజమైన చిరునవ్వును చిందించి విష్ చేస్తే చాలు. మీరు కలిగించిన ఆ 'అనుభూతికి' ఎదుటి వారు ఫ్లాట్ అవ్వకతప్పదు .
ఎప్పుడు కోపంగా, చికాకుగా ఉంటే.. మీ మీడ కామెంట్లు ఎక్కువవుతయి. " వీడి ముఖమేంట్రా ఎప్పుడు చూసిన ఆమ్లెట్లా వేగిపోతుంటుంది, దాని ముఖం ఏంటే ఎప్పుడు చూసిన పేలాల పిండిలా పేలుతుంటుందని'' మీ స్నేహితులే మీ గురించి మాట్లాడుకుంటుంటారు.
ఒక్క మాటలో చెప్పాలంటే " చందమామ లేని ఆకాశం ఎలా వెలవెలబోతుందో, చిరునవ్వు చిందించని ముఖం అంతే బోసిగా కనిపిస్తుంది''.. మీరు ఏ శుభకార్యానికి హాజరైన సరే ఎదుటి వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. 'డల్ మూడ్'లో ఉండకండి, మనసులో ఎంతటి బాధున్న ఆ సందర్భంలో దాన్ని దరికిరానివ్వకుండా. ఆప్యాయంగా మీ శ్రేయేభిలాషులను పలకరిచండి. మీ సహజమైన చిరునవ్వుతో నలుగురి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోండి.
మీరు చిందించే చిరునవ్వు ఎదుటి వారిలో .. సంతోషాన్ని నింపాలి, మీ చిరునవ్వు బాగుటుందనే 'పొగడ్త' ఎడుటవారి నుంచి రావాలి, సో.. మీలో దాగున్నఈ వెలకట్టలేని సంపదను సంపూర్ణంగా వినియోగించుకోండి.



Click it and Unblock the Notifications
