For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమికుల రోజు ప్రియున్ని మత్తెక్కించే పరిమళం....

|

Roses Perfume
గులాబీ పువ్వుకి పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రేమ, వాత్సల్యం, స్నేహం లాంటి సున్నితమైన భావాలతో గులాబీలు కొన్ని వేల సంవత్సరాలుగా ముడిపడి ఉన్నాయి. అలోచనలపరంగా గులాబీలు సౌందర్య దేవతతోనూ, ప్రేమదేవతతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవి. ఆ తరువాత ఈరాస్ అనే ప్రేమ దేవతతో చేర్చబడి గులాబీల పేరు అల్లుకపోయింది.

ఇక సౌందర్య సాధనాల్లో గులాబీల హంగామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ తెలిసిందే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు. ముఖ్యంగా, నిత్య యవ్వనం కోసం మహిళలు ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి పటుత్వం లభిస్తుందట. అలాగే, నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మిలమిలలాడుతుంది. కొద్దిపాటి నీళ్ళలో పది చుక్కలు పన్నీరు వేసి, దానిలో ఒక పలుచటి గుడ్డను తడిపి ఆ గుడ్డతో శరీరం తుడుచుకుంటే ఆరోగ్యం మరింత ఫ్రెష్‌ గా ఉంటుంది.

ప్రేమికుల రోజును ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 14న జరుపుకుంటారు . ఈ రోజు ముందు వేలంటైన్‌ వీక్ అని (ప్రేమికుల వారము) అని జరుపుకునే ఆచారము ఉన్నది . వేలంటైన్‌ వీక్ లో మొదటి రోజు గులాబీ దినోత్సవం (రోస్ డే) ని జరుపుకుంటారు. వేలంటైన్‌ డే సెలబ్రేషన్స్ రోజ్ డే తోనే ప్రారంభమౌతాయి. ప్రేమకు చిహ్నంగా ఎవరైనా గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటారు. గులాబీ పువ్వులు, గులాబీ సౌందర్య ఉత్పత్తు, గులాబీ అత్తర్లతో ఈ నెల మాత్రం కొత్త ప్రేమికుల హవా కనిపిస్తుంది.

English summary

Vday Surprise Him With a Roses Perfume...! | ప్రేమికుల రోజు ప్రియున్ని మత్తెక్కించే పరిమళం....

Love charts its own course and varies in intensity. Give him a gift that is in tune with the intensity of your love and your level of involvement.
Story first published:Wednesday, February 1, 2012, 13:18 [IST]
Desktop Bottom Promotion