Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వేస్తే తంటా...వేయకపోతే చింత...?

చర్మంపై ప్రత్యేక సంరక్షణ తీసుకోవడం: టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు ఎంత అందంగా... ఆకర్షనీయంగా అలంకరించుకొంటారు అనడంలో సందేహం లేదు. అయితే ఆ అలంకరణకు సరైన ఉత్పత్తులను వాడకపోతే చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్మంలోని దుమ్ము, ధూళి, నూనె తొలగించడానికి రాత్రి సమయంలో ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రపరచుకోవాలి. రాత్రి సమయంలో మాయిశ్చరైజ్ చేయడం వల్ల కూడా చర్మం చాలా సున్నితంగా... మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.
మేకప్ ఎక్కువగా వేసుకోకూడదు: చాలా మంది టీనేజ్ అమ్మాయిలు మేకప్ వేసుకొనే విషయానిలో ఎక్కవ లేదా తక్కువ అనేది ఆలోచించరు. వారికి ఎలా నచ్చితే అలా వేసుకొని వెళుతుంటారు. అలాకాకుండా మేకప్ విషయంలో మెళుకువులు తెలుసుకొని వేసుకోవడం మంచిది. ముఖ్యంగా ముఖంలో అందంగా కనబడే కళ్ళు అలంకరణ విషయంలో ఐ షాడో, బ్లష్, వేసుకొనే వారు సాధారణంగా వేసుకుంటే సింపుల్ గా ఉంటుంది. చర్మం యొక్క ఛాయను బట్టి బుగ్గల మీద పింక్ బ్లష్ జోడిస్తే సరిపోతుంది. కళ్ళు పెద్దగా అందంగా కనిపించేందుకు కను రెప్పల మీద గోల్డ్ షాడో, డార్క్ మస్కారాను వేసుకోచ్చు. పెదాలకు లైట్ పింక్ లేదా న్యూడ్ లిప్ గ్లాస్ అప్లై చేస్తే లేత గులాబీల్లా ఉంటాయి.
కురులను ఆరోగ్యంగా ఉంచుకొనుట: టీనేజ్ గర్ల్స్ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం. ప్రతి రెండు నెలలకు ఒకసారి హెయిర్ ను ట్రిమ్ చేయించుకోవడం వల్ల కేశాలకు చక్కటి ఆకృతి వస్తుంది. హెయిర్ కూడా మీడియంగా పొడవు ఉంటే మరింత అందంగా కనిపిస్తారు. ఒక వేళ జుట్టు పొడిబారి డ్యామేజ్ అయ్యినట్లైతే వారానికి ఒకసారి కండిషనర్ ను తప్పకుండా వాడాలి. ఖరీదైన కండీషనర్లు కొనకుండా ఆలివ్ ఆయిల్ అందుబాటులో వుంటే అది పెట్టుకొన్న సరిపోతుంది. మైక్రో వోవెన్ లో ముప్పై నిమిషాల పాటు ఒక కప్పు ఆలివ్ ఆయిల్ ను వేడిచేసి గోరు వెచ్చగా అయిన తర్వాత తలకు బాగా మసాజ్ చేసుకోవాలి. అరగంట తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే నిగారింపైన మెరిసే జుట్టు సొంతం అవుతుంది.



Click it and Unblock the Notifications