Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
మీ ముఖ ఆకారాన్ని బట్టి దరిస్తే నే అందం .. ఆకర్షణ...

మళ్ళీ ఇప్పుడు కొందరు ఇయర్ రింగ్స్ అంటే ఆసక్తి చూపిస్తున్నారు. కంటికి కాటుక అందం, నుదుటికి బొట్టు అందం. ఇక ముక్కుకు ముక్కుపుడక అలాగే చెవికి అటూ ఇటూ గాలి వీస్తే ఊగుతూ కాంతులీనే జూ కాలు అందం. అయితే ఇయర్ రింగ్స్ అంటే లోలాకులు, కమ్మలు, జుమ్ కీలు అన్నీ వస్తాయి. ఇప్పుడీ ఇయర్ ప్యాషన్స్ అన్నిటినీ కలిపి ‘ఇయర్‌రింగ్స్'గా జువెలరీ సెక్ష న్‌లో పిలుస్తున్నారు.
కొత్తగా వస్తున్న మోడల్స్‌లో కొన్ని షాండ్లియర్స్ లాగా మార్కెట్‌లో లభిస్తున్నాయి. బంగారం లేదా బెన్‌టెక్ట్స్తో మాత్రమే ఎక్కువగా తయారయ్యే ఈ చెవి రింగ్స్ ప్లాస్టిక్, రబ్బర్, లైట్ వెయిట్ మెటల్స్ తో కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి.
చెవి ఆకారాన్ని, పరిమాణాన్ని బట్టి చెవి ఆభరణాలు ధరిస్తేనే బాగుంటుంది. దుద్దులు, రింగులు, జూకాలు, చెవిపోగు లు, మాటీలు, ఇలా అనేక రకాలు ఉన్నాయి. రింగులు ధరించే సరదా ఉన్న యువతులు చివికి, మెడకి మధ్య ఉన్న దూరాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మెడ పూర్తి గుండ్రంగా, పొట్టిగా ఉండి ముడతలతో ఉన్నట్టయితే, రింగులు చిన్నవి పెట్టుకుంటేనే బాగుంటుంది. మెడ పొడవుగా ఉండి, చెవికి, మెడకి మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉన్న యువతులకి పొడవాటి సన్నని హేంగింగ్స్ అందాన్నిస్తాయి. అనేక రకాల మెటల్స్ తో దొరుకుతున్న ఆభరణాలు శరీర ఛాయని బట్టి మెటాలిక బ్లాక్, గోల్డ్, లైట్ వెయిటెడ్ రింగ్స్ వాడితే ఇంకా బాగుంటుంది. చెవులు చిన్నవిగా ఉన్నవాళ్ళు నచ్చిన మెడల్లో దుద్దులు వాడితే బాగుంటుంది. చెవి రంధ్రాలు సాగిపోకుండా మాటీలు తప్పనిసరిగా వాడాలి.
ఇలా డిఫరెంట్ మెటీరియల్స్‌తో వస్తున్న ఇయర్‌రింగ్స్ ని ధరించేందుకు ఎక్స్ జనరేషన్ తెగ ఉత్సాహపడిపోతున్నారు. కాకపోతే అమ్మాయిలకు ఈ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చెవికి పెట్టుకునే కమ్మలు భుజాలను తాకేలా ఉంటున్నాయి. అలానే పూసలు, బిడ్స్ లాంటివి అందుబాటులో ఉన్న మెటీరియల్స్ కూడా అందమైన, ఆకర్షణీయమైన ఇయర్ రింగ్స్ మార్కెట్‌లో దర్శనమిచ్చి కనువిందుచేస్తున్నాయి.
చాలా ఎక్కువగా వాడబడుతున్న మోడల్ అతి పెద్ద చక్రల్లాంటివి. ఇవి జీన్సు డ్రెస్సుల మీదకు హుప్స్ గా పిలువబడేవిధంగా ఈ చక్రల్లాంటి రింగులు యువతులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా వివాహాది శుభకార్యాలలో ఒంటిని ఎంత జ్యువెలరీతో నింపినా చెవికి తగిన కమ్మలు లేకపోతే ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ భామల వరకు ఏ నగలు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా అదిరిపోయే ఇయర్ రింగ్స్ తో మెరిసిపోతుంటారు. ఇయర్‌రింగ్స్ పెట్టుకునేవారు హార్డ్ మెటల్ తో తయారైన వాటిని ధరిస్తే వాటివల్ల చెవులు జారిపోయే ప్రమాదం ఉంది. ఇయర్ రింగ్స్ ఎలా బడితే అలా కొని పెట్టేసుకోకుండా ఫేసును బట్టి సైజు, మోడల్ ఎంచుకుని ధరిస్తే చెవులకే కాదు ముఖానికీ అందం, ఆకర్షణ పెరిగిపోతుంది.



Click it and Unblock the Notifications