Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఉగాది రోజు సాంప్రదాయ అలంకరణ....

ఉగాది పండుగ రోజు మరింత అందంగా కనబడాలంటే అందానికి మెరుగులు దిద్దాల్సిందే. అయితే మేకప్ వేసుకునే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా అందంగా కనిపిస్తారు. వేసవిలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ లేదా క్రీమ్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
1. ఉదయాన్నే లేవగానే తలంటు స్నానం చేసి కురులను బాగా నీడలో ఆరనివ్వాలి.
2. ముఖానికి మేకప్ వేసుకునే ముందుగా ఫౌండేషన్ క్రీమ్ రాసుకొని, తర్వాత ముఖ రంగును బట్టి పౌడర్ ను రాసుకొని బింది(బొట్టు)మీకు నచ్చిన రీతిలో పెట్టుకోవాలి.
3. మేకప్ వేసుకునే సమయంలో కళ్ళపై మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీంతో మరింత అందంగా కనబడతాయి.
ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాక్ లేట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్‌లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగించండి.
4. ప్రస్తుతం వేసవికాలం కాబట్టి మీ పెదాలకు క్రీమ్ రూపంలో ఉన్న లిప్ స్టిక్ ఉపయోగించండి. దీనికి ప్లమ్, బర్గండీ, వైన్, కోరల్, బ్రాంజ్ షేడ్ లు ఉపయోగిస్తే మీ అందమైన పెదాల అందం ఇనుమడిస్తుంది.
5. చక్కగా జడవేసుకొని కేశాలంకరణ చేసుకోవాలి. తల నిండుగా పువ్వులు ముడుచుకుని, పాపిటి బిళ్ళ, కేశ అలంకరణ ట్రెండు తగ్గ విధంగా అలంకరించుకోవాలి.
6. తర్వాత టీనేజ్ అమ్మాయిలు పరికిని, వయస్సుకు తగ్గ కొత్తబట్టలు, అబ్బాయిలు ట్రెండ్ కు తగ్గ కొత్త బట్టలు వేసుకుని తగిన విధంగా అలకంరించుకోవాలి.
7. చేతులకు నిండుగా గోరింటాకు పెట్టుకొంటే మరింత అందగా కనిపిస్తారు. మహిళలు కొత్తబట్టలకు తగిన విధంగా ఆభరణాలను, చేతుల నిండుగా రంగు రంగు గాజులతో అలకరించుకోవాలి. ఇలా అలకరించుకొని ఉగాది పచ్చడితో, తీపి వంటకాలతో, మామిడి తోరణాలతో తృప్తిగా రోజును గడిపేయాలి.



Click it and Unblock the Notifications