Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సాంప్రదాయం ఉట్టిపడేలా అలంకరణ...

ఫ్యాబ్రిక్: మన భారతీయ సాంప్రదాయంలో ఏపండగైనా, ఏ పార్టీ, ఫంక్షన్ అయినా చీరకట్టుకోవడం, లంగా ఓనీ వేసుకోవడంతో సాంప్రదాయ కళ ఉట్టిపడుతుంది. అందుకోసం ధర్మవరం, గద్వాల్, బెనారస్, కంచిపట్టు, కంజీవరం, ఉప్పాడ...ఇలా ఏదైనా సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఎంచుకోవాలి. అయితే ఎవరి శరీర ఆకృతి బట్టి వారు ఫ్యాబ్రిక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బెనారస్ కట్టుకోవాలనుకునేవారు లావుగా ఉన్నట్టైతే జార్జెట్ బెనారస్ ఉపయోగించవచ్చు. అదే స్లిమ్ గా ఉన్నవారు అయితే బెనారస్ ఫ్యాబ్రిక్స్ ఎన్నుకోవచ్చు. లావుగా వున్నవారు టిష్యూ లేని ప్లెయిన్ కంచిపట్టు బార్డర్ ఉన్నది ఎంచుకోవాలి. నలభై ఏళ్లు దాటిన వారు కాటన్, సిల్క్ గద్వాల్ చీరను ఎంచుకోవాలి.
కలర్స్: ఆకుపచ్చు, ఎరుపు, రాణిపింక్, పసుపు, ..ఇలాంటి సాంప్రదాయ రంగులు మన పండగలకు, శుభకార్యాలకు మంచి ఫీల్ ని ఇస్తాయి. లేత రంగులు ఇష్టపడేవారు ఈ కలర్స్ లోనే లైట్ వి ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో కూడా లావుగా ఉన్నవారు ముదురు రంగులను, సన్నగా ఉన్నవారు లేత రంగులను ఎంచుకోవచ్చు.
ఆభరణాలు: మెరిసే వాటికన్నా యాంటిక్ జ్యూవెలరీ పండగ రోజుకు బాగుంటాయి. తెల్లగా వున్నవారు డైమండ్స్, రంగు తక్కువగా ఉన్నవారు రూబీస్, ఎమరాల్డ్ వేసుకోవచ్చ
మేకప్: పగలు మేకప్ మరీ ఎక్కువగా ఉంటే బాగోదు. అందుకని మీడియం టోన్ ఉన్న మేకప్ ను ఎంచుకోవాలి. చీరలో ఉన్న రెడ్ ఫింక్ షేడ్స్ తగ్గట్టుగా కు మేకప్ వేసుకుంటే బాగుంటుంది.
కేశ అలంకరణ: పండగలకు పొడవాటి జడలు అందంగా ఉంటాయి. జుట్టు పొట్టిగా ఉంటే సవరాలు పెట్టి పొడవుగా వేసుకోవచ్చు. అలాగే వదిలేసేవారికి ఎక్స్ టెన్షన్ హెయిర్ కూడా మార్కెట్ లో లభిస్తుంది. పువ్వులు ఇష్టపడని వారు రాళ్ల బిళ్లలు కేశాలంకరణకు వాడొచ్చు..



Click it and Unblock the Notifications