Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అలంకరణలో ముత్యాలు శోభాయమానంగా...

మీరు హుందాగా ఉండే నగలు ధరిస్తేనే చక్కగా కనిపిస్తారు... అందుకే ఏ దండ(చైన్) కైనా లాకెట్ పెద్దగా ఉండేలా చూసుకోవాలి. పూల తీగ మాదిరి బంగారంతో రూపొందించి పైన వజ్రాలు మేళవిస్తే ధవళ వర్ణంలో కంఠహారం ధగధగలాడిపోతుంది. ఇరువైపులా వజ్రాలతో డిజైన్ చేసి హుక్కులు పెట్టుకొంటే సాధారణ గొలుసు లేదా ఇతర ఆభరణాలకు అమర్చుకోవచ్చు. కంఠహారం మధ్యలో కోలాకృతిలో అడుగు భాగంలో బిందువు మాదిరి ఉండే పచ్చను ఏర్పాటు చేసుకొంటే ఆభరణం పూర్తయినట్టే దీనితోపాటు ఉండే సాధారణ గొలుసును విడిగా ధరించేలా బంగారు రింగులు చేయించుకొంటే సరిపోతుంది.
చేవులకు పెట్టుకొనే జుంకాలు కొంచెం వైవిధ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. స్టడ్స్ అడుగున వేలాడదీసిన విలువైన రాళ్ల ఉన్నటువంటి జూకాలను ఎంపిక చేసుకోవాలి. ఇలాంటివి వస్త్రాధారణకు తగ్గట్టు వాటిని మార్చుకొంటే మరింత అందంగా కనిపిస్తాయి.
ఇక మీదగ్గర ముత్యాలకు సంబంధించినవి ఉన్నట్లైతే పాల నురగలాంటి రంగుతో కనువిందు చేసే ముత్యాలు సహజ మెరుపు కోల్పోకుండా ఉండాలంటే, భద్రపరుచుకోవడంతో పాటు శుభ్రపరుచుకోవడంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి.
ముత్యాలు అన్ని వేడకల సమయంలో ధరించేందుకు అనువైనవి. అయితే వీటిని ధరించడానికన్నా ముంచే అలంకరణ మొత్తం పూర్తి చేసుకోవాలి. లేదంటే మోముకు రాసుకునే క్రీములు. పరిమళ ద్రవ్యాల్లోని రసాయనాల ప్రభావంతో ముత్యాలు వాటి రంగు కోల్పోతాయి. వాడకం పూర్తయ్యాక మెత్తని తడి వస్త్రంతో తుడిచి. ఆ తర్వాతనే లోపల దాచాలి. మళ్లీ వాడే ముందు సిల్క్ వస్త్రంతో పాలిష్ చేస్తే కాంతివంతంగా ఉంటాయి. వాటిని శుభ్రం చేసేటప్పుడు క్లోరిన్ కలిపిన నీటిని వాడకూడదు. వీటిని వెల్వెట్ వస్త్రంతో తయారు చేసిన ప్రత్యేకమైన పెట్టిలో ఉంచితే మేలు. అధిక వేడి తగిలితే, ముత్యం రంగు వెలిసిపోతుంది. వేడిని ఉత్పత్తి చేసే మైక్రోఓవెన్, టీవి వంటి వాటికి దూరంగా ఉంచాలి.



Click it and Unblock the Notifications