Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
ముఖం అందంగా కనబడాలంటే..చెక్కిళ్ళు మెరవాళ్ళిందే...!

ముఖ్యంగా ముఖంలో అందంగా కనబడె బుగ్గలు లేదా చెక్కిళ్ళే. అలంకరణ చేస్తే చెక్కిళ్లు సహజ రూపాన్ని ఇవ్వాలి. సహజ రూపం అంటే బుగ్గులు ఎప్పుడూ పింక్ కలర్ లో ఉంటేనే అందంగా కనిపిస్తాయి. మీ బుగ్గలు అందంగా కనిపించాలంటే బ్లషర్‌తో బుగ్గలకు రోజ్ అప్లయ్ చేసుకోవాలి. గుండ్రటి ముఖం కలవారు బ్లషర్‌ని ట్రయాంగిల్ షేపులో వాడాలి. కోలముఖం కలవారు బ్లషర్‌ని వర్టికల్, హారిజాంటల్ డైరక్షన్‌లో అప్లయ్ చేయాలి.
పౌడర్ ను మీ చర్మ రంగును బట్టి స్కిన్ పౌడర్ ను సెలక్ట్ చేసుకోవాలి. పౌండేషన్ అప్లయ్ తేశాక ముఖానికి పౌడర్ అద్దాలి. ఈ పౌడర్ యూనిఫాంగా వుండాలి. ఫౌడర్‌ని అతిగా అప్లయ్ చేయడం మంచిది కాదు. ఎక్సెస్ ఫౌడర్‌ని రిమూవ్ చేసుకోవాలంటే పఫ్‌తో నెమ్మదిగా తుడిచి వేయాలి. తర్వత సున్నితంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి.
షేడింగ్ కోసం డార్క్ కలర్స్ నప్పుతాయి. తర్వాత లైటర్ షేడ్స్ వేయడం వల్ల చెక్కిళ్ళు ఎత్తికనబడేలా చేస్తాయి. ముందు డార్క్ షేడ్ తర్వాత లైడ్ అప్లై చేయాలి. ఈ రెండూ బాగా కలిసిపోయే విధంగా చూసుకోవాలి. బుగ్గల మీద బ్లషింగ్ చేసేటప్పుడు తప్పకుండా మీ ఫోర్ హెడ్ మీద కూడా బ్లష్ చేయాలి. అలాగే ముక్కు, గడ్డము ఇలా అన్ని అవయవాలను కవర్ చేయడం వల్ల మంచి ఫలితాలనిస్తుంది.
కళ్ల కింద నల్లని వలయాలు కనిపించకుండా వుండాలంటే వైట్ కలర్ ఫౌండేషన్‌ను అప్లయ్ చేసుకుంటే చాలు. మేకప్ చేసుకునేటప్పుడు ఐబ్రోలను సరిదిద్దుకోవాలి. ఈ విషయంలో చాలా మంది ఐబ్రో పెన్సిల్‌ను తీసుకుని లైన్‌లాగా దిద్దేస్తారు. కానీ అది సరైన పద్ధతి కాదు. మీ కనుబొమ్మల దగ్గర పెన్సిల్ వుంచి ఆపోజిట్ డైరక్షన్‌లో అప్లయ్ చేయాలి. అప్పుడే ఐబ్రోలు నేచరల్‌గా కనిపిస్తాయి.
డ్రస్‌ని బట్టి లిప్‌స్టిక్ కాకుండా శరీర రంగుని బట్టి, ముఖానికి వేసుకునే మేకప్‌ని బట్టి లిప్‌స్టిక్ రంగులుని సెలక్ట్ చేసుకోవాలి. అప్‌లైనర్‌ని ఉపయోగించాకే లిప్‌స్టిక్ రాసుకోవడం మేలైన పద్ధతి.



Click it and Unblock the Notifications