Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అలంకరణే కాదు హానీ కూడా కలిగించే ఆభరణాలు
టీనేజ్ అమ్మాయిలు, మహిళలు అలలై ఎగసే సొగసుకి..అందమైన చెవిరింగులే అసలు సిసలు చిరునామా అంటారు సౌందర్య ఆరాధకులు. అవును మరి.. విందు, వినోదం వేడకేదయినా అలంకరణకి ఆకట్టుకొనే చెవి పోగులతోనే నిండుదనం. వాటి తర్వాతే తక్కిన ఆభరణాల స్థానం. ప్రస్తుతం అనుకరిస్తున్న సొగసుని బట్టి పెద్దపెద్ద చెవి రింగులే అటు బాలీవుడ్ ని, ఇటు హాలివుడ్ ని ఏలేస్తున్నాయ్..! అవే కాలేజ్ అమ్మాయిల మనసునీ దోచుకొంటున్నాయి. ముఖ్యంగా హోప్స్.... అంటే గుండ్రంగా ఉండే రింగులు ఎప్పటికీ వన్నెతరగనివే, అందుకేగా అవి అటు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికలపై హల్లే బెర్రీ ఏంజెలీనా జోలీల హాట్ ఫేవరెట్ గా నిలిచాలి.

ఇక్కడ కాలేజ్ అమ్మాయిల వార్డు రోబుల్లోనూ తళుక్కుమంటన్నాయి. మరి సాధావి ఏం ధరిస్తాం అనుకుంటే, అక్కడక్కడా వజ్రాలు, రోడియం రంగులు జతచేస్తే కర్ణాభరణాలిక కనువిందే! వీటితో పాటు ఆకట్టుకొనే షాండ్లియర్స్ కీ భలే గిరాకీ ఉంది. చీరలు, సాయంత్రం వేడుకల వేళ ధరించే గౌనులపై రాళ్లతో చేసిన షాండ్లియర్లని ధరిస్తున్నారు. అందాల ముద్దుగుమ్మలు మరింత అందంగా కనిపించేందుకు, ఆయా దుస్తులకు సరిపోయే రీతిలో డిజైన్ చేసిన అందమైన, పొడవైన చెవి రింగులను ధరించడం సహజమే. అయితే.. పొడవైన రింగులు ధరించటం వల్ల చెవులు దెబ్బతింటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మహిళలు ధరించే చెవి రింగులు, దిద్దులు లాంటి అలంకార సామగ్రి ఎనలేని అందాన్నిచ్చినా.... పొడవుగా, వేలాడుతూ ఉండే రింగుల వల్ల చెవులు ఇబ్బందుల్లో పడతాయని పరిశోధకులు అంటున్నారు. చాలామంది సెలెబ్రిటీలు కూడా పొడవాటి రింగులను ధరిస్తుంటారనీ, అయితే అవి చెవి తమ్మెలను నాశనం చేస్తాయని వారు వివరించారు.
ఈ విషయమై బ్రిటన్ లోని ప్లై మౌత్ కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ జేమ్స్ మెక్ డయార్మిడ్ మాట్లాడుతూ... పొడవాటి రింగులు ధరించటం వల్ల చెవుల రంధ్రాలు కిందకు సాగేలా చేస్తాయని, వీటి వల్ల గాయాలు కూడా అవుతాయని అన్నారు. కొన్ని కేసుల్లో చెవి తమ్మె రెండుగా చీలిపోయి కూడా ఉంటుందని ఆయన వివరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స కోసం తమ వద్దకు వచ్చిన రోగులకు మత్తుమందు ఇచ్చి చెవి తమ్మెను అతికించాల్సి ఉంటుందని టయార్మిడ్ పేర్కొన్నారు. మరికొన్ని కేసుల్లో చెవుల్లో, చెవి తమ్మెలపైన గోళీ సైజంత గడ్డలు కూడా ఏర్పడతాయని ఆయన వెల్లడించారు.
కాబట్టి, మహిళలూ... అందంగా కనిపించడమే కాదు.. మిమ్మల్ని అందంగా ఉండేలా చేసే చెవి దిద్దులు, రింగులు, కమ్మల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిందే. పైన చెప్పినట్లుగా పొడవాటి రింగుల వల్ల, కొన్ని రోజుల పాటు చెవులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండానే ఉండవచ్చుగానీ.. క్రమంగా చిన్నగా ఉండే చెవి తమ్మెలు పొడవాటి రింగుల బరువుకు చీలిపోయి, సర్జరీ దాకా మిమ్మల్ని తీసుకెళ్తాయి. కాబట్టి, చెవికి పెట్టుకొనే ఆభరణాల విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది.



Click it and Unblock the Notifications