Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
షార్ట్స్ తో చక్కటి శరీరాకృతి..సౌకర్యవంతం..!

షార్ట్స్‌లో చాలా రకాలున్నాయి. కాకపోతే ఇవి అందరికీ నప్పవు. అంటే షార్ట్ వేసుకోవాలంటే ఫర్‌ఫెక్ట్ బాడీ షేప్ ఉండాలన్నమాట. సన్నని నడుం, కాళ్లు స్లిమ్‌గా ఉన్న అమ్మాయిలు షార్ట్స్ వేస్తే మంచిలుక్ ఉంటుంది. ఒక్కో శరీరాకృతి బట్టి ఒక్కోరకమైన షార్ట్ కంఫర్ట్‌గా ఉంటుంది. ట్రెండ్ ఎప్పుడూ ఫ్యాషన్ గాను, కంఫర్ట్ గాను ఉంటుందని గమనించండి. అందుకే ఈ వేసవిలో ఫ్యాషన్, కంఫర్ట్ కోసమని ఎక్కువగా షార్ట్స్ ను ధరిస్తున్నారు. అలాగే ఎక్సర్‌సైజ్ చేసేవారి కోసం వీటిని ప్రత్యేకంగా తయారుస్తారు. వాకింగ్‌కు, రన్నింగ్‌కు ఇవి చాలా చక్కగా సరిపోతాయి.
అయితే ఈ కాలానికి సరిపోయేలా దుస్తులు ధరించడంలో కొన్ని చిట్కాలు పాటించాలి. వేసవిలో మండే ఎండలకు అనువైనవిగా షార్ట్స్ ను చెప్పవచ్చు. ఒకప్పుడు పురుషులు మాత్రమే ధరిస్తూ వచ్చిన షార్ట్స్ ప్రస్తుతం మహిళలు తమ సౌకర్యార్థం ధరిస్తున్నారు. యువత, పెళ్లైన ఆధునిక యువతులు ఇంటి పనులు, వంట తదితర పనులు చేసేటప్పుడు అనువుగా ఉండేందుకు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.బయటకు వెళ్లేటప్పుడు, ప్రయాణాల్లో ప్రస్తుతం కాలేజీ అమ్మాయిలు అధికంగా వీటిని వాడుతున్నారు.
షార్ట్ షార్ట్స్‌ను అందరూ వేసుకోరు క్లాసిక్ షార్ట్స్‌కే ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. సింపుల్‌గా ఉంటూనే స్వీట్ పాయిజన్‌లా కనిపించడం దీని సై్టల్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. షార్ట్స్ వేసుకోవడానికి మొహమాట పడేవారికి కాప్రీలు మంచి ఆప్షన్. వదులుగా ఉండే రిల్సాడ్ షార్ట్స్ ఎక్పర్‌సైజ్ చేసేందుకు, యోగా క్లాసులకు, కారులో లాంగ్ డ్రైవ్ కు బాగుంటాయి. షార్ట్స్ కొనేముందు ప్యాకెట్లని గమనించాలి. ప్యాంటుకు ఉండే జేబుల మాదిరి బాగుంటాయి. షార్ట్స్ మీదికి హైహీల్స్ వేస్తే హాట్‌గా కనిపించొచ్చు. ఫ్లాట్స్ కూడా బాగుంటాయి.



Click it and Unblock the Notifications