For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమికుల రోజు మరింత అందాన్ని పెంచే డ్రెస్సింగ్ టిప్స్

|

Romantic Dressing Tips
త్వరలో వాలెంటైన్ డే వచ్చేస్తోంది. ప్రేయసీ ప్రియులు తమ మనసులోని తీయని భావాలను ఇచ్చుపుచ్చుకొనేందుకు చక్కటి సమయం వాలెంటైన్స్ డే. మరి ఆరోజున ప్రత్యేకంగా కనబడటానికి సాధారణ దుస్తులైనా, ఒకే తరహా దుస్తులైనా మరికొంత అందంగా కనబడాలంటే చిన్న పాటి జాగ్రత్తలు అవసరమే...

1. సహజంగా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే సల్వార్ కమీజ్ వేసుకున్నా, జీన్స్ వేసుకున్నా, శారీ అయినా ఒకే హెయిర్ స్టైల్, ఒకే చెప్పులు, ఒకే బ్యాగ్ ... వాడుతుంటారు. సల్వార్ కమీజ్ అనుకోండి కోలాపురి, ఎంబ్రాయిడరీ ఉన్న చెప్పులు.. జూట్, ఎంబ్రాయిడరీ బ్యాగులు.. కుందన్, ఎనామిల్ జ్యుయలరీ వాడితే బాగుంటుంది.
2. ప్రతీ డ్రెస్‌కి యాక్సెసరీస్, జ్యూయలరీ, హెయిర్ స్టైల్స్ మారిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. జీన్స్ వేసుకున్నప్పుడు కర్లీ హెయిర్, పెద్ద వాచ్, చిన్న హ్యాంగింగ్స్, స్పోర్ట్‌ షూ, పంప్‌ షూ వేసుకుంటే బాగుంటుంది.
3. గౌన్లు వేసుకుంటే చెవులకు పెద్ద పెద్ద హ్యాంగిగ్స్, నాట్స్ ఉన్న హెయిర్‌ స్టైల్, స్ట్రాప్స్ ఉన్న పెన్సిల్ హీల్స్ వేసుకోవాలి. లెదర్, షిమ్మర్ మెటీరియల్‌ తో చేసిన పెద్ద హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవాలి. శారీ ధరిస్తే గోల్డ్, కాపర్, సిల్వర్ చెప్పులు అదీ స్టోన్స్‌ తో చేసిన ఎంబ్రాయిడరీ ఉన్నవి ధరించాలి. ఎంబ్రాయిడరీ ఉన్న క్లచెస్ పట్టుకోవాలి.
4. ఏ హెయిర్ స్టైల్ అయినా చీరకు నప్పుతుంది. ప్రతీ డ్రెస్‌ కి మేకప్ కూడా బాగుండాలి. ఐ షేడ్స్, లిపిస్టిక్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. గౌన్లు వేసుకుంటే గ్లిట్టర్ ఉన్న ఐ షేడ్స్, లిప్‌ స్టిక్ ఎంపికచేసుకోవాలి. వెస్ట్రన్ డ్రెసెస్‌ కి ముత్యాలు, బీడ్స్ బాగుంటాయి. ధరించే ప్రతి డ్రెస్‌ కు హెయిర్ స్టైల్, యాక్ససరీస్ మార్చుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు.

English summary

Romantic Dressing Tips for Valentine's Day... | ప్రేమికుల రోజు మరింత అందాన్ని పెంచే డ్రెస్సింగ్ టిప్స్

The dress code for valentine’s day have a great importance. People consider it as funny thing, but there are someone who are serious to that. Moreover, dress code shows you status of proposal.
Story first published:Tuesday, January 31, 2012, 17:24 [IST]
Desktop Bottom Promotion