Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మేకప్ తో మరింత వెరైటీ లుక్ కావాలనుకుంటే...

ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ‘ఐ'బ్రో కలరింగ్ ఫ్యాషన్ కి బాగా ఆదరణ లభిస్తోంది. ఇందులో మొదటి పద్దతి ‘ఐ' బ్రో కలర్ పెన్సిల్ తో కలరింగ్ చేయడం రెండో పద్దతి బ్రాండెడ్ కలర్స్ చిన్న బ్రష్ తో కలరింగ్ చేయడం. దీని కోసం ‘ఐ' బ్రో పౌడర్ నూ ఉపయోగిస్తారు.
‘ఐ' బ్రో కలర్ పెన్సిల్: మీరు మీ కనుబొమ్మలను కలర్ పెన్సిల్ తో అందవమైన లుక్ తీసుకురావచ్చు. ఈ కలర్ పెన్సిల్స్ 10-12 రంగుల్లో మార్కెట్లో లభిస్తున్నాయి. ‘ఐ' బ్రో పెన్సిల్ తో కనుబొమ్మలపై చిన్న స్ట్రోక్స్ ఇచ్చి తర్వాత బ్రోజ్ లోపల చేతులతో నెమ్మదిగా రాయాలి. దీన్ని ఏదైనా కాటన్ బడ్ తో చేయవచ్చు. చిక్ లుక్ కోసం మీకు నచ్చిన కలర్ షేడ్స్ లో పెన్సిల్ తో విభిన్న రకాల స్ట్రోక్స్ ఇవ్వచ్చు.
పౌడర్ కలరింగ్: ఒక వేళ మీరు బ్రో పౌడర్ తో కలరింగ్ చేయాలనుకుంటే ఆ కలర్ వేసుకోవడానికి చిన్న ఐ'బ్రో బ్రష్ లేదా స్పాంజ్ ను వాడవచ్చు. పౌడర్ వేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కనుబొమ్మల చుట్టుపక్కల చర్మం పైన పౌడర్ పడకూడదు. ఆ తర్వాత స్పాంజ్ తో మెల్లిమెల్లిగా పౌడర్ కు నాచురల్ లుక్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. కలర్ పౌడర్ ను ఎంచుకునేటప్పుడు కనుబొమ్మల ఆకారం సైజును దృష్టిలో పెట్టుకోవాలి.
ఆకర్షణీయంగా కనిపించడానికి : మేకప్ తో మరింత వెరైటీ లుక్ కావాలనుకుంటే కనుబొమ్మలు, కనురెప్పల పై ఒకే రంగు వాడాలి. దాంతో పాటు ‘ఐ' లైనర్ కూడా మ్యాచింగ్ కలర్ తో వేసుకోవచ్చు. అయితే మేకప్ వేసుకొనే ముందు గుర్తుంచుకోవాల్సింది. ఎప్పుడూ అలాంటి కలర్స్ నే వాడండి. అవి మీ జుట్టుకు, చర్మం రంగుకు కొత్త లుక్ ఇస్తాయి. కనుబొమ్మలకు కలరింగ్ చేసుకుని, ఆ తర్వాత రాత్రి కడిగేసుకుంటే చర్మం తిరిగి సహజంగా మారిపోతుంది. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. కలరింగ్ ను ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు. వీటి కోసం షైన్ పెన్సిల్స్ కూడా లభిస్తున్నాయి.
సైడ్ ఎఫెక్టులు ఉండవు: కనుబొమ్మలపై కలరింగ్ చేయడానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. రాత్రి పడుకునేముందు కళ్లను నీళ్లతో కడుక్కుంటే కలర్ పూర్తిగా తొలగిపోతుంది. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. చిన్న చిన్న పార్టీలకూ వాటిని వేసుకుని వెళ్లవచ్చు.



Click it and Unblock the Notifications