Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లేలేతగా కవ్వించే పెదాలకు లిప్ గ్లాస్...
అందం విషయంలో మేకప్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే మేకప్ కొంచెం ఇటు అటు అయిందంటే మొదటికే మేసం వస్తుంది. వికారంగా కనబడేలా చేస్తుంది. ముఖం ఆకర్షణీయంగా కనబడేందుకు మేకప్ ను తరచూ వేసుకొంటుంటారు. అందుకు ఫౌండేషన్ క్రీమ్, కన్సీలర్స్, కాంపాక్ట్, ఐషాడో, మస్కరా, ఔలైనర్, కాజల్, మరియు లిప్ గ్లాస్ వంటి బేసిక్ గా ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్. వీటిని సర్వ సాధరణంగా ప్రతి రోజూ రెగ్యులర్ గా ఉపయోగించేవే.అయితే వీటిలో మీరు కాటుక మరియు లిప్ గ్లాస్ అప్లై చేయాలంటే కొద్దిగా భయం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి అప్లై చేసిన తర్వాత అటు ఇటుగా అప్లై చేసినప్పుడు ఫర్ఫెక్ట్ షేప్ రాకుండా అందవిహీనంగా చేస్తుంది. కాబట్టి కళ్ళకు కాటును, పెదాలకు లిప్ గ్లాస్ ను వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అసలైన అందం మీ సొంతం అవుతుంది.
పెదాలకు రంగు ఇచ్చే సాధనం పేరే లిప్ గ్లాస్. ఇది పెదాలను కళకళలాడించడమే గాక మృదువుగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది. లిప్ స్టిక్ పై దీనిని వాడొచ్చు. లేకుంటే లేతగా కన్పించేందుకు దీనిని మాత్రమే వాడవచ్చు.
మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కలిగిన లిప్ గ్లాస్‌లు కూడా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. లిప్‌స్టిక్‌పై దీనిని వాడే సమయంలో గట్టిగా రుద్దకూడదు. లేకుంటే లిప్‌స్టిక్ అలాగే కారిపోతుంది.

1. తక్కువగా అప్లై చేయాలి: లిప్ గ్లాస్ అప్లై చేసే ముందు తక్కువగా అప్లై చేయాలి. తక్కువగా అప్లై చేసినప్పుడు పెదాలు తడిగా.. నిండుగా జ్యూసిగా కనబడుతాయి. లిప్ స్టిక్ అప్లై చేసిన తర్వాత మరింత అందంగా కనబడాలంటే, లిప్ స్టిక్ తర్వాత మినిమాల్ లిప్ గ్లాస్ అప్లై చేయాలి. లిప్ గ్లాస్ అప్లై చేసేటప్పుడు పెదవులకు చివరగా అప్లై చేయకూడదు. అలా చేయండం వల్ల పెదవుల క్రిందిగా లిప్ గ్లాస్ కారినట్లు కనబడుతూ అస్యహ్యంగా ఉంటుంది.
2. స్కిన్ ఫౌండేషన్: చర్మానికి ఫౌండేషన్ వేయడం వల్ల మేకప్ చాలా సేపు నిలిచి ఉండేట్లే చేస్తుంది. కాబట్టి లిప్ గ్లాస్ చెరిగిపోకుండా మొదట లిప్ లైనర్ అవుట్ లైన్ గీసుకొని ఆ తర్వాత లిప్ లైన్ దాటకుండా లిప్ గ్లాస్ అప్లై చేయాలి. మరొక విషయం ఏమిటంటే లిప్ గ్లాస్ అప్లై చేసే ముందు ఫౌండేషన్ ను పెదాలకు కూడా వేసుకోవచ్చు. ఫౌండేషన్ క్రీమ్ ను ఒకటి రెండు చుక్కలు చేతి వేళ్ళ మీద వేసుకొని పెదాలకు అప్లై చేయాలి.
3. పౌడర్: ఫౌడేషన్ క్రీమ్ అప్లై చేయనట్లయితే టాల్కమ్ పౌడర్ ను కూడా పెద్దాల మీద అప్లై చేసి, దాని మీదుగా లిప్ గ్లాస్ ను రాయొచ్చు. ఇది ఒక సులభమైన మేకప్ చిట్కాగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ఫార్ములా కళ్ళకు కు కూడా వర్తిస్తుంది. కళ్ళకు కాజల్ పెట్టుకొనేటప్పుడు కళ్ళ క్రిందుగా పౌడర్ ను అప్లై చేసి ఆ తర్వాత కాటుకను రాయడం వల్ల చెదిరిపోకుండా ఉంటుంది. పౌడర్ రాయడం వల్ల కాటుక కానీ, లిప్ గ్లాస్ కానీ చెదిరిపోకుండా ఉంటుంది.
4. లిప్ లైనర్: చాలా మంది మహిళలు లిప్ గ్లాస్ వేయడానికి, లిప్ లైనర్ అవసరం ఉండదు అనుకొంటారు. అయితే లిప్స్ షేప్స్ అందంగా కనబడాలన్నా, జ్యూసీగా ఆకర్షించాలన్నా లిప్ గ్లాస్ ముందు లిప్ లైనర్ ను ఉపయోగించాలి. దాంతో పెదాలు నిండుగా కనబడేలా చేస్తుంది. లిప్ గ్లాస్ చెరిగిపోకుండా చేస్తుంది. కాబట్టి మేకప్ టిప్స్ లో ఈ చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోవడంతో మరింత అందంగా... ఆకర్షణీయంగా కనబడతారు.



Click it and Unblock the Notifications