Latest Updates
-
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి!
సమయాన్ని ఆదా చేసే మేకప్ సామాగ్రి...!
ప్రస్తుత కాలం మోడరన్ మేకప్ చాలా అభివృద్ధి చెందింది. మహిళలు తమ అందాన్ని ఎన్నో విధాలుగా మలుచుకుంటున్నారు. సహజంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునే విధంగా మేకప్ ను అభివృద్ధి పరిచారు. స్త్రీ యొక్క ముఖకవళికలను ఎన్నో రీతులలో మార్పులు చేయగలుగుతున్నారు. అసలు ఫేస్ మేకప్ పై అద్భుతమయిన ప్రయోగాలు చేసి పర్సనాలిటీనే పూర్తిగా మార్చి వేస్తున్నారు.

ఈ నాడు మేకప్ కళ ఎంత ఎదిగిపోయిందంటే ఆధునిక యుగ రీతులకనుగుణంగా కాలాన్ని బట్టి, వయస్సును బట్టి, వెళ్ళే అకేషన్ ని బట్టి అంతే వివాహానికి ఓ రకంగా , బర్త్ డే పార్టీకి మరో రకంగా , పిక్నిక్ కి మరో విధంగా, సాధారణ పార్టీలకో విధంగా, ఫంక్షన్ ను బట్టి తగిన మేకప్ చేసుకుంటున్నారు. దానికనువైన దుస్తులను ధరిస్తున్నారు. ఆభరణాలు కూడా తదనుగుణంగానే ధరిస్తున్నారు. మేకప్ లేకుండా ఈ ఆధునిక యుగంలో ఏ స్త్రీ బయటకు రావడం లేదు.
ఫంక్షన్స్ కి మాత్రమే కాదు మామూలుగా మార్కెట్టుకు కూరగాయలు, సరుకుల నిమిత్తం వెళ్ళినా స్త్రీలు మేకప్, మ్యాచింగ్ డ్రెస్ లేనిదే బయటికి అడుగు పెట్టరు. స్త్రీని చూస్తే కేశాలంకరణ నుంచి, పాదరక్షల వరకు, తిలకం, దుస్తులు, ఆభరణాలు అన్నీ ఒకే రంగులో మ్యాచ్ అవుతూ ఉండి తీరాల్సిందే. అయితే ఈ మేకప్ లకు చాలా టై తీసుకుంటుంది. ప్రస్తుత బిజీ జీవితంలో ఎక్కువగా పద్దతి ప్రకారం మేకప్ మెలుకవులును తెలుసుకొన్నట్లైతే టేమ్ సేవ్ తో పాటు అలంకరణ ఎక్కువ సేపు ఉండేట్లు చూసుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలంటే మేకప్ గురించి తెలుసుకోవాలి. మేకప్ సామాగ్రిని ఏవింధంగా వినియోగించాలో తెలుసుకోవాలి. అవి ఎంత సేపు వినియోగించాలో తెలుసుకోవాలి. ఈ మోడ్రన్ ప్రపంచంలో మోడ్రన్ కాస్మోటిక్స్ తో అత్యంత సులభంగా..వేగవంతంగా మేకప్ ను క్షణాల్లో వేసుకోవచ్చు.
మీరు అలంకరించుకునే అలంకరణ సామాగ్రిలో కొన్నింటిని మీదగ్గర ఉంచుకొన్నట్లేతే మేకప్ వేసుకోవడం తేలికవుతుంది. సమయాన్ని సేవ్ చేయవచ్చు. అదే ఎలాగంటే...?
ఐలైనర్ పెన్సిల్: కళ్లకు మేకప్ వేసుకునే సమయంలో ఐలైనర్ తప్పనిసరి. కళ్ల కింద నల్లని వలయాలుంటే ఐలైనర్ వాడకపోవడం మంచిది. బ్రష్ను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. అజాగ్రత్త చేస్తే చర్మానికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. కనుబొమ్మల్లో వెంట్రుకలు తక్కువగా వుంటే షేప్ చేసుకుని పెన్సిల్ తో గీసుకోవాలి. ఐలైనర్ లు బజారులో దొరుకుతాయి. వాటితో పాటు రంగులు కూడా ముదురు గోధుమ రంగు లేత గులాబీ రంగుల్లో ఉన్నవాటినే వాడాలి. ఐలైనర్ కి లిక్విడ్ ఐలైర్ చాలా మంచిది ఇది చూడటానికి బాగుంటుంది. బాగా కనిపిస్తుంది. మెరుగ్గాను కనిపిస్తుంది. అయితే ఐలైనర్ లిక్వ్డ్ వాడటానికి టై పడుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఐలైనర్ పెన్సిల్ ఉపయోగించడం మంచిది. దాంతో సమయాన్ని ఆదా చేయొచ్చు. హటాత్తుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు అతి త్వరగా మేకప్ చేసుకోవడానికి లిక్విడ్ ఐలైనర్ కంటే ఐలైనర్ పెన్సిలే బెటర్.
2. కన్సీలర్ : సాధారణంగా కళ్ల క్రింద నల్లటి వలయాలు కనిపించకుండా కల్సీలర్లు వాడుతారు. లేత బంగారు రంగు కన్సీలరయితే నల్లటివలయాల్ని బాగా కప్పేస్తుంది. లేతరంగు కన్సీలర్ వాడితే బాగుంటుంది. ఫౌండేషన్ వేసుకున్నా లేకపోయినా కన్సీలర్ వాడొచ్చు. చర్మం అంతా ఒకటే రకంగా కనిపించాలంటే, కన్సీలర్ రాయాలి. మూమూలు మిషన్‌లో లిక్విడ్ కన్సీలర్ నింపి వుంచుతారు. దాని సాయంతో కన్సీలర్ నింపి వుంచుతారు. దాని సాయంతో కన్సీలర్ రాసుకోవచ్చు. ఫౌండేషన్ వేసుకోవడానికి టైమ్ లేనప్పుడు సాధరణ మేకప్ తోటే కన్సీలర్ ను వేసుకోవచ్చు.
3. ఫౌండేషన్ -కన్సీలర్: అనేక సౌంరద్య సాధనాలు ఇప్పుడు మార్కెట్లో లభ్యమతున్నాయి. కొన్నింటిని మ్యాజింక్ ఫౌండేషన్లనుి మరికొన్నింటి ఫినిషింగ్ ఫౌండషన్లని కొత్త కొత్త బ్రాండ్లు లభ్యమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా స్వతహాగా వేసుకొనేటటువంటి మేకప్ సామాగ్రి. ఇది వేసుకోవడానికి ముఖం శుభ్రపరుచుకొని మీకు సూట్ అయ్యే విధంగా మేకప్ చేసుకోవాడమే. ఈ పౌడర్ పల్చగా ఉంటుంది. ఇది అన్ని స్కిన్‌టోన్‌లపై ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది.
4. లిప్ బామ్: మహిళలు సాధారణంగా తడిగా వుండాలని తమ పెదాలకు లిప్ గ్లాస్ లేదా లిప్ బామ్ వేస్తారు.కార్యాలయాలకు వెళ్లే మహిళలు మొహానికి మేకప్ వేసేందుకు మరిచిపోయినా, పెదవులకు మాత్రం మేకప్ వేయడానికి మరిచిపోవట్లేదు. ఇతరులను ఇట్టే ఆకట్టుకునే పెదవుల కోసం మహిళలు లిప్ బామ్, లిప్ స్టిక్స్ వంటివి ఉపయోగిస్తున్నారు.అలాగే లిప్‌స్టిక్స్‌కు తగిన రంగుకు తగ్గట్టు లిప్ లైనర్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా మాశ్చరైజర్ లేని లిప్ లైనర్‌లను పెదవులకు ఉపయోగించేటప్పుడు కాస్త క్రీమ్‌ను రాసుకోవడం మంచిది. లిప్ బామ్ ఖచ్చితంగా మేకప్ ఐటమే అని చేప్పకపోయినా మేకప్ ఐటమ్ లో ఒక బాగం అని చెప్పొచ్చు. అప్పటికప్పడు అందంగా తీర్చి దిద్దుకొని అందంగా కనిపించడానికి లిప్ బామ్ కూడా ఉపయోగపడుతుంది.
5. పౌడర్ బ్రెష్: అందాన్ని మరింత ఇనుమడించాలనుకుంటే తేలికపాటి మేకప్ చాలా అవసరం. మేకప్ వేసుకోవాలనుకునేవారు మీకు నప్పే ఫౌండేషన్ తీసుకొని, తాజాగా ఉన్న ముఖం, మెడ మీద తేలిగ్గా రాయండి. కాంపాక్ట్ పౌడర్‌గానీ, ట్రాన్స్‌ల్యూసెంట్ పౌడర్ గానీ పఫ్‌తో ముఖానికి, మెడకు రాయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ షైనింగ్ పౌడర్‌గానీ, గ్లిట్టర్స్‌ను గానీ ముఖ్యంగా పగటి పూట వాడకండి. కాస్మొటిక్స్ బాక్స్ల్లో తప్పనిసరిగా పౌడర్ బ్రష్ లు వస్తాయి. వాటిని ఉపయోగించకుండా విడిగా కొంచెం పెద్ద సైజులు లభించేటటువంటి పౌడర్ బ్రష్ లను ఉపయోగించడమే మేలైన పద్దతి. దాంతో ముఖంలో చిన్న ప్రదేశాన్ని కాకుండా ముఖంపై పెద్దగా ఆక్రమించే పౌడర్ బ్రష్ లతో టైమ్ సేవ్ అవుతుంది.



Click it and Unblock the Notifications