Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అరచేతుల్లో అందాలు...మెహిందీ సొగసులు...

సౌందర్యాన్ని పెంచే సాధనం: మెహిందీ డిజైనులో ప్రాథమిక పరిజ్ఞానంతో పాటు కొద్దిగా సృజనాత్మకత ఉంటే చాలు..అలాంటి డిజైన్లను ఆవిష్కరించడం చాలా సులువు. తమకున్న అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు మహిళలు మెహిందీని సాధనంగా ఉపయోగిస్తున్నారు. మగువల సుకుమారమైన అరచేతులు, పాదాల మీద వేసే మెహిందీ డిజైన్లు వారికి కొత్త అందాన్ని సంతరింపచేస్తున్నాయి. మహిళలు ముఖ్యంగా పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు మెహిందీని సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. మెహిందీలో వివిధ పద్దతులున్నాయి. మెహిందీ ఎక్కడిదాకా పెట్టాలనకుంటున్నారో అక్కడిడాకా అడ్డగీత గీయాలి. ఆ గీత మధ్యభాగం నుంచి చూపుడు వేలుదాకా వేసుకోవాలి అంప్పడు అందంగా కనిపిస్తుంది. మెహిందీని మొదట అవుట్ లైన్ తో మొదలు పెట్టి నిలువుగీతలు అడ్డుగీతలు, పువ్వులు, అర్ధచంద్రాకారం లాంటి డిజైన్లతో తీర్చి దుద్దుకోవాలి.
పెళ్లిలో ప్రముఖ స్థానం: మన సాంప్రదాయంలో పెళ్లిలో మెహిందీకి ఎంతో ప్రాధాన్యత ఉంది మెహిందీ లేకుండా ఇప్పుడు పెళ్లిని ఊహించలేకపోతున్నాం. ఎందుకంటే పెళ్లికూతురి అందాన్ని మరింత పెంచి ఆకర్షనీయంగా మార్చే సాధనంగా మెహిందీకి ప్రత్యేకస్థానం ఉంది. పెళ్లికి రెండుమూడు రోజుల నుంచీ మెహిందీ వేసే డిజైనర్స్ కోసం వెతుకుతుంటారు. ఇప్పుడు మెహిందీ మేకప్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. మన ముంగిటే మెహిందీ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్నో పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతే కాదు బ్యూటీ పార్లర్స్ నిర్వాహకులు వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తున్నారు. అంతే కాదు బాగా మెహిందీ డిజైన్ చేస్తే ఆ డిజైనర్లకి మంచి మంచి బహుమతులు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్లతో పాటు పిల్లల బర్త్ డేపార్టీలు, అమ్మాయిలు మెచ్యూరిటీ పార్టీలు, ఇతర ఫంక్షన్స్లో మెహిందీని విరివిగా వాడుతున్నారు.
హెయిర్ కండిషనర్ గా: మెహిందీ కోసం ఉపయోగించే పౌడర్ ని వివిధ సౌందర్య సాధనాల్లో వాడుతుంటారు. మహిళలతో పాటు పురుషులు కూడా మెహిందీని హెయిర్ కండీషనర్ గా వాడతారు. మెహిందీతో వేసే డిజైన్స్ కలర్ ఫుల్ గా ఉండడం కోసం రంగుల్ని ఉపయోగిస్తుంటారు. అయితే రంగులు ఉపయోగించినవి కాకుండా సాధారణ హెన్నాని తలకు పట్టించడం వల్ల హెయిర్ కండిషనింగ్ జరిగి కురులు మరింత ఆకర్షణీయంగా పెరుగుతాయి.
ఈ విధంగా మెహిందీ అందాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమ్మాయిలు మెహిందీలో వుస్తున్న కొత్త డిజైన్లను నేర్చుకుంటున్నారు. మార్కెట్లో లభించే వివిధ పుస్తకాల్ని చదివి వాటిని దగ్గరుంచుకుని వాటి ప్రకారం డిజైన్స్ వేసుకుంటూ తమ అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటున్నారు.



Click it and Unblock the Notifications