Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిత్య నూతనంగా కనిపించే మేకప్ చిట్కాలు..!
ఏకాలంలోనైనా అందాన్ని మరింత ఇనుమడించాలనుకుంటే తేలికపాటి మేకప్ చాలా అవసరం. మేకప్ అంటే అద్దం ముందర గంటల తరబడీ కూర్చొని మేకప్ చేసుకోవడం కాదు... మీ శరీర ఛాయకు తగ్గటు మేకప్ సామాగ్రితో పాటు మేకప్ చేసుకొనే విధానంలో చాలా జాగ్రత్త వహించాలి. కళ్లకు, పెదాలకు భారీ మేకప్ వద్దు. మేఘాల చాటు చందమామలా కళ్లు వుండాలేగాని... నడినెత్తిన సూర్యుడిలా కాదు. పెదాలు లేత గులాబిలా వుండాలే గాని.. కలువ పువ్వుల్లా వుంటే ఎబ్బెట్టుగా వుంటుంది. కళ్లకు భారీగా మేకప్ వేసుకుంటె పెదాలకు లైట్‌గా మేకప్ వెయ్యాలి. పెదాలకు భారీగా వేస్తే కళ్లకు లైట్‌గా వాడాలి. లిప్‌బామ్స్ ఎక్కువ రేటుపెట్టి కొనడం దండగ. పగిలిన పెదాలకు లిప్ బామ్స్ బదులు వేజలైన్‌ను విస్తృతంగా వాడుకోవచ్చు. ఖరీదైన లిప్‌బామ్స్‌కు ఇది చౌక ప్రత్యామ్నాయం. ఇలాంటి సూచనలు పాటిస్తే మేకప్ కు తక్కువ సమయం పడుతుంది.

అందంగా కనిపించాలంటే చాలా సమయం, శ్రమ వెచ్చించాలనుకుంటారు. 'అంత టైమ్ మాకెక్కడిది అనుకుంటూ రొటీన్ పద్ధతిలో పది నిమిషాల్లో తయారైపోతుంటారు చాలామంది. ఆ పది నిమిషాలకు ఇంకో ఇరవై నిమిషాలు కేటాయిస్తే చాలు అరగంటలో 'నఖ శిఖ పర్యంతమూ అందంగా మారిపోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. యవ్వనాలు చిందే మొహం చర్మాన్ని చక్కగా శుభ్రం చేయటం ద్వారా చర్మ కణాలు బాగా శ్వాసించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందుకోసం లిక్విడ్ ని గానీ లేదా సబ్బులేని క్లెన్సర్‌ని గానీ వాడండి.
దీని వల్ల చర్మం మళ్ళీ తన సహజతత్వాన్ని సంతరించుకుంటుంది. మొహం మీద ఉన్న వివిధ మచ్చలు, టాన్ తొలగించేందుకు-రెండు టేబుల్ స్పూన్ల పరిమాణంలో- ఓట్‌మీల్, ఆల్మండ్ పౌడర్, కమలా పళ్ల రసం, క్యారట్ రసం (అన్నీ రెండు స్పూన్లే) ఇవన్నీ కలిపిన మిశ్రమాన్ని మొహానికి రాయాలి. అలాగే కళ్లకింద నల్లని వలయాలు పోగొట్టేందుకు-తురిమిన బంగాళదుంప నుంచి తీసిన రసం ఒక టేబుల్ స్పూను, అర స్పూను దోసకాయరసం తీసుకుని ఈ మిశ్రమంలో దూదిని ముంచి కళ్ళమీద ఉంచుకుని అయిదు నిమిషాలపాటు అలాగే ఉండి తరువాత చల్లని నీటితో మొహాన్ని పరిశుభ్రంగా కడిగేయండి.
ఇపుడు మొహానికి తగిన మాయిశ్చరైజర్, కళ్లకి పెన్సిల్‌తో అందంగా కాటుక దిద్ది, కంటి చుట్టూ మరింత అందాన్ని ఇచ్చేందుకు పాలెట్ పింక్‌ని అద్దండి. ఇపుడు పెదాలకు లిప్‌స్టిక్ వేయండి. ఇలా చేస్తే అరగంటలో నిత్యనూతన అందం తొణికిసలాడేలా మారిపోవటం సాధ్యమే.



Click it and Unblock the Notifications