Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
ఫ్యాషన్ ప్రపంచంలో అలంకరణ వస్తువులు బోల్డన్నీ.....

ఇక కంటి సంరక్షణకే కాదు ఫ్యాషన్ కూడా కళ్ల అద్దాలను ఉపయోగిస్తున్నారు. వాటిలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందంగా, ఆకర్షనీయంగా ముఖానికి సరిపడే కళ్ల అద్దాలను సెలెక్ట్ చేసుకోవాలి. కళ్లఅద్దాలు కాలానుగుణంగా షేడ్స్ సెలక్ట్ చేసుకోవాలి. వేసవిలో డార్క్, వర్షాకాలంలో ప్లెయిన్, చలికాలంలో లైట్ షేడ్ గాగుల్స్ బాగుంటాయి. ఇక తలకు పెట్టుకొనే హ్యాట్ లేదా క్యాప్ మనం వేసుకునే డ్రెస్ ను బట్టి షేడ్స్ సెలక్ట్ చేసుకోవాలి. ఫ్రాక్స్ ధరించినప్పుడు మంచి లేసులతో డిజైన్ చేసిన హ్యాట్స్ బాగుంటాయి. జీన్స్, టీషర్ట్స్ వేసుకున్నప్పుడు క్యాప్స్ అందంగా ఉంటాయి. ఇక స్కార్ఫ్ విషయానికి వస్తే ప్లెయిన్ టీ షర్ట్స్ ధరించినప్పుడు ప్రింటెడ్ స్కార్ఫ్, ప్రింటెడ్ టీ షర్ట్ ధరించినప్పుడు ప్లెయిన్ స్కార్ఫ్ వేసుకుంటే కలర్‌ఫుల్ గా కనిపిస్తారు. వింటర్ లో ఊలు స్కార్ఫ్‌లు ధరిస్తే స్టైల్ గానూ, సౌకర్యంగానూ ఉంటుంది.
వేసుకొనే చెప్పుల్లో కూడా మంచి అభిరుచి కలిగి ఉండాలి. జీన్స్ వేసుకున్నప్పుడు బోట్, థంబ్ షూస్, హీల్స్, ఫ్లాట్స్, స్లిప్పర్స్, వింటర్ లో లాంగ్ బూట్లు కూడా బాగుంటాయి. ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు స్కిల్ టోస్ కాని, పంప్ షూస్ కానీ వాడాలి. చీర, సల్వార్ కమీజ్ ధరించినప్పుడు ఎంబ్రాయిడరీ చేసిన మ్యాచింగ్ చెప్పులు, హై హీల్స్ వేసుకోవాలి. అబ్బాయిలు కుర్తా పైజామాలు ధరించినప్పుడు జూటీలు వేసుకోవాలి. వర్షాకాలం, వేసవికాలంలో గొడుగులు వాడేటప్పుడు డ్రెస్ కు తగ్గట్టుగా ఎంపిక చేసుకోవాలి. అంటే ప్రింటెడ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్లెయిన్, ప్లెయిన్ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్రింటెడ్ గొడుగు వాడితే బాగుంటుంది.
హ్యాండ్‌బ్యాగ్స్ విషయంలోకి వస్తే... శారీస్ కట్టుకొని పార్టీకి వెళ్లేప్పుడు ఎంబ్రాయిడరీ చేసిన క్లచెస్ పట్టుకోవాలి. బెల్టులు అయితే, మార్కెట్లో రకరకాల సైజుల్లో లభిస్తున్నాయి. లెదర్, షిమ్మర్ లెదర్, కాటన్, డెనిమ్, ఎంబ్రాయిడరీ.. ఇన్ని రకాల బెల్టులను ఎంపికచేసుకోవచ్చు. ప్లెయిన్ టాప్‌వేసుకొని మూడు అంగుళాల బెల్టు పెట్టుకుంటే డ్రెస్ కి మంచి షేప్ వస్తుంది. ఒక మంచి ఫ్రాక్ వేసుకొని దానికి కూడా హెవీ బెల్ట్ పెట్టుకుంటే లుక్ చాలా ఫ్యాషనబుల్ గా కనిపిస్తుంది. డ్రెస్ ఎంపిక ఎంత ముఖ్యమో దానికి తగిన యాక్సెసరీస్ పర్ ఫెక్ట్‌గా ఉంటేనే ఆ డ్రెసింగ్ అంత బాగుంటుంది.
వీటన్నింటితో పాటు ప్రవర్తన మనకు లేని అందాన్ని, హుందాతనాన్ని, ఆకర్షణనను తెచ్చిపెడుతుంది. ప్రతి కదలికలకు జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. మంచి శరీర ఆకృతి, డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే సరిపోదు. దానికి తగిన గొంతు కూడా ఉండాలి. మాట్లాడుతున్నంత సేపు ఇతరులకు వినాలనే రీతిలో మాట్లాడడం అలవరుచుకోవాలి. ముఖ్యంగా మాట్లాడే భాష స్వచ్చంగాను, సరళంగాను ఉండాలి. ఉచ్చరణలో లోపాలు ఉంటే గట్టిగా చదివిలోపాలు సరిదిద్దుకునే విధంగా ప్రాక్టీసు చేసుకోవాలి. మంచి కంఠ స్వరంతో ఎంతటి పనులైనా సాధించవచ్చు. అదే ఎంత అందంగా ఉండి..ఎంత అందంగా అలంకరించుకొన్నా సరే ఎవరూ పట్టించుకోరు. కాబట్టి అన్నివిధాలుగాను ఎదుటి వారిని ఆకర్షింపబడే విధంగా ఉండాలి.



Click it and Unblock the Notifications