Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గ్లామరస్ లుక్ నిచ్చే చీర...జాకెట్...!

దానికి తగ్గట్టు కొత్త చీర కొనుక్కోవడం...దానికి జతగా జాకెట్లు ఎంచుకుని..సాదాగానో, బుట్టచేతలు పెట్టి కుట్టిచుకోవడమో ఒకప్పటి మాట. ఇప్పుడు ధరించే చీరల్లోకి, జాకెట్లు ఆధునికతకు అద్దం పట్టేవిగా ఉండాల్పిందే. నెట్ జోడించి కుట్టిన పొడవాటి చేతులు, వీపుభాగం తక్కువగా ఉండటం..భుజం దగ్గర పట్టీలు..ఇలాంటి వైవిధ్యంతో కుట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు అమ్మాయిలు. అలా చేయడంతో పర్సనాలిటీకి గ్లామరస్ లుక్ పెంచుకొంటున్నారు.
ప్రత్యేక సందర్భంలో ధరించేందుకు చూడచక్కని పాత తరహా జాకెట్ల(బ్లౌజులు) ఎంపిక చేసుకొని వింటేజ్ తరహా పొడవాటి చేతులతో మెరిసిపోతున్నారు. విభిన్నంగా ఎంబ్రాయిడరీ చేసిన కోర్సెట్ బ్లవుజులు కూడా ఇప్పటి తరహానే అంటున్నారు. మోడ్రన్ గా కుట్టించుకొంటున్న జాకెట్లు ఒక్క వెనుకభాగమే కాదు...ముందు భాగం కూడా విభిన్నంగా కుట్టినట్లు కనిపిస్తేనే ఈ రోజుల్లో సొగసు.
బ్లౌజ్ డిజైన్ లో కీహోల్ మెడని ఎంపిక చేసుకొని ఫ్యాషన్ వేదికలపై తళుక్కుమంటున్నారు డిజైనర్లు. ఇక, వెనుక భాగం ముడి వేసుకునేాలా పట్టీల్లేని బ్లౌజులు, రకరకాల పూసలతో తీర్చిదిద్దిన వన్ షోల్డర్ బ్లౌజులూ తాజా ట్రెండే..ఎంపైర్ లైన్ కట్ వర్క్ చేయించుకోవడం, భుజాలకు ప్రత్యేకమైన పనితనం వంటివన్నీ ఈ రోజుల్లో చూడచక్కగా ఉంటాయి. అలాంటి డిజైన్లను పొందాంటే..నెట్, వెల్వెట్, క్రేవ్..వంటి వస్త్రాలను చీరలకు తగినట్లుగా ప్రకాశవంతమైన రంగుల్లో ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఫ్యాషన్ నిపుణులు...



Click it and Unblock the Notifications