Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గాజుల గలగలలు...మహిళల మోజులు...!

ఆడవారి అలంకరణలో ముఖ్యంగా చేతులకు గాజులు రకరకాలుగా వేసుకొంటుంటారు. వాటి డిజైన్లలో ఎన్నో మార్పులు ఎప్పుడు కొత్తదనం...దానికి తగ్గట్టుగా ఫ్యాషన్లు మారిపోతున్నాయి. బంగారం ఆభరణాల స్థానంలో వివిధ రకాల అలంకరణ సాధనాలు రావడం వల్ల మరింత ఖర్చు పెరుగుతోంది. ఏవో కొన్ని నగలు ధరించకుండా స్త్రీలు ఉండలేకపోతున్నారు. బంగారం, వెండి నగల స్థానంలో ఇమిటేషన్ గోల్డు నగలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. రకరకాల పూసల దండలు తయారవుతున్నాయి.
చేతులకు ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది. పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు రెండు చేతులకూ రంగురంగుల మట్టిగాజులు వేసుకుంటే మహిళల చేతులు కళకళలాడుతూ ఆకర్షణీయంగా వుంటాయి. చిన్నపిల్లలకైతే మట్టి, పింగాణీతో చేసిన గాజులు వేయడం కన్నా ప్లాస్టిక్, రబ్బరు, మెటల్, బంగారంతో చేసిన గాజులే భద్రంగానూ, చూడముచ్చటగానూ వుంటాయి. చిన్నపిల్లలకు సన్నటి గాజులు నాలుగైదు వేయడంకన్నా వెడల్పుగా వుండే సింగిల్ గాజు వేస్తేనే అందంగా వుంటుంది. రోజూ వేసుకునే కటింగ్స్ గాజు, గాజులకు వుండే మెరుపు కొన్ని రోజులకు పోతుంది. వాటిని వెంటనే మార్చేయాలి. లేకుంటే అందవికారంగా వుంటుంది.
పెద్దవాళ్ళకు కాఫీ, నీలం, వైలెట్, ఎరుపు, ఆకుపచ్చ మొదలైన ముదురు రంగు గాజులపై డిజైన్స్ వున్న గాజులు బావుంటాయి. బంగారం గాజుల మధ్యలో మెరుపు గాజులు వేసుకోవడం కన్నా ప్లెయిన్ కలర్ ముదురు రంగు గాజులు వేసుకొంటే అందంగా వుంటుంది. కొంతమంది చేతికి అడ్డశిల వుండటంతో మట్టిగాజులను ఎక్కించడం కొంచెం కష్టమవుతుంది. అటువంటివారు చేతికి క్రీం రాసుకొని గాజులు వేసుకుంటారు. అలా కాకుండా బాత్‌సోప్‌ను చేతికి పట్టించి గాజులు వేసుకుంటే త్వరగా వేసుకోవచ్చు. చిట్లకుండానూ వుంటాయి.పండగ సందర్భాల్లో కొత్త డ్రస్‌కు నప్పే రంగు గాజు, గాజులు రెండు చేతులకు వేసుకుంటే పండగ సందడి అంతా గాజుల గలగలలోనే వుంటుంది.
తెల్లని ముత్యాలు, వజ్రాలతో చేసిన నగలు ధరిస్తే ధగధలాడటం ఖాయం అయితే మీరు వయస్సును దృష్టిలో పెట్టుకొని నగలు చేయించుకోవడం తప్పనిసరి. అవి మీతోపాటు కుటుంబసభ్రులు కూడా వాడుకోవడానికి వీలుంటే బాగుంటుంది. వజ్రాలు పొదిగిన గాజు మందంగా లేకుండా చూడ్డానికి సాధారణంగా కనిపిస్తుంది. లోపలవైపు సాదాగా ఉన్నా.... పైన వజ్రాలను పువ్వుల మాదిరి పొదిగి రూపొందిస్తే చూడటానికి చెట్టులా కనిపిస్తుంది.
మెరిసిపోయే బంగారు ధగధగలకు పాలమీగడ వర్ణం తోడైతే ఆ కళే వేరు. అందుకే గాజులకు కానీ, బ్రాస్లెట్ లో కానీ ముత్యాలను పొదిగి చేయించుకొంటే బాగుంటుంది. బంగారాన్ని రుద్రాక్ష్ల పరిమాణంలో ఉండేలా అదే ఆకృతిలో ఐదారు చేయించుకొని ... వాటి మధ్యలో రెండు ముత్యాలను అమర్చాలి. వీటిని పసిడి తీగలతో దండగా గుచ్చి గొలుసుల సాయంతో సరి చేసుకొనే విధంగా ఏర్పాటు చేస్తే చూడచక్కటి బ్రేస్లెట్ రెడీ అవుతుంది. ఇలాంటివి కార్పొరేట్ మహిళలకు ఇవి చాలా బాగుంటాయి. చీరల మీదకూ సౌకర్యంగానే ఉంటాయి.



Click it and Unblock the Notifications