Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
సన్నగా ఉన్నా హ్యాండ్సమ్ గా కనబడాలంటే....!

1. సౌకర్యవంతగా మీ శరీరానికి సరిగ్గా సరిపోయే దుస్తులు ధరించడం: ముఖ్యంగా పురుషులు ధరించే దుస్తులు వారీ శరీర ఛాయకు షూట్ అయ్యే విధంగా ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకొన్నవి శరీరానికి కరెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా చూసుకొని మరీ తీసుకోవాలి. అలా కాకుండా నచ్చింది కదా అని ఏది పడితే అది తీసుకొని వేసుకొంటే సన్నగా ఉన్నవారు మరింత అందవిహీనంగా కనబడుతారు. మీర వదులైనవి, మరీ బిగుతైనవి ధరిచడం వల్ల మీ అసౌకర్యం కలిగించడమే కాకుండా ఇతరును అకట్టుకోలేరు.
మీరు బట్టల షాపుకు వెళ్లినప్పుడు ముందుగానే అక్కడున్న అసిస్టెంట్స్ ను ట్రైల్ రూమ్ ఉందో లేదో తెలుసుకోవాలి. తర్వాత సెలక్ట్ చేసుకొన్నదుస్తులను ఒక సారి వేసుకొని ఒకటి రెండు సార్లు పరీక్షించి కరెక్ట్ గా సరిపోయిందనిపిస్తేనే కొనడానికి నిర్థారించుకోవాలి. అవసరమైతో మీకు తోడుగా ఒక స్నేహితులన్నీ తీసుకెళితే మీ అభిరుచికి తగిన విధంగా సహాయపడవచ్చు. టాప్స్ విషయంలో చేతులకు పొడవైన స్లీవ్స్ చాలా వదులుగా కనిపించకుండా సరిగా ఫిట్ అయ్యే విధంగా ఉన్నవే ఎంపిక చేసుకోవాలి. అదే ప్యాంట్ విషయంలో మరీ వదులగా, బ్యాగీ టైప్ లో లేకుండా చూసుకొంటే అప్పుడు మీరు అందంగా ఆకర్షింపబడుతారు.
2. స్లిమ్ - ఫిట్టింగ్ షర్ట్స్ కు దూరంగా ఉండండి: హాండ్సమ్ గా కనబడాలంటే ఇది కూడా ఒక మంచి చిట్కా. సింపుల్ గా ఉంటూనే హ్యాండ్సమ్ గా కనబడాలంటే స్లిమ్ ఫిట్టింగ్ షర్ట్స్ ను దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ షర్ట్ ను దరించడం వల్ల మెడ, చాతీ బాగాలు చాలా టైట్ గా కనబడేట్లు చేస్తుంది. కాబట్టి స్లిమ్ గా కనబడాలంటే స్టాండర్డ్ ఫిట్ డ్రస్ షర్ట్ ను ఎంపిక చేసుకోవడం వల్ల మరింత హాండ్సమ్ గా కనబడుతారు. దానికి చాలా తక్కువగా కనబడే బ్యాగీ ప్యాంట్ సెలక్ట్ చేసుకోవడం వల్ల సాంప్రదాయానికి అద్దం పట్టినట్లు హాండ్సమ్ గా కనబడుతారు.
3. రైట్ సైజ్ జాకెట్స్ : ముఖ్యంగా ఏ డ్రెస్ ధరించినా వాటి మీదకు వేసుకొనే జాకెట్స్ కరెక్ట్ సైజును కలిగి ఉంటేను ఆ డ్రస్సుకు మంచి లుక్ ఉంటుంది. డ్రెస్ మీదకు ఫ్యాషన్ గా ధరించే జాకెట్ పొడువు కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. అలాగే వెనుకవైపు సీట్ కవర్ అయ్యేంత వరకూ చూసి ఎంపిక చేసుకోవడం వల్ల అందంగా కనబడుతారు. ఒక వేళ షార్ట్ జాకెట్ వేసుకొనేటట్లైతే అది కూడా శరీరానికి సరిపోయి ఆకర్షించే విధంగా ఉండాలి.
4. ప్యాంట్స్ సూటబుల్ గా ఉండాలి: ఎప్పుడు కానీ ప్యాంట్ ఎంపిక చేసుకొనేటప్పుడు అవి తప్పని సరిగా సింపుల్ గా వీలైనంత వరకూ ప్లాట్ ఫ్రంట్ వి బాగా నప్పుతాయి. ముఖ్యంగా ప్యాంట్ స్టైయిట్ లెగ్ షేప్ అయితే మరింత ఆకర్షణగా కనబడుతారు. ప్యాంట్స్ ను లైట్ గా లైన్స్ లేదా పట్టీలు ఉన్నవి ఎంపిక చేసుకోవాలి.
5. టర్ట్లే నెక్ మరియు క్ర్యూనెక్స్ ఎంపిక చేసుకోవడం వల్ల సురక్షితంగా ఉంటాయి: చల్లని శీతాకాలంలో ఈ రెండు టర్ట్లేనెక్(మెడను పూర్తిగా కవర్ చేసినవి)క్ర్యూనెక్స్ (హాఫ్ కాలర్) రెండూ స్వేటర్స్ ను ఎంపికచేసుకోవడం చాలా మంచి పద్దతి. వీనెక్ వున్న స్వెటర్స్ ను ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అవి అందంగా కనబడాటినికి మాత్రమే ఉపయోగపడుతాయి. అయితే అవి శరీరానికి ఎంటువంటి రక్షణ కల్పించదు. షర్ట్ ధరించినప్పుడు ఎప్పుడు కూడా బటన్స్ పూర్తిగా పై వరకూ వేసుకోవాలి. పైన ఓపెన్ గా ఒక బటన్ వదిలివేయడం వల్ల చూడటానికి అందంగా హ్యాండ్సమ్ గా కనబడదు.
కాబట్టి చాలా సన్నగా ఉన్న పురుషులు హ్యాండ్సమ్ గా కనబడాలంటే అన్ని సమయాల్లో అట్రాక్టివ్ గా కనబడే లా ఉంట. చాలా మంది స్త్రీలు ఎక్కుగా మసిల్స్ ఉన్న పురుషులను ఎక్కువగా ఇష్టపడుతారు. కాబట్టి సన్నగా ఉన్నవారు. ఎక్కువగా ఎప్పుడూ అట్రాక్షించే విధంగా ఉండకుండా సహజంగా ఫిట్ గా కనబడేలా ప్రయత్నించాలి. అప్పుడే వారి సహజ రూపం ఇతరులకు ఆకర్షింపబడుతుంది. హ్యాండ్సమ్ గా కనబడాలనుకొనే వారు ఎక్కువ బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. అలాగే డ్రెస్ కు తగ్గ హెయిర్ స్టైల్ ను చేయించుకోవడం మరిత ఆకర్షణ.



Click it and Unblock the Notifications