Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ప్రేమికుల రోజు మరింత అందాన్ని పెంచే డ్రెస్సింగ్ టిప్స్

1. సహజంగా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే సల్వార్ కమీజ్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా, శారీ అయినా ఒకే హెయిర్ స్టైల్, ఒకే చెప్పులు, ఒకే బ్యాగ్ ... వాడుతుంటారు. సల్వార్ కమీజ్ అనుకోండి కోలాపురి, ఎంబ్రాయిడరీ ఉన్న చెప్పులు.. జూట్, ఎంబ్రాయిడరీ బ్యాగులు.. కుందన్, ఎనామిల్ జ్యుయలరీ వాడితే బాగుంటుంది.
2. ప్రతీ డ్రెస్‌కి యాక్సెసరీస్, జ్యూయలరీ, హెయిర్ స్టైల్స్ మారిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. జీన్స్ వేసుకున్నప్పుడు కర్లీ హెయిర్, పెద్ద వాచ్, చిన్న హ్యాంగింగ్స్, స్పోర్ట్ షూ, పంప్ షూ వేసుకుంటే బాగుంటుంది.
3. గౌన్లు వేసుకుంటే చెవులకు పెద్ద పెద్ద హ్యాంగిగ్స్, నాట్స్ ఉన్న హెయిర్ స్టైల్, స్ట్రాప్స్ ఉన్న పెన్సిల్ హీల్స్ వేసుకోవాలి. లెదర్, షిమ్మర్ మెటీరియల్ తో చేసిన పెద్ద హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవాలి. శారీ ధరిస్తే గోల్డ్, కాపర్, సిల్వర్ చెప్పులు అదీ స్టోన్స్ తో చేసిన ఎంబ్రాయిడరీ ఉన్నవి ధరించాలి. ఎంబ్రాయిడరీ ఉన్న క్లచెస్ పట్టుకోవాలి.
4. ఏ హెయిర్ స్టైల్ అయినా చీరకు నప్పుతుంది. ప్రతీ డ్రెస్ కి మేకప్ కూడా బాగుండాలి. ఐ షేడ్స్, లిపిస్టిక్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. గౌన్లు వేసుకుంటే గ్లిట్టర్ ఉన్న ఐ షేడ్స్, లిప్ స్టిక్ ఎంపికచేసుకోవాలి. వెస్ట్రన్ డ్రెసెస్ కి ముత్యాలు, బీడ్స్ బాగుంటాయి. ధరించే ప్రతి డ్రెస్ కు హెయిర్ స్టైల్, యాక్ససరీస్ మార్చుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు.



Click it and Unblock the Notifications