For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెహిందీ ఉత్సవానికి సరిపోయే బ్రైడల్ అవుట్ ఫిట్స్...

|

భారతీయ మహిళలకు ఎక్కువగా మెహంది అంటే చాల ఇష్టం. గోరింటాకు అంటే చిన్న పిల్ల దగ్గర నుండి, టీనేజర్స్ కు, మహిళలకు, ఎంతో ఇష్టమో అందరికి తెలిసిన విషయమే. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని ఇప్పటికి మన వాళ్ళు గౌరవిస్తున్నారు. పెళ్ళికి నెలరోజుల ముందునుండే మెహంది పండగ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా శుభకార్యాలు, పండుగలు, పెళ్ళిళ్లు అంటే మొదట ఫ్రిఫరెన్స్ మెహిందీకే..మెహింది ప్రతి పెళ్ళి కుమార్తెకు చాలా ప్రత్యేకమైన ఉత్సవం. పెళ్లి మహోత్సవంలో పెళ్లికుమార్తె, చేతులుకు, కాళ్ళకు నిండుగా గోరింటాకు పెట్టుకొని ప్రత్యేక ఆకర్షణతో అలరిస్తుంటుంది. పెళ్లి అనే కాదు ఏ పండగ వచ్చిన చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ప్రతి పండగకు ఆడవాళ్ళ చేతులకు అందం గోరింటాకు. మన దేశంలోనే కాదు. విదేశీ వనితలకు కూడా మెహంది అంటే చాల ఇష్టపడతారు.

సాధారణంగా స్త్రీలు, పిల్లలు పెట్టుకోవడం కంటే పెళ్ళికి పెట్టుకొనే మెహించి చాలా భిన్నంగా ఉంటుంది. కొంతమంది పెళ్ళి కుమార్తెలు కాబోయే వరుడి పెరును అరచేతుల్లో మెహిందితో బందించేస్తారు. పెళ్ళికుమార్తె అరచేతుల నుండి అలా పాకుతూ మోచేతుల వరకూ రకరకాల డిజైన్లతో పొందుపరచబడుతుంది. ఒక్క చేతులకు మాత్రమేనా పాదాలు కాళి వేళ్ళ మీద రకరకాలు డిజైన్లతో అలరించాల్సిందే. దీన్ని బట్టే భారత సాంప్రదాయ ఆచార విలువెంతో తెలుస్తుంది.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

బ్రైట్ గ్రీన్ కలర్ లో మెరిసిపోతున్న వధువు: ఫర్ఫెక్ట్ మెహిందీ అవుట్ ఫిట్ ఛాబ్రా 555 బ్రైట్ గ్రీన్, రెడ్, వైలెట్ షేడ్స్ తో అద్భుతంగా కళ్ళు జిగేల్ మనిపిస్తోంది.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

వధువుకి సూట్ అయ్యే పింక్ మిరియు బ్లూ: పింక్ మరియు బ్లూ కలర్స్ తో చాలా అద్భుతంగా ఉండా కాంబినేషన్. ఈ సూట్ మెహిందీ ఉత్సవానికి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

వైట్ అండ్ గోల్డ్ కలర్ లో మెరుస్తున్న వధువుః మెహిందీ ఉత్సవానికి వైట్ కలర్ సాంప్రదాయ కలర్ కాదు, కానీ ఇది ఈ సీజన్ కు సరిపోయే అద్భుతమైనటువంటి కలర్. ఈ ట్రెండ్ కు సరిపోయే విధంగా వైట్ అవుట్ ఫిట్స్ ను ధరించి చూడవచ్చు.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

రెడ్ కలర్ మీద బ్లూ లేస్: మెహిందీ ఉత్సావాని అధ్బుతంగా కళ్ళు మిరిమిట్లుగొలిపే ఈ లెహంగా చాలా బాగుంటుంది. దీని మీద బ్యూ లేస్ వర్క్ చాలా చక్కగా తీర్చిదిద్దారు.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

ఎరుపు మరియు తెలుపు: ఫ్యాషన్ ట్రెండ్ లో రెడ్ మరియు ఎరుపు కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఈ ట్రెండ్ కు సరిపోయే ఫ్యాషన్. రెడ్ వెల్ వెట్ కలర్ బ్లౌజ్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

గ్రీన్ కలర్ ఆఫ్ ది మెహిందీ: ముస్లీ వధువుకు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే అవుట్ ఫిట్. దీన్ని మొఘల్ డిజైన్ లో మీరు కూడా ట్రై చేయొచ్చు.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

దిగ్భ్రాంతి కలిగించే పింక్: ఇది సాధారణ పింక్ కాదు. దీన్ని రాణి పింక్ అంటారు. వధువు ఎక్సాట్రార్డినరీగా కనిపించే రంగు. ఈ సింగ్ టోన్ లహెంగా మెహిందీ సెర్మనీకు ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

పరిమితంగా కనిపించే రంగు: చాలా మందికి డ్రాక్ కలర్స్ నచ్చకపోచ్చు. అటువంటి వారికి ఈ రంగు ఫర్పెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

పీకాక్ బ్లూ అవుట్ ఫిట్: వైట్ అండ్ పీకాక్ బ్లూ కాంబినేష్ అద్భుతంగా మైమరిపిస్తోంది. ఇక ఈమె ధరించిన బికిని బ్లౌజ్ ను మీకు నచ్చిన విధంగా కుట్టించుకోవచ్చు.

మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

వధువు కాదు ప్రిన్సెస్: పెళ్ళి రోజు పెళ్ళి కుమార్తెలా కాకుండా ఓ ప్రిన్స్ లా కనబడేలా చేసోంది. ఈ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ రాయల్ ప్రిన్సెస్ ను తలపిస్తోంది.

ఇక పెళ్లికుమార్తె ధరించే దుస్తుల విషయంలో ఎరుపు, పచ్చ, బ్లూ, ఇలా కొంచెం బ్రైట్ కలర్ లో మెహిందీ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకొంటారు. తర్వాత తర్వాత తెలుపు, పింక్ కలర్స్ లోని మార్చబడింది. కాబట్టి ఈ వింటర్ సీజన్ లో వాటిని ప్రయత్నించండి. నార్త్ సైడ్ అంతా పెళ్ళి దుస్తులు సాధారణంగా ఎరుపు రంగును ధరిస్తారు. అందుకే బ్రెడెల్ మెహింది ఉత్సవానికి కూడా ఎరుపు రంగును ఎందుకు కొంచెం డిఫరెంట్ గా సెలక్ట్ చేసుకొంటే రెండు రోజూ చాలా ఢిఫరెంట్ గా కనబడుతారు. కానీ కొన్ని సందర్భాల్లో భారతీయ మహిళలకోసం వివాహ సమయంలో నిషేధించబడి రంగులు నలుపు, ప్యూర్ వైట్. మిగిలిన ఎటువంటి కలర్స్ అయినా నిక్షేపంగా ఉపయోగించవచ్చు.

మల్టీ కలర్ లంగావోనిలో కుందనపు బొమ్మల్లా చక్కగా ఉంటారు. ప్రస్తుతానికి ఇదే ఫ్రాషన్ ట్రెండ్. లంగావోనీకి సూట్ అయ్యే చోలి(పవిట/పరికిని) ధరిస్తే అద్భుతంగా పెళ్ళి కళ ఉట్టిపడాల్సిందే. ఇంకా లంగావోనికి కాంట్రాస్ట్ కలర్స్ ఎంచుకోవచ్చు. కాబట్టి మీ మోహిందీ ఉత్సవానికి ఫర్ఫెక్ట్ మాచ్య్ అయ్యే దుస్తులు ఎంపిక చేసుకోవడానికి మీ కోసం కొన్ని ఈ సీజన్ కు సరిపోయేవి....

English summary

10 Bridal Outfits For Mehendi Ceremony... | మెహిందీ ఉత్సవంలో మెరిసిపోండిలా...!

The Wedding Mehendi is very special ceremony for every bride. During this ceremony, the bridal mehendi is applied on the hands and feet of the bride. This usually happens a day or two before the wedding. The Mehendi ceremony has a very special significance. All married women and young girls apply henna on their palms for this occasion.
Desktop Bottom Promotion