Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పెళ్లి కూతురి ముస్తాబుకు మరింత అందం...

దానికి తగ్గట్టు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఎక్కడ చూసినా షాపింగ్ హడావుడి. కళ్లు చెదిరే డిజైన్లు, వెరైటీలు పెళ్లివారిని ఆకర్షిస్తున్నాయి. పెళ్లి అనగానే పట్టుచీరలు అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సిల్క్ శారీస్‌తో పాటు ఫ్యాన్సీ చీరలు కూడా పెళ్లివేడుకల్లో భాగం అయిపోయాయి. మేలిమి వస్ర్తాలపై మిరుమిట్లు గొలిపే ఎంబ్రాయిడరీ వర్క్స్‌తో వస్తున్న ఈ డిజైనర్ శారీస్ పట్టు చీరలకు గట్టి పోటీని ఇస్తున్నాయి.
పెళ్ళి సందర్భంగా కట్టుకునే చీర కూడా ఇప్పుడు కొత్త అందాన్ని సంతరించుకొని మరింత అందంగా ముస్తాబవుతోంది. వెడ్డింగ్ కలెక్షన్ పేరుతో లభ్యమవుతోన్న ఈ చీరలు సంప్రదాయాన్ని అనుసరిస్తూనే మరిన్ని హంగులతో మగువల మనసులను దోచేస్తున్నాయి. ప్రెషస్, సెమీ ప్రెషస్ స్టోన్స్ ఉపయోగించి చేసిన థ్రెడ్, జర్దోసీ, గోటా, కుందన్, సీక్వెన్స్... ఎంబ్రాయిడరీలతో మెరుస్తున్న షిఫాన్, క్రేప్, జార్జెట్, నెట్టెడ్ చీరలు ఇప్పుడు పెళ్లికూతుళ్ల వెడ్డింగ్ ట్రొస్సో(సారె)లో భాగం అవుతున్నాయి. పెళ్లి కూతురి ముస్తాబుకు మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి.
ప్రెషస్, సెమి ప్రేషియస్ స్టోన్స్:ప్రెషస్ స్టోన్స్ అంటే నవరత్నాలు. వీటిని ఉపయోగించి చీరపై ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే ఆ చీర అందం ద్విగుణీకృతం అవుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సెమీ ప్రెషస్ స్టోన్స్ అంటే నవరత్నాలలో నాణ్యత కొంత తక్కువ ఉన్నవి. ఇవి వాడి ఎంబ్రాయిడరీ చేసిన చీరల ఖరీదు కొంత తక్కువైనా ఎంతో గ్రాండ్ లుక్‌ని ఇస్తాయి.
పెళ్లి సందర్భంగా ధరించే దుస్తులు నగలు... మేకప్, హెయిర్ స్టైల్ తో పెళ్లికి ముందు ట్రయల్ చేసుకుంటే బెటర్. ఇలా చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నోసార్లు సరిగ్గా ముహూర్తానికి టైం అవుతోందంటే పిన్నులు దొరక్కపోవటమో, సవరం ఊడిపోవటమో, మేకప్ కుదరకపోవటమో...ఇలా ఎన్నో చిక్కులు ఎదుర్కొంటారు వధువులు. అలా కాకుండా ఉండాలంటే కంప్లీట్ వెడ్దింగ్ గెటప్‌తో ట్రయల్ రన్ చేసుకుంటే ఆ రోజు సాఫీగా ఎటువంటి హడావుడి లేకుండా ముస్తాబు అవ్వవచ్చు.



Click it and Unblock the Notifications
