Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మహిళల మనసు దోచే చీరలు...ఎంపిక ఎలా

టీనేజ్ అమ్మాయిలకు ఎక్కువగా చుడీదార్, జీన్స్, టీ షర్ట్స్, గాగ్రాలు, సెలెక్ట్ చేయడమే అలవాటు. వాటిని చిటికెలో సెలెక్ట్ చేసుకుంటారు. నచ్చినట్టుగా కుట్టించుకుంటారు. కానీ వీరికి అప్పుడప్పుడూ చీర కట్టుకోవాలనుటుంది. అంతవరకూ బాగానే ఉంది కానీ వీరికి ఎలాంటి చీర సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. కానీ స్వయంగా చీర కొనుక్కోవడంలో ఓ థ్రిల్ ఉంటుంది. వీరికి చీర గురించే కాదు వాటి ఖరీదు, మన్నిక గురించి సందేహాలుూ ఎక్కువగా ఉంటాయి. మరి మొదటిసారి చీర కొంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకుందాం...
1. ముఖ్యంగా మీరు ఉన్న రంగును బట్టి చీరను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రంగు మీ ఒంటి రంగుకు సరిపోతుందో లేదో చూసుకోవాలి.
2. డిజైన్ త్వరగా అవుట్ డేట్ అయ్యే ప్రమాదం ఉందేమో అని గమనించాలి.
3. కొన్ని డిజైన్ లు ట్రెండ్ మారినా తర్వాత ధరిస్తే నప్పవు. ముఖ్యంగా రెయిన్ బో చీరలవంటివి.
4. ఒక చీరకు రెండు, మూడు రంగుల వెరైటీ బ్లవుజ్ లు కుదిరే మోడల్ ఎంచుకుంటే మల్టీపర్పస్ గా పనిచేస్తుంది.
5. ప్రస్తుత కాలంలో ఒకే చీరకు రెండు పల్లులు కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయి. ఒక పల్లు సింపుల్ గాను, మరొకటి రిచ్ గానూ ఉండేలా తీసుకుంటే క్యాజువల్, పార్టీవేర్ గా ఉపయోగపడుతుంది.
6. ఒక బ్లవుజ్ కి డిజైన్ కు నప్పే విధంగా ఏడు ఎనిమిది రంగుల పూసలు, చమ్కీలు, సిల్క్ దారాలతో రిచ్ ఎంబ్రాయిడరీ చేస్తే పార్టీలో అందరి కన్నుమీమీదే. ఇందులో మరో ట్రిక్ కూడా ఉంది. డిజైన్ లో ఉన్న రంగుల ప్లెయిన్ సింపుల్ చీరలన్నింటికీ ఈ బ్లవుజ్ ధరించవచ్చు. ఒక్కో రంగు చీరతో ఒక్కో ఫంక్షన్ కి రెడీ అవ్వొచ్చు.
7. చీరకు తగ్గ ఆభరణాల జాబితాలో బంగారు, వెండిని పక్కకు పెడుతూ ప్లాటినం మార్కెట్ లోకి వచ్చింది. బంగారు కంటే మూడు రెంట్లు విలువ వున్న ప్లాటినం మార్కెట్ లో నిలదొక్కుకోలేకపోయింది. ధర ఎక్కువ కావడమే ఇందుకు కారణం అనుకుంటే పొరపాటే. వజ్రాలు, కెంపులు, మరకతాలు, నీలాలు,... ఇలా జాతి రాళ్లు పొదిగిన ఆభరణాలంటే మనకు క్రేజ్. అయితే ప్లాటినంలో కెంపులు, పచ్చలు వంటి రాళ్లు పొదిగితే ఆకర్షనీయంగా కనిపించకపోవడమే కారణం.
8. మనస్తత్వానికి అద్దం మీ డ్రెస్సే మీ వస్త్రాధారణతో మీ అభిరుచిని ఇట్టే చెప్పేయవచ్చంటారు డ్రెస్ డిజైనర్ లు. శరీరాన్ని దాచి, మనిషిని ష్యాషన్ గా చూపించడం వంటి పైకి కనిపించే పనులే కాకుండా మనిషిలో అంతర్లీనంగా దాగిన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. డ్రెస్ ను బట్టి వారి మనస్తత్వాన్ని విశ్లేషించడం సాధ్యమే. కాబట్టి ఫర్ ఫెక్ట్ గా తయారవ్వడం కూడా అవసరమే....



Click it and Unblock the Notifications
