Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మేకప్ తీసే మెళుకువులు....

రాత్రి పడుకునే ముందు ముఖానికి వేసుకున్న మేకప్‌ను తప్పనిసరిగా తీసేయాలి. మేకప్ తీసివేయటానికి సబ్బు వాడకుండా క్లెన్జింగ్ మిల్క్ రాసుకుని, తరువాత సున్నితంగా మేకప్ తీసేసి, ముఖాన్ని వేడినీటితో కడుక్కుని, మాయిశ్చరైజర్ క్రీమ్‌గానీ, లోషన్ గానీ రాసుకోవాలి. అలా కాకుండా సబ్బు వాడటంవల్ల మేకప్ పూర్తిగా పోదుకదా, సబ్బు ప్రభావం చర్మంమీద పూర్తిగా పడుతుంది. ముఖాన్ని సబ్బుతో అదేపనిగా రుద్దటంవల్ల ముఖ చర్మం ఎండిపోయి ర్యాషెస్ (దద్దుర్లు) రావటం, ఇంకా పిగ్మెంటేషన్ సమస్యలు వచ్చే అవకాశం వుంది.
మస్కారా, ఆయిల్‌తో కూడిన మేకప్, తొలగించలేని మరకలు, లిప్‌స్టిక్, బుగ్గల, పెదవుల మేకప్, వీటన్నింటిని ఒక్క ఫేస్‌వాష్‌తో తొలగించలేం. కానీ సగం సగం మేకప్‌ని అలానే ముఖంపై ఉంచేస్తే ఎక్నే, మొటిమల సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు ఆడవారు మేకప్ తీసివేయటం కోసం క్లెన్జింగ్‌ను వాడతారు. అలా కాకుండా మేకప్ చేసుకున్నా, చేసుకోకపోయినా, నిత్యం రాత్రి పడుకునేముందు ముఖాన్ని క్లెన్జర్‌తో శుభ్రం చేసుకోవటం ఒక అలవాటుగా చేసుకోవాలి.
ముందుగా ముఖంపై పున్న మేకప్ ని రోజ్‌వాటర్ లో ముంచిన దూదితో శుభ్రం చేయాలి. సబ్బుతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. పొడి టవల్‌తో తుడుచుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలాగే బయటికి వెళ్లేప్పుడు వుపయోగించే సన్‌స్ర్కీన్ లోషన్ వంటి వాటి వల్ల ముఖంపై మురికి పేరుకునే అవకాశం వుంటుంది. దీని కోసం వారానికి ఒకసారి ఆవిరిపెట్టుకోవడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో పేరుకుపోయిన మురికి తోలగి పోతుంది. శుభ్రంగా వుంటుంది.
బిఫేస్- మేకప్ రిమూవర్: ఈ రిమూవర్స్ నీళ్లతో కలిసి ఉంటాయి. ఈ రిమూవర్ బాటిల్‌ని ఓపెన్, క్లోజ్ చేయడానికి సౌకర్యవతంగా ఉంటుంది. వాడే ముందు వీటిని బాగా షేక్ చేసి ఆ జెల్‌ని కాటన్‌మీదకు తీసుకోవాలి. కాటన్ సహాయంతో ఈ జెల్‌ని ముఖానికంతా పట్టించి, తిరిగి పొడిగా ఉన్న కాటన్ బాల్‌ని తీసుకొని మేకప్‌ని పూర్తిగా తొలగించుకోవచ్చు.
మేకప్ వైప్స్: దీనికి కాటన్‌ని, క్లాత్‌ని వాడాల్సిన అవసరం లేదు. దీనిని ముఖంమీద అప్లై చేసి ఏదు నిమిషాల సేపు అలాగే ఉంచి నీటితో కడిగేస్తే చాలు. అంతా క్లియరవుతుంది. ఇది ఎక్కువగా లోరియర్ ప్రాడెక్టులో లభిస్తుంది.
రిమూవర్ అండ్ ఫేస్‌వాష్: దీనిని ఫేస్‌వాష్‌లాగే వాడుకోవచ్చు. ఇది మేకప్‌ని తొలగించడమే కాకుండా చర్మాన్ని సున్నితంగా చేస్తుంది. దీంట్లో అధిక నరుగనిచ్చే కారకాలు ఉంటాయి కాబట్టి మేకప్‌ని తేలికగా తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications