For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో శరీరానికి హాయిని..చల్లదనానిచ్చే కాటన్ చీరలు....

|

Asin
వేసవికాలం కదా అని అస్తమానం ఇంటికే పరిమితం కాలేం కదా! ముఖ్యంగా ఉద్యోగినులకు ఇది అసాధ్యం. అందుకే ఎండలో బయటికెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో వెళ్ళడం తప్పదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా స్కార్ఫ్ ను కానీ, గొడుగు కానీ ఉపయోగించాలి. సన్ స్ర్కీన్ తప్పక వాడాలి. సమ్మర్ మేకప్ ఎంతో సింపుల్ గా ఉండాలి. లేత రంగు లిప్ స్టిక్ ఎంచుకోవాలి. వేసవిలో చర్మ సంరక్షణ, కేశ సంరక్షణతో పాటు ధరించే దుస్తులు ఎంపికలో కూడా జాగ్రత్త తీసుకోవాలి.

వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ వంటికి హాయిని కలిగించేవి కాటన్‌ దుస్తులు. ఆ మాటకొస్తే ఏడాది పొడవునా కాటన్‌ దుస్తులు ధరించడానికి అనువుగానే ఉంటుంది. మన దక్షిణ భారతంలో వాతావరణం మిగతా కాలాల్లో ఎలా ఉన్నా వేసవి నాలుగు నెలలూ కాటన్‌ దుస్తులు మాత్రమే వాడటం మంచిది. ఎండవల్ల కలిగే ఉక్క పోతని, చెమటవల్ల వచ్చే చికాకుని తప్పించు కోవటానికి కాటన్‌ దుస్తులని ధరించడం తప్పనిసరి. వేసవి కాటన్ చీరలకే కాదు డిజైన్ చీరలకు కూడా సరైన సమయం.

వేసవిలో కాలం, చెమట, విసుగు ఇవన్నీ ఒక భాగం అయితే పెళ్లిళ్లలో అందంగాకనబడటం చాలాకష్టం. అందుకు అమ్మాయిలు పడే కష్టం అంతా ఇంతా కాదు. సరైన చీరలను ఎంపిక చేసుకోవాలి. చీరలకు తగిన విధంగా బ్లైజులు సెట్ అవ్వాలి. అన్నీ ఉండి వాటిపైకి మ్యాచింగ్ ఆభరణాలు లేకపోతే అదో ఇబ్బంది. మామూలు బర్త్ డేలు, ఫంక్షన్లు, పార్టీలకు వెళ్ళేటప్పుడు క్రేప్ చీరలు బాగుంటాయి. రిచ్ గా కనిపిస్తాయి కూడా. బయట జరిగే ఫంక్షన్లలో అయితే సింగిల్ పల్లు ఉండి కొంగు కాస్త షార్ట్ గా ఉండేవి యువతులకు నప్పుతాయి. అదే గ్రాండ్ గా ఉండాలనుకుంటే షార్ట్ స్టెప్స్ తో చీరకట్టు అందరర్నీ ఆకట్టుకకుంటుంది.

జ్యువెలరీ విషయంలో పొట్టిగా ఉండే మహిళలు షార్ట్ ఇయర్ రింగ్స్, లాంగ్ చెయిన్ వేసుకొంటే బాగుంటుంది. పొడుగ్గా వుండే వారు లాంగ్ ఇయర్ రింగ్, షార్ట్ చెయిన్స్ వేసుకోవాలి. మేకప్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం వేళల్లో కాస్త లైట్ గా టచప్ చేసుకుని వెళితే బాగుంటుంది. అదికూడా కాలానికి అనుగుణంగా ఓవర్ మేకప్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

English summary

Tips to wearing the Right Clothes for Summer ....| వేసవిలో మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలి....


 Summer is the season of warmth, bounty, greenery and thus fashion should also be some thing to exude a feeling of happiness and joy; feelings of freedom to experiment and have fun with colours. Summer means giving up the heavy, layered clothing and giving in to light, airy clothing. Whilst dressing in a approach to exude mirth and warmth 1 need to also take care to incorporate the proper protective measures against severe heat and sun burns.
Story first published:Tuesday, March 20, 2012, 12:33 [IST]
Desktop Bottom Promotion