For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు మెచ్చే సువాసనలు!

By Super
|

 Women Perfumes..!
ఆడవారి సౌందర్యాలంకరణలో కీలక పాత్ర ఫోషించే పరిమళ ద్రవ్యాలు (ఫెర్‌ఫ్యూమ్‌లు) వారి ఇమేజ్‌ను మరింత రెట్టింపు చేస్తాయి. పాశ్చాత్య పోకడల్లో భాగంగా మహిళల కోసం ప్రత్యేకించి రకరరాల ఫెరఫ్యూమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలంకరణను రెట్టంపు చేస్తూ నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే పరిమళ ద్రవ్యాలను సీజన్లు, సందర్భాలను బట్టి ఉపయోగిస్తే, మగువల ప్రాముఖ్యత మరింత పెరగుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు...

మహిళల ప్రాముఖ్యతను పెంచే వివిధ రకాల పెర్‌ఫ్యూమ్‌లు :

ఫ్లోరల్ (పుష్ప గంధపు): పువ్వులను అధికంగా ఇష్టపడే మహిళలు, పూల పరిమళంతో రూపొందించిన ఫెర్‌ఫ్యూమ్‌లను ఉపయోగంచటం వల్ల ప్రత్యేక గుర్తింపు లభిస్తుందట. జాస్మిన్, రోజ్ తదితర పూల సారాలలో ఈ ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. రోమాన్టిక్ వాతావరణాన్ని సృష్టించే పూల పరిమళాలను కలయక, పెళ్లి సందర్భాల్లో వాడితే బాగుటుంది.

చందన భరిత: చందన భరతమైన సిడార్, సాండల్ వుడ్, పచౌలి పరిమళాలు, మహిళలను ఎల్లప్పుడు తాజాదనంతో ఉల్లాసంగా ఉంచుతాయి. వివిధ కార్యకలపాల్లో నిమగ్నమవుతున్న ఆధునిక మహిళలు చందన భరిత పరిమళాలను వినియోగించేందుకు మక్కువ చూపుతున్నట్లు నిపుణులు చెబతున్నారు.

పండ్ల భరితం: తియ్యటి పరిమళాన్ని కలిగి ఉండే చెర్రీ, పీచ్, ఆపిల్ పండ్ల నుంచి పరిమళ ద్రవ్యాలను తయారు చేస్తున్నారు. ప్రత్యేక అనుభూతిని కలిగించే ఈ పరిమళాలను విహారయాత్రలకు వెళ్లే సందర్భాల్లో వినియోగిస్తే బాగుటుంది.

ఓరియంటల్: పాశ్చాత్య సంస్కృతి ద్వారా వ్యాపించిన ఓరియంట్ ఫెర్‌ఫ్యూమ్‌లు ఆధునిక మహిళలను ప్రత్యేకంగా ఆకట్టకుంటున్నాయి. పార్టీలకు, క్లబ్‌లకు వెళ్లే మహిళలు ఈ పరిమళాలను వాడేందుకు ఇష్టపడుతున్నారు. ఈ విధమైన ఫెర్‌ఫ్యూమ్‌ల నుంచి వ్యాపించే పరిమళం నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుందట.

English summary

Women Perfumes..!! | మహిళలు మెచ్చే సువాసనలు!

Perfumes add up glamor and style to a women's personalty. Toiletry is an inseparable part of a woman. Adorning and dressing is a like ritual for a woman. The usage of perfumes are an indispensable part of a woman. Perfumes or attars have transcended from the ancient ages. The women of this era can never compromise with the fragrance.
Story first published:Tuesday, March 27, 2012, 14:13 [IST]
Desktop Bottom Promotion