Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మోడ్రన్ దుస్తులతో హాటెస్ట్ ట్రెండ్...

ప్రస్తుకాలంలో ధరించే దుస్తులు, కేశాలంకరణలో ప్రతి ఏడాదీ ఒక కొత్త ఒరవడి కనిపిస్తుంటుంది. ఒక దశలో అనార్కలీలు గ్రాండ్‌గా ఆకట్టుకుంటే, మరోసారి షల్వార్ కమీజులు సాఫ్ట్‌గా వార్డ్ రోబ్‌లో చేరిపోయాయి. నిన్నటికి నిన్న లెగ్గింగ్స్ మార్కెట్ అంతా హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా డ్రెస్సుల ఎంపికలోనూ కలర్స్ లోనూ, మోడల్స్ లోనూ, అందంగా ఆకర్షింపడుతున్నాయి. అయితే ఫ్యాషనబుల్ గా ఉండేటటువంటి డ్రెస్సులు ఎలాంటి కలర్స్ నప్పుతాయో, ఎలాంటి కలర్స్ ఎన్నిక చేసుకోవాలో చూద్దాం...
డ్రెస్స్ కలర్స్: సహజసిద్ధంగా కనిపించే రెడ్, బ్రైట్ ఆరెంజ్, ఎల్లో, ఆక్వాటిక్ బ్లూ, గ్రీన్... బ్రైట్ కలర్స్ ఈ ఇయర్ ఫ్యాషన్ కానున్నాయి. అలాగే కలర్ బ్లెండింగ్స్... అంటే ఒకే ఫ్యాబ్రిక్ రెండు రకాల షేడ్స్‌లో కనిపించేవి కూడా ఫ్యాషన్ అవుతాయి.
ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్స్: అనిమల్ ప్రింట్స్... పువ్వులు, లతలు ఉన్న ప్రింట్స్... ఇలా సహజసిద్ధంగా కనిపించేవన్నీ చాలా మందిని ఆకట్టుకుంటాయి. ఫార్మల్ షర్ట్స్‌కు కూడా శాటిన్ ఫ్యాబ్రిక్ వాడటం ఎక్కువవుతుంది.
ఫ్యాషన్ డ్రెస్సులను బట్టి హెయిర్ స్టైల్: పొడవాటి జుట్లు తగ్గించి లో పోనీటెయిల్స్, లో సైడ్ పోనీ, ఫార్మల్ సైడ్ పోనీలు...
శాండిల్స్: హై హీల్స్‌కు బదులుగా ప్లాట్ శాండిల్స్ వాడటం ఫ్యాషన్ కానున్నాయి.ఫ్యాషన్‌ని అనుసరించేవారు తమ వార్డ్ రోబ్‌ని ఈ ఏడాదికి అనుగుణంగా డిజైన్ చేసుకోవాలి. ఇక నుంచి కొనాలనుకునే ప్రతి డ్రెస్‌ను మారుతున్న ఫ్యాషన్‌ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయించుకుంటే మీ లుక్ ఈ ఏడాదంతా స్టైలిష్‌గా ఉంటుంది.
రెట్రో లుక్: అనుకరణ స్టైల్స్ ఎక్కువగా వస్తాయి. గ్యాదర్స్ ఉండే లాంగ్ స్లీవ్స్ పెద్ద యోక్స్‌తో ఉన్న వెయిస్ట్ లైన్, అంబ్రిల్లా స్టైల్ సల్వార్ కమీజులు ఫ్యాషన్ అవుతాయి. మొన్నటి వరకు మనం లెగ్గింగ్స్ చూసాం. ఇప్పుడిక లూజ్‌గా ఉండే సల్వార్స్ ఫ్యాషన్ అవుతాయి. స్ట్రెయిట్ కట్స్ ఉండే సల్వార్ కమీజుల్లో రౌండ్ కట్స్ ఫ్యాషన్ అవనున్నాయి.
ఫిట్స్: ఇప్పటి వరకు స్కిన్ టైట్‌ని ఎక్కువ మందిని ఆకట్టుకున్నాయి. ఇక రానురాను వీటిలో కూడా మార్పు సంతరించుకుంటుంది. ఫిట్స్ అంటే కొద్దిగా లూజ్‌గా ఉండేవి ఈ ఏటి మేటి ఫ్యాషన్‌లో అగ్రస్థానంలో ఉంటాయి. మళ్లీ బ్యాగీ ప్యాంట్లు, పెద్ద పెద్ద యోక్స్, ఫ్రిల్ ఉన్న ఫుల్ స్లీవ్స్... గతంలో ఏవైతే ఫ్యాషన్ గా ఉన్నాయో మళ్ళీ అవే రానున్నాయి. ఫంకీగా ఉండే ప్రింటెడ్‌వి, మెరిసిపోయే షర్ట్స్, షీర్ మ్యాక్సీలు స్త్రీలను ఆకట్టుకొనే ఫ్యాషనబుల్ ఐటమ్స్ అవుతాయి. జంప్‌సూట్స్, వైడ్‌లెగ్ ప్యాంట్స్ ఇక నుంచి హాటెస్ట్ ట్రెండ్. అబ్బాయిల డ్రెస్సుల్లో మాత్రం ఎక్కువగా స్పోర్టీ లుక్ ఉండేవి ఫ్యాషన్ అవుతాయి.



Click it and Unblock the Notifications