Latest Updates
-
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.!
పొట్టను దాచేసి... స్లిమ్ గా కనబడండిలా....!?

సన్నగా నాజూగ్గా ఉండాలని అమ్మాయిలూ, సిక్స్ ప్యాక్ లతో హుందాగా కనిపించాలని అబ్బాయిలూ ఆశపడటం సహజమే. కానీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో 95 శాతం మంది తమ శరీరాకృతి పట్ల అసంతృప్తితో ఉన్నారని తేలింది. ఈ అసంతృప్తి నుంచి బయటపడేసే ఆధునిక పరిజ్ఞానమే కాస్మెటాలజీ. పొట్ట లేదా నడుము దగ్గర పేరుకుపోయిన కొవ్వును తీసివేసే ప్లాస్టిక్ సర్జరీతో అందమైన శరీరాకృతి ఇప్పుడు సాధ్యమే. చర్మం సాగడం వల్లగానీ, కొవ్వు పేరుకోవడం వల్ల అయినా, కండరాలు బలహీనం కావడం, ఎముకలు పెరగడం వల్ల అయినా పొట్ట పెరిగితే అబ్డామినోప్లాస్టీ ద్వారా సరిచేయడం సాధ్యపడుతుంది. అయితే ఎంతకీ పొట్ట తగ్గించుకోకుండా టైమ్ లేదనో మరేదైన కారణం చేతనో చాలా మంది పొట్ట విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదెలాగైతేనేం అలాంటి వారికోసం పొట్ట కనబడకుండా కొన్ని చిట్కాలు..
సాదారణ లేదా సాదా దుస్తులతో పొట్టను దాచి పెట్టకోవడమనే చాలా కష్టమైన పనే. ఎందుకంటే సాదరణ దుస్తులు పొడవు, వెడల్పులలో చాలా వ్యత్యాసం కలిగి ఉంటాయి. కాబట్టి పొట్ట దాచుకోవడానికి, స్టైల్ గా కనబడటానికి కొన్ని చేయవలసిన, చేయకూడాని చిట్కాలు మీకోసం...
ముదురు రంగు దుస్తులను ధరించడం: ముదురు రంగులను ధరించడం వల్ల చూడటానికి అందంగా కనబడుతారు. పొట్ట ప్రదేశం కూడా అంతగా కనబడకుండా కనిపెట్టని విధంగా చేస్తాయి. ముదురు రంగు దుస్తులు ధరించడం వల్ల ఆ ముదురు రంగులో పెద్దగా తేడా లేకుండా సాదారణంగా కనబడుతారు. అదే లైట్ కలర్ రంగుల దుస్తులను ధరించినప్పుడు పొట్ట మరింత ఎక్కువగా కనబడేలా చేస్తాయి ఎందుకంటే లైట్ కలర్ దుస్తులు కాస్త పలుచగా ఉంటూ పొట్టను స్పష్టంగా కనబడేలా చేస్తుంది. కాబట్టి పొట్టను దాచాలనుకొనే వారు ముదురు రంగు దుస్తులకే ప్రాధాన్యత నివ్వండి.
బిగుతుగా ఉండే టీ షర్ట్స్: పొట్ట మరింత పెద్దదిగా లేదా పొట్ట పెరిగిందని ఇతరులు గమనించే విధంగా ఎత్తి చూపే వస్త్రాలు టీ షర్ట్స్. పొట్ట ఎంత పరిమాణంలో పెరిగింది. పై పొట్ట, క్రింది పొట్ట అని ప్రతి పోర్షన్ ను టీషర్ట్స్ ఎత్తి చూపెడుతాయి. టీషర్ట్స్ శరీరానికి టైట్ గా అతిక్కపోయి ఉండటం వల్ల పొట్ట పరిమాణం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి చిరు బొజ్జ వున్నవారు కూడా టీ షర్ట్స్ కు దూరంగా ఉండటమే మంచిది. సాదారణ సందర్భాలు స్లీవ్స్ ఉన్న చొక్కాలను ధరించండి. లేదంటే టీషర్ట్స్ వేసుకోవడానికి ఏదైనా పర్టీక్యులర్ సందర్భంలో (జిమ్ కు, వ్యాయామానికి, రన్నింగ్, వాకింగ్, ఎక్సర్ సైజ్)మీ శరీరానికి తగినటువంటి వందశాతం కాటన్ దుస్తులు, కాస్త వదులుగా ఉన్నదుస్తులు ధరించడం ఉత్తమం.
నిలువు గీతలున్న వాటికి ప్రాధాన్యత: నిలువుగీతలున్న దుస్తులను ధరించడం వల్ల ఆదుస్తుల మీద పొట్ట అంతగా అగుపించదు. నిలువుగీతల ఉండటం వల్ల ప్రతి లైన్ కి-లైన్ కి మధ్య న్యారో గ్యాప్ మాత్రమే ఉంటుంది కాబట్టి పొట్ట కనబడనీయకుండా చేస్తుంది. నిలువు గీతల దుస్తులను ఎంపిక చేసుకొనేటప్పుడు షర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ కలర్ ముదురు రంగువై(బ్లాక్ లేదా డార్క్ గ్రే)ఉండేలా చూసి మరీ ఎంపిక చేసుకోవాలి.
బిగుతైన బిజినెస్ షర్ట్స్ కు దూరంగా: పురుషులకు సంబందించిన బిజెనెస్ షర్ట్స్ సాంప్రదాయ పద్దతిలో సాదారణ కొలతలో ఫిట్ గా ఉండేలా ఉంటాయి. దాని వల్ల పొట్ట మరింత ఎక్స్ పోజ్ అయ్యే విధంగా కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications