For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాబోయే పెళ్ళి కూతురు నాజూగ్గా కనబడాలంటే...

|

Bridal makeup and body care Tips ...!
పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటుంటారు. పెళ్లికి కొంతమంది చేసే హడావిడి అంతాఇంతా కాదు. అలాంటి అపురూప క్షణాల్లో పెళ్ళికి వచ్చిన బంధు మిత్రుల సపరివారానికి నవ వధూవరులు అందంగా, ఆనందంగా కన్పించడం చాలా అవసరం. అమ్మాయిలు కూడా పెళ్లి కుదిరిన సంబరంలో ఒక్కసారిగా కొవ్వు పదార్థాలు అధికశాతంలో ఉన్న ఆహారం తీసుకుని మరీ లావెక్కిపోతారు. ఎప్పుడో ఎంగేజ్‌మెంట్‌లో మల్లెతీగలా కనిపించిన పెళ్లి కూతురు ఒక్కసారిగా పదికిలోలు పెరిగి పెళ్లికూతురుగా బొద్దుగా కనిపించేసరికి పెళ్లికొడుకు అతని తాలూకు బంధువులు అవాక్కయిపోతారు.

మరికొందరు పెళ్లి కుదిరిందని మరింత అందంగా కనిపించాలని ఉపవాసాలతో మరీ డైటింగ్‌ చేసి పెళ్లి సమయానికి నీరస పడిపోవడమో లేక పేషెంట్‌లానో తయారవుతుంటారు. పెళ్లిలో తప్పనిసరిగా తీసే వీడియో, కెమెరాలలో పెళ్లి కూతుళ్లు అందవిహీనంగా కనిపిస్తుంటారు. మరి ఆ ఫొటోలు, వీడియోలు జీవితాంతం చూసుకోవాల్సిన తీపిగుర్తులు. ఒకరి కోసం కాకపోయినా మనకోసమైనా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా నవవధువులు అందంగా కనిపించడానికి అప్పటికప్పుడు బ్యూటీపార్లర్‌లకో, క్లినిక్‌లకో వెళితే సరిపోతుందని అనుకుంటారు. అలా కాకుండా ఇంట్లోనే కొన్ని రకాల సాధనాల ద్వారా నవవధువు మరింత నాజూగ్గా కనిపించొచ్చు.

పెళ్ళి ఆలోచన మొదలైనప్పట్నుంచే అతివలు తమ జీవన శైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. మంచి ఆహారం, వ్యాయామం మీ ప్రాధాన్యతాంశాలు కావాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ప్రొద్దున ఆలస్యంగా లేవడం మానుకోవాలి. తగినంత నిద్ర ఎంత అవసరమో… సరైన వేళ పాటించడమూ అంతే అవసరం. జరగబోయే విషయాల గురించి అనవసరంగా ఆందోళన చెందే మనస్తత్వం మీదైతే రోజూ కాసేపు ధ్యానం చేసి దాన్ని అధిగమించండి. మానసిక ప్రశాంతత చర్మాన్ని సైతం మెరిపిస్తుంది.

ఎక్సర్‌సైజ్‌ లతో పాటు ఆహారం కూడా సమతుల్యంగా తీసుకోవాలి. ప్రతి రోజూ తినే ఆహారంతో పాటు ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని పాలను తాగితే మంచి నిద్ర వస్తుంది. సరైన నిద్ర లేకుంటే కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడి చూడటానికి అసహ్యంగా తయారవుతారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆయిల్‌ పదార్థాలు, స్వీట్ల జోలికి మాత్రం వెళ్లకపోవడమే మంచిది. తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా తీసుకోండి. దోస, క్యారెట్లు, బీట్‌రూట్ లాంటివి శక్తినివ్వడమే కాదు మేనిఛాయను మెరిపిస్తాయి. నీరు పుష్కలంగా తాగండి. ఏర్పాట్ల హడావుడిలో అదేపనిగా తిరుగుతారు కాబట్టి మీ వెంట మంచినీటి సీసా ఉండి తీరాల్సిందే. దాహం అధికమనిపిస్తే కొబ్బరి బోండాం తాగాలి కానీ కూల్‌డ్రింకుల జోలికి పోకుండా ఉండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం. వీలైతే పండ్ల రసాలను సేవించండి. కళ్ళ చుట్టూ నల్లని వలయాలకు క్యారెట్ రసం విరుగుడు.

డంబుల్స్‌ ఎక్సర్‌సైజ్‌...మార్కెట్లో కొన్ని రకాల డంబెల్స్‌ దొరుకుతాయి. వాటిల్లో వారు మోయగలిగినంత బరువును ఎంపిక చేసుకుని ప్రతిరోజూ డంబెల్స్‌తో ఎక్సర్‌సైజ్‌ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన శరీరాకృతి ఒక క్రమపద్ధతిలో తయారవుతుందంటున్నారు. కార్డియోవాస్క్యులర్‌ ఎక్సర్‌సైజ్‌ ద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించవచ్చని అంటున్నారు. ప్రతిరోజూ ఒకే ఎక్సర్‌సైజ్‌ చేస్తే బోర్‌ అనిపించవచ్చు. అందుకే ఒక రోజు నడక, మరోరోజు జాగింగ్‌, సైక్లింగ్‌, ఏరోబిక్‌ లాంటి వ్యాయామాలను ఎంపిక చేసుకుని వీటిల్లో ఏది చేసినా అవి ఒంట్లో కొవ్వును కరిగిస్తాయి.

ఎక్సర్‌సైజ్‌ చేయగానే ఒక పది నిమిషాలు కదలకుండా అలానే పడుకోవాలి. ఇవన్నీ కుదరకపోతే కనీసం రోజుకు 20 నిమిషాలు మన ఇంట్లోనే మ్యూజిక్‌ హమ్‌ చేస్తూ ఏరోబిక్‌ ప్రాక్టీస్‌ చేయవచ్చు. నడుముకు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌ తప్పనిసరిగా చేయాలి. సైకిల్‌ ఉంటే మరీ మంచిది ప్రతి రోజూ క్రమం తప్పకుండా రెండు లేక మూడు కిలోమీటర్లు సైక్లింగ్‌ చేసే అమ్మాయిల్లో కొవ్వు శాతం అస్సలే ఉండదని సూచిస్తున్నారు.

English summary

Bridal makeup and body care Tips ...! | కాబోయే పెళ్ళి కూతురుకి చిట్కాలు...

Start doing this minimum 2 months before your wedding. The biggest tip I have to give for any bride is drink loads and loads of water and keep your stress level minimum. No beauty treatment will work if you don’t drink enough water or you are highly stressed. Remember to choose your wedding makeup/hair style so that it looks good in photos too. Please, please have a trial makeup/hairstyle session before your wedding. Learn to pose for the camera and smile confidently.
Story first published:Wednesday, May 2, 2012, 18:09 [IST]
Desktop Bottom Promotion