Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవిలో శరీరానికి హాయిని..చల్లదనానిచ్చే కాటన్ చీరలు....

వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ వంటికి హాయిని కలిగించేవి కాటన్ దుస్తులు. ఆ మాటకొస్తే ఏడాది పొడవునా కాటన్ దుస్తులు ధరించడానికి అనువుగానే ఉంటుంది. మన దక్షిణ భారతంలో వాతావరణం మిగతా కాలాల్లో ఎలా ఉన్నా వేసవి నాలుగు నెలలూ కాటన్ దుస్తులు మాత్రమే వాడటం మంచిది. ఎండవల్ల కలిగే ఉక్క పోతని, చెమటవల్ల వచ్చే చికాకుని తప్పించు కోవటానికి కాటన్ దుస్తులని ధరించడం తప్పనిసరి. వేసవి కాటన్ చీరలకే కాదు డిజైన్ చీరలకు కూడా సరైన సమయం.
వేసవిలో కాలం, చెమట, విసుగు ఇవన్నీ ఒక భాగం అయితే పెళ్లిళ్లలో అందంగాకనబడటం చాలాకష్టం. అందుకు అమ్మాయిలు పడే కష్టం అంతా ఇంతా కాదు. సరైన చీరలను ఎంపిక చేసుకోవాలి. చీరలకు తగిన విధంగా బ్లైజులు సెట్ అవ్వాలి. అన్నీ ఉండి వాటిపైకి మ్యాచింగ్ ఆభరణాలు లేకపోతే అదో ఇబ్బంది. మామూలు బర్త్ డేలు, ఫంక్షన్లు, పార్టీలకు వెళ్ళేటప్పుడు క్రేప్ చీరలు బాగుంటాయి. రిచ్ గా కనిపిస్తాయి కూడా. బయట జరిగే ఫంక్షన్లలో అయితే సింగిల్ పల్లు ఉండి కొంగు కాస్త షార్ట్ గా ఉండేవి యువతులకు నప్పుతాయి. అదే గ్రాండ్ గా ఉండాలనుకుంటే షార్ట్ స్టెప్స్ తో చీరకట్టు అందరర్నీ ఆకట్టుకకుంటుంది.
జ్యువెలరీ విషయంలో పొట్టిగా ఉండే మహిళలు షార్ట్ ఇయర్ రింగ్స్, లాంగ్ చెయిన్ వేసుకొంటే బాగుంటుంది. పొడుగ్గా వుండే వారు లాంగ్ ఇయర్ రింగ్, షార్ట్ చెయిన్స్ వేసుకోవాలి. మేకప్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం వేళల్లో కాస్త లైట్ గా టచప్ చేసుకుని వెళితే బాగుంటుంది. అదికూడా కాలానికి అనుగుణంగా ఓవర్ మేకప్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.



Click it and Unblock the Notifications