Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పార్టీ...ఫంక్షన్...మేకప్ కి మెలకువులు...

అందంగా పుట్టడం, పెరగటం అనేది ఒర వరం. దాన్ని ద్విగుణీకతం చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. చక్కని ముస్తాబు, ఒద్దికైన డ్రెస్సింగ్, ఒంటికి కచ్చితంగా సూటయ్యే నగలతోపాటు మేకప్ లో మెలకువలు తెలుసుకుంటే ఎలాంటి ముగువైనా తనకున్న పార్టీలు పంక్షన్లలో అందంగా కనిపించవచ్చు. ముఖ్యంగా కాస్మోటక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే పార్టీలు.. ఫంక్షన్లలో మీరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతారు. అయితే ఎవరు ఎలాంటి రంగులు వాడాలో తెలుసుకోవాలి. మన చర్మం ఏ రంగులో ఉంటే ఆ రంగు ఉపయోగిస్తే మంచిది. అలాగే వాతావరణం బట్టి మేకప్ సరిగణలోనికి తీసుకోవాలి. వేసవిలో వాడే రంగులు శీతాకాలంలో..శీతాకాలంలో వాడే రంగులు వేసవిలోనూ అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. కనుక కాలాన్ని అనుసరించి, వారివారి వయస్సును బట్టి కూడా మేకప్ వేసుకోవాలి.
1. ఫంక్షన్లకు పార్టీలకు వెళ్లే ముందుగా ఫౌండేషన్ క్రీంను ముఖానికి అప్లై చేసుకోవాలి.
2. పై పూతగా క్రీమ్, పౌడర్లు, ఐలైనర్లు ఐబ్రో పెన్సిళ్ళుతో మెరుగులు దిద్దుకోవాలి. అలాగే మేకప్ కిట్ లో ముఖాన్ని శుభ్రపరచుకునే క్లీనర్లు ఉంచుకోవాలి. మాయిశ్చరైజర్ ద్వారా చర్మంపై తడిని తుడుచుకోవాలి.
3. ముఖానికి ఫౌండేఫన్ గా చర్మానికి నప్పే రంగును ఉపయోగించి పౌండేషన్ పూర్తయ్యాక ముఖానికి పౌడర్ రాయాలి.
4. లిప్ స్టిక్ తో పెదవులకు మెరుగులు దిద్దుకోవాలి. సాధారణంగా ముదురు రంగు కలర్స్ అందాన్ని రెట్టింపు చేస్తాయి. లిప్ స్టిక్ వేసే ముందు పెన్సిల్ తో పెదవులపై అవుట్ లైన్ గీసి తర్వాత నచ్చిన కలర్ అప్లై చేసుకవాలి. పెదవులు పలుచగా ఉంటే లిప్ గ్లాస్ ను ఉపయోగిస్తే సరిపోతుంది.
5. అందంగా ముస్తాబయ్యాక మన శరీరానికి నప్పే విధమైన దుస్తులను కట్టుకోవాలి.
6. తగిన రీతిలో హెయిర్ స్టైల్ ను అమర్చుకోవాలి.
7. వీటన్నింటికీ అనుగుణంగా ఆభరణాలను అలంకరించుకోవాలి.
8. అంతా అయ్యాక చక్కటి సెంటును ఒంటికి తగు మోదాదులో పూసుకోవాలి. అది ఆహ్లాదభరితంగా ఉంటే మనతోపాటు అతిథులకు కూడా బాగుంటుంది. ఈ విధంగా అందం పట్ల కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే నలుగురిలో మెసిలేటప్పుడు మనకే తెలియని శక్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అయి నలుగురిలో అందంగా, హుందాగా కనబడుతారు.



Click it and Unblock the Notifications