For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమికుల రోజూ శుభాకాంక్షలు....

|

Valentines Day
జీవితానికి పరిపూర్ణత కలిగించే రోజు ఈ రోజు. ప్రేమకోసం ఒంటరిగా పోరాడుతూ ప్రేయసి లేదా ప్రియురాలిని మెప్పించడంతో పాటు ప్రేమ ప్రయాణాన్ని సాగించేందుకు 'ప్రేమికుల రోజు' నాంది పలుకుతుంది. యువతీ యువకుల మధ్య చిగురించే అపురూపమైన ప్రేమలో అందమైన అనుభూతులను పంచుకునే ప్రేమికుల రోజు నేడు. ఊహకందని ఊసులు చెప్పుకుంటూ రోజంతా ఉల్లాసంగా గడిపే ఈ రోజును ఆస్వాదించేందుకు యువత ఆనందంగా ఎదురుచూస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కనిపించే పూపొదలను వదలకుండా కలియ తిరిగే ప్రేమజంటలు అడుగడుగునా దర్శనమిస్తాయి. జాతి, కుల, మత, ప్రాంతాలకతీతంగా యువతలో కలిగే హృదయ స్పందనలకు అనుగుణంగా పెనవేసుకునే 'ప్రేమ' బంధాన్ని మరింత బలంగా మలచుకునేందుకు వాలంటైన్స్‌ డేగా పేర్కొనే ప్రేమికుల రోజు వేదికగా నిలుస్తోంది.

ఈ ప్రేమ బంధాన్ని ప్రారంభించేందుకు వాలెంటైన్ డే ఎంచుకున్న వారు ప్రత్యేక బహుమతుల ద్వారా మీ ప్రేమ భాగస్వామిని మెప్పించవచ్చు. ప్రేమ పక్షులు క్షణమొక యుగంగా గడిపే ఈ రోజు కోసం వారు ప్రతీరోజూ నిరీక్షిస్తుంటారు. ప్రేమికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకున్న పలు వ్యాపార సంస్థలు, వెబ్‌ సైట్‌లు సరికొత్త తరహాలో వారిని ఆకర్షిస్తున్నాయి. గత కొంతకాలంగా పెరిగిపోతున్న ఇంటర్నెట్‌ ప్రేమాయాణాలకు అదే ఇంటర్నెట్‌ లో అందమైన కానుకలు కూడా అందుతున్నాయి. బయట ప్రపంచంలో వాలంటైన్స్‌ డే అనుభూతులను పంచుకునేందుకు ఆనందంగా సిద్ధమయ్యే జంటకు కొన్ని సంస్థల నుంచి ఇబ్బందులెదురవుతున్నాయి.

English summary

Happy Valentines Day........... | ప్రేమికుల రోజూ శుభాకాంక్షలు....

Valentines Day is a day to express your love, and to celebrate the spirit of love.
Story first published:Tuesday, February 14, 2012, 12:16 [IST]
Desktop Bottom Promotion