For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందం...ఆకర్షణ...శంకాకృతి మెడలోనే...

|

Beautiful Necklines
అందమైన మెడ, దానికి ఆకర్షనీయమైన నగలు జత కలిస్తే ఆ ఆందమే వేరు. అందులో మీరు డిఫరెంట్ గా కనిపిస్తారు. అందమైన నెక్ లెస్ మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతుంది. మీలోని సౌందర్యం..ఆత్మవిశ్వాసం మీకొక ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెడతాయి. భుజాలు వంచుకుని నడిచే మహిళలు దానికి తోడు సరిపోని దుస్తులు వేసుకునే మహిళలు ఎంత అందవికారంగా కనిపిస్తారో మీరు చూసే ఉంటారు. అందం విసయం చర్చకు వచ్చినప్పుడు మీ నెక్ లైన్ అంటే మీ మెడ ప్రాధాన్యత ప్రత్యేకంగా ఉంటుంది.

బోట్ నెక్ లేదా జ్యూయల్ నెక్: మీ ముఖం ఇలాగే హార్ట్ షేప్ లో ఉంటే మీకు ‘బోట్ నెక్’లేదా ‘జ్యూయల్ నెక్’ డిజైన్ బాగా సూట్ అవుతుంది. మెడ పొడవుగా ఉండి, తల చిన్నగా ఉన్నవారికి బోట్ నెక్ మంచి ప్రత్యామ్నాయం. ఈ డిజైన్ ముఖాన్ని పెద్దగా చూపిస్తుంది.

స్క్వేర్ నెక్: తక్కువ వయస్సు ఉన్న చామన ఛాయ మహిళలకు, మెడ వెల్ బిల్ట్ గా ఉన్నవారికి స్క్వేర్ నెక్ మరింత అందాన్ని తీసుకువస్తుంది. అయితే ఇలాంటి నెక్ లైన్ లోతును మీ కంఫర్ట్ ను దష్టిలో పెట్టుకుని రూపొందించుకోవచ్చు.

ముఖం వెడల్పు, గుండ్రంగా ఉన్నవారికి ‘వీనెక్,’‘స్క్వేర్ నెక్’, ‘స్కూప్ నెక్’ లేదా మోక్ టర్ట్ ల్ నెక్’ బాగా ఉంటుంది. పొడవాటి మెడ ఉన్న వారు ‘ఫనెల్’, ‘కౌల్’, ‘మైండ్రెన్’, టర్ట్ల్ నెక్ లైన్’ ట్రై చేస్తే బాగుంటుంది.

ప్లగింగ్ నెక్ లైన్ మీ షోల్డర్ చిన్నగా, వర్తులాకారం లో ఉంటే ప్లంగింగ్ నెక్ లైన్’ అంటే ప్లో అయ్యే నెక్ లైన్ తో టేస్ట్ చేయకండి. సరైన నిష్పత్తిలో ఫిగర్ ఉన్నవారికే ఈ నెక్ లైన్ ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది.

స్కూప్ నెక్ ప్యాటర్న్: ఒక వేళ షోల్డర్ చిన్నగా ఉండి మీరు దీన్ని పొడవుగా నెక్ బిల్ట్ ప్రదర్శించాలనుకుంటే నెక్ లేదా స్కూప్ ప్యాటర్న్ అనుసరించండి. ఒక వేళ మీ డబుల్ చిన్ కనిపిస్తుంటే మీరు ఈ ప్యాటర్న్ కు దూరంగా ఉండడం మంచిది.

English summary

Beautiful Necklines To Teens Look Their Best... | మెడ అందంగా కనబడాలంటే.....

Scoop neckline - The scoop neckline is a U-shaped neckline that will show off a fair amount of chest and therefore gives you plenty of space to accessorize with a nice necklace. It is suitable for any type of bust whether larger or smaller.
Story first published:Saturday, March 10, 2012, 15:07 [IST]
Desktop Bottom Promotion