Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ కోసం ఎప్పుడెప్పుడా అన్న ఎదురుచూపులే !

1. ఏ ఫక్షన్ కైనా వెళ్లేటప్పుడు ఆ ఫంక్షన్ లో మీరు ఎంత సేపు ఉండాల్సి వస్తుంది. మీరు వెళుతున్నది ఎలాంటి ఫంక్షన్ అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఎక్కువ సేపు ఉండాల్సిన ఫంక్షన్ అయితే స్పేర్ గా మరో జత బట్టలు పెట్టుకోవాలి. రోజంతా అదే డ్రెస్ తో ఉండే కంటే కాస్త సేదతీరి, డ్రెస్ మార్చుకుంటే ఫ్రెష్ గా కనిపిస్తారు.
2. ఫంక్షన్ లో మీ ఇంట్లో వాళ్లనే అంటిపెట్టుకొని ఉండకుండా కొత్తవారితో పరిచయాలు పెంచుకోండి. బంధుమిత్రులందరినీ ఆప్యాయంగా పలకరించండి. పరిచయాలు పెంచుకొనేందుకు, ఉన్న పరిచయాలను పటిష్టం చేసుకొనేందుకు అదో మంచి అవకాశం అని గ్రహించండి.
3. ఫంక్షన్లో అవసరమైన చోట చొరవ చూపండి. అనవసరంగా ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల మీ గౌరవం పెరగక పోగా తగ్గుతుందని గ్రహించండి.
4. ఫంక్షన్ కు వెళ్లి మొక్కుబడిగా కొద్దిపేపు ఉండి వెళ్లిపోతారు కొందరు. ఆలా కాకుండా వేడుకలో ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని పిలిచిన వారికి, మీకూ సంతోషం మిగులుతుంది.
5. మీరు ఎంపిక చేసే బహుమతి వారు ఉపయోగించుకొనేదిగా ఉండేలా చూసుకోండి. ధర ఎక్కువా.. తక్కువా అని కాకుండా ఉపయోగం ఎంత అనే విషయాన్ని గమనించండి.
6. ఫంక్షన్లలో చాలా మంది కుటుంబ పెద్దలు కలుస్తారు. చాలామందిసీనియర్లు ఫంక్షన్లలలో మాత్రమే కలుస్తారు కాబట్టి వాళ్ల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా పలకరించండి.



Click it and Unblock the Notifications