Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పెళ్లిరోజు మేకప్ ఎలావుండాలి...?

1. పెళ్లిరోజున బ్రైడల్ మేకప్ చేయించుకునే ముందు చేసే స్నానం నీళ్లలో మీకు నచ్చిన పెర్‌ఫ్యూమ్ కలుపుకోండి. బ్రైడల్ మేకప్ తొందరపాటుగా చేయించుకోవద్దు.
2. పెళ్లి రోజు మేకప్ మీ జువెలరీని బట్టి ఉంటుంది. నగలు మరీ ఎక్కువగా ఉంటే లైట్ మేకప్ బాగుంటుంది. పెళ్లి, రిసెప్షన్ రాత్రి సమయాల్లో ఉంటే హెవీ మేకప్ బాగుంటుంది.
3. ఐ మేకప్ వేసుకునే సమయంలో కళ్ళపై మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీంతో కళ్ళు మరింత అందంగా కనపడతాయి. ఐ షాడో కోసం సహజమైన రంగులను వాడాలి. మెరిసే రంగులను వాడకపోవడం మంచిది. ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాకొలేట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్‌లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగించండి.
3. పెదాలకు వ్యాజిలైన్ అప్లై చేసి మెత్తని టూత్ వూబష్‌తో రుద్దాలి. ముఖానికి ఫౌండేషన్ వేసేటప్పుడు అది పెదాలకు అంటకుండా జాగ్రత్తపడాలి. లిప్ స్టిక్, ఐషాడో మీ స్కిన్ టోన్‌కు, మీరు ధరించే డ్రెస్ కు సెట్ అయ్యే విధంగా ఉండాలి.
4. బుగ్గల్లో కెంపుకి ముదురు రంగు బ్లష్ వాడాలి. బుగ్గలపైన హైలైట్ కూడా వేసుకుంటే అందం పెరుగుతుంది. ఇటువంటి పైపై మెరుగులతో పాటు బాగా నిద్రపోవడం వల్ల ముఖం నిగారింపు వస్తుంది.
5. ఫౌండేషన్ ముఖంతోపాటు బయటికి కనిపించే మెడ, బ్యాక్, చెవులకు కూడా వేయాలి. ముఖం వరకే వేయడం వల్ల ముఖానికి రంగేసినట్లుగా ఉంటుంది.
6. మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు ఉంటే వాటిని కన్సీలర్‌తో కప్పివేయాలి. కన్సీలర్ ను మందంగా పూయకుండా శరీర ఛాయకు తగ్గ రంగును పలుచగా రాయాలి.
7. వాటర్ ప్రూఫ్ మస్కారాను వాడాలి. గ్లాసీ లిప్ స్టిక్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. అదే షేడ్‌లో ఉన్న లిప్‌లైనర్‌ను వాడాలి. లేదంటే లిప్‌స్టిక్ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.
8. పెళ్లికి ముందు అంతకుముందు వాడని కొత్త బ్రాండ్ ఉత్పత్తులతో ప్రయోగాలు చేయకండి. మీ చర్మానికి అవి సరిపడకపోతే దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications
