Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
మీరు ఫంక్షన్ కు వెళుతున్నారా..?అయితే మీరే యువరాణి

1. మేకప్ కిట్ సిద్ధం చేసుకునే ముందు క్యారెట్ రసం, పన్నీరు, చదనం పొడి అన్నీ సమపాళ్ళలో తీసుకొని బాగా కలిపి మూఖానికి రాసుకుని ఒక అరగంట తర్వాత చల్లటి నీళ్ళతోముఖాన్ని శుభ్రంచేసి మేకప్ వేసుకోండి. ఇలా చేయడంవల్ల మేకప్ ఎక్కువసేపు ఉండటమే కాకుండా మరింత అందాన్నిస్తుంది. మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది.
2. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు మేకప్ వేసుకునేటప్పుడు యాస్ట్రింజెంట్ లోషన్ వాడితే ఎక్కువసేపు మేకప్ అలాగే ఉండిపోతుంది. అందుకే యాస్ట్రింజెంట్ లోషన్ రాసుకున్న కొన్ని నిమిషాల తర్వాత ఫౌండేషన్ రాసుకోవాలి. ఆ తర్వాత ఐస్‌క్యూబ్‌ను శుభ్రమైన బట్టలో చుట్టి ముఖంపై కొన్ని సెకన్ల పాటు రుద్దుకోవాలి.
3. ముఖం, మెడపై పౌడర్ వేసుకొన్న తర్వాత నీటిలో ముంచి స్పాంజ్ తో అద్దాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ సేపు ముఖంపై నిలిచిపోతుంది. మేకప్ పూర్తయిన తర్వాత బ్లాటింగ్ పేపర్ తో ముఖాన్ని సున్నితంగా అద్దాలి. ఇలా చేస్తే మీరు వేసుకునే మేకప్ ఎక్కువ సేపు అలాగే ఉంటుంది.
4. కళ్లకు, పెదాలకు భారీ మేకప్ వేసుకోవడం బాగుండదు. కళ్లకు భారీగా మేకప్ వేసుకుంటే పెదాలకు లైట్ గా మేకప్ వెయ్యాలి. పెదాలకు భారీగా వేస్తే కళ్లకు లైట్‌గా వాడాలి. బయటకు వెళ్ళేముందు సన్ స్క్రీన్ ఉపయోగించాలి.
5. ఏ ఫక్షన్ కైనా వెళ్లేటప్పుడు ఆ ఫంక్షన్ లో మీరు ఎంత సేపు ఉండాల్సి వస్తుంది. మీరు వెళుతున్నది ఎలాంటి ఫంక్షన్ అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఎక్కువ సేపు ఉండాల్సిన ఫంక్షన్ అయితే స్పేర్ గా మరో జత బట్టలు పెట్టుకోవాలి. రోజంతా అదే డ్రెస్ తో ఉండే కంటే కాస్త సేదతీరి, డ్రెస్ మార్చుకుంటే ఫ్రెష్ గా కనిపిస్తారు.



Click it and Unblock the Notifications