Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అతివలూ....సౌందర్య సాధనాలతో జర జాగ్రత్త...!

శరీరాన్ని శుభ్రపరచడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి, శరీరం కనిపించే తీరును మార్చడానికి కాస్మటిక్స్ ను వాడతారు. చర్మంపైన ప్రయోగించే క్రీములు, లోషన్లు, ఫెర్ ఫ్యూమ్స్, లిప్ స్టిక్స్ గోళ్లరంగులు, కళ్లకూ మొహానికి వేసుకునే మేకప్ లు వీవింగ్ లేదా విగ్గులు, జుట్టుకు వేసుకునే రంగులు, టూత్ పేస్టులు, సబ్బులు, డియోడరెంటులు, వీటిని ప్రధానంగా కాస్మటిక్స్ అంటాం. కాస్మటిక్స్ అనేవి శరీర నిర్మాణాన్ని లేదా పనితీరును మార్చవు. ఇవి కేలవలం సౌందర్యాన్ని ఇనుమడింప చేసేందుకు మాత్రమే ఉద్దేశించినవి.
సుగంధాలను వెదజల్లే ఫ్రాగ్రెన్స్ లు, పదార్థాన్ని చెడిపోకుండా చేసే ప్రిజర్వేటివ్స్ కాస్మటిక్స్ లో ప్రధానంగా ఉంటాయి. పడకపోతే చర్మ సంబంధమైన ఎలర్జీలకు శ్వాసకోశవ్యాధులకు తలనొప్పులకు ఫ్రాగ్రెన్స్ లు కారణం అవుతాయి. సౌందర్య సాధనాల్లో సహజ, కత్రిమ సుగంధ పదార్థాలను ఐదువేలకు పైగా వాడుతున్నారు. సౌందర్య ఉత్పత్తుల వ్ల చర్మ వ్యాధులు కలగడానికి మరో ప్రధాన కారణం వాటిల్లో కలిపే ఫ్రిజర్వేటివ్లు. గాలివెలుతురు తగిలి చెడిపోకుండా, బ్యాక్టీరియా, ఫంగస్ లు వంటివి పెరగకుండా కాస్మటిక్స్ లో ప్రిజర్వేటివ్ లను కలుపుతారు.
కాస్మోటిక్స్ వాడటం వల్ల ప్రాణహాని లేనప్పటికీ, అనేక రకాలైన ఆరోగ్యసమస్యలు, ఇబ్బందులూ కలిగే ప్రమాదం ఉంది. ఒక్కరు వినియోగించే మేకప్ లను ఇతరులతో పంచుకోకూడదు. ఒకరు వాడే కాస్మటిక్ బ్రష్ లు, స్పాంజ్ లు ద్వారా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. మేకప్ వేసుకోబోయే ముందు చేతులను శుభ్రం చేసుకుంటే ఈ సమస్య అంతగా ఉండదు. ఇక బాడీ స్ప్రే రూపంలో లభ్యమయ్యే సౌందర్య పాధనాలు సాధారణంగా ఆల్కాహాలిక్ సంబంధిత పదార్థాలతో తయారవుతుంటాయి కాబట్టి మంట, నిప్పు వంటివి సమీపంలో ఉన్నప్పుడు వాడకూడదు. అలాగే సూక్ష్మమైన తుంపరరూపంలో వెదజల్లబడతాయి. కాబట్టి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆరోగ్యసమస్యలను కలిగించే అవకాశం ఉంది.
ముఖ్యంగా సౌందర్య ఉప్పత్తులను వాడిన వెంటనే మూతను పెట్టేయాలి. మూతలు లేని కాస్మటిక్స్ మీద ఫంగస్ పెరిగే అవకాశం ఉంది. షాపుకి వెళ్లినప్పుడు ఒకవేళ ఏదైనా మేకప్ ను శ్యాంపిల్ చూడదలచుకుంటే షాపతాన్ని ఆల్కహాల్ తో మూతలు వగైరా శుభ్రపరిచమని చెప్పాలి. మేకప్ సామాగ్రి ఎండకి, వేడికి దూరంగా ఉంచడమే మంచిదే.



Click it and Unblock the Notifications